May2009
మే 2009 సూచిక
- సమూహం కోసమే : షేక్ కరీముల్లా
- ఊరికే అలా తిరుగుతూవుంటాను : నాగరాజు
- మా చరిత్ర మాక్కావాలె! : దాసరాజు రామారావు
- ఏటొడ్డు : కోసూరి
- రెక్కలు : పి.శ్రీనివాస్ గౌడ్ మొత్తం చదవండి »
ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక
May2009
May2009
ప్రాణహిత మే సంచికకు స్వాగతం!
ఏప్రిల్ 30 మహాకవి శ్రీ శ్రీ జయంతి. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో శ్రీ శ్రీ జన్మించి ఇప్పటికి 99 ఏండ్లు! ఈ సంవత్సరం మనం శ్రీ శ్రీ శతజయంతి సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 1930 – 40లలో తన మహాప్రస్థాన గీతాలతో ఒక ప్రచండ ఝంఝామారుతంలా ప్రవేశించి తెలుగు సాహిత్యాన్ని ఊగించి శాసించి ఖండించి దీవించిన మహత్తర శక్తి మహాకవి శ్రీ శ్రీ . మొత్తం చదవండి »
May2009
- షేక్ కరీముల్లా
దశాబ్దాలుగా
వెతుక్కుంటూనే వున్నాను
పోగొట్టుకున్నాననుకుంటూ
ఎవరో కాజేసిందాన్ని
May2009
- నాగరాజు
ఊరికే అలా తిరుగుతుంటాను
దిక్కులను భుజాలకెత్తుకొని
దారుల కొసలు దాటి తచ్చాడుతూ వెదుకుతుంటాను మొత్తం చదవండి »
May2009
- దాసరాజు రామారావు
కొంచెం తవ్వి వదిలేసిన కందకాల్లో నిలబడి,
పురాస్మృతుల వికసిత పరిమళాలను పీలుస్తున్నా!
చరిత్ర జ్వలితనేత్ర
May2009
May2009
- పి.శ్రీనివాస్ గౌడ్
జీవం
రాలిపోయిన తర్వాత
మనిషి
మురిగిన కోడిగుడ్డు
గంధపు చెక్క
మనసు
May2009
ఇపుడే ఆయుధమూ అవసరం లేదు
అదొక్కటే చాలు!
దాన్ని కనిపెట్టే డిటెక్టర్లూ లేవు
నరుడు నడిచే దారిలో విశ్వాసాన్నిచ్చేది
మొత్తం చదవండి »
May2009
- కె. అంజనేయకుమార్
ఎప్పటికైనా
తలుపులు పదిలంగా తీయాలి
నిద్రిస్తున్న దేవతాస్త్రీ వంటి మీద
సీతాకోక వాలినట్టు…
మొత్తం చదవండి »
May2009
- అరుణ్ బవేరా
ఏ దుఖ్ఖానికైనా, ఆనందానికైనా ఏం కారణముంటుంది…?
అన్నిటికీ మనసే జన్మస్థానం.
కలలు మోసం చేస్తాయి కదా!
మొత్తం చదవండి »
May2009
- వి.చెంచయ్య
కొడవటిగంటి కుటుంబరావు బహుముఖ ప్రతిభావంతుడైన రచయిత. 1930నుంచి 1980 దాకా అర్థ శతాబ్దం పాటు విస్తృతంగా రచనలు చేసిన వాడు. కథలు, నవలలు, గల్పికలు వగైరా కల్పనా సాహిత్యంతో బాటు సాహిత్యం, రాజకీయాలు, చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృతం, సైన్సు సినిమా మొదలైన వైవిధ్యంతో కూడిన విషయాలపై లోతైనా విశ్లేషణలతో వ్యాస రచన చేసిన వాడు. చాలా మంది ఇతర రచయితలకూ, కుటుంబరావుకూ ఒక తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పాఠకుల ఆలోచనకు పదును పెట్డడం ఆయన ప్రత్యేకత. మొత్తం చదవండి »
May2009
- కాత్యాయనీ విద్మహే
కొడవటిగంటి కుటుంబరావు కథాప్రపంచం విస్తృతమైంది. మధ్యతరగతి జీవితంలోని వైవిధ్యాన్ని మానవ మనస్తత్వంలోని వైచిత్రిని చూపించి వ్యాఖ్యానించిన కథలివి. సాంస్కృతిక విలువలు, సంప్రదాయలు మానవ సంబందాలపై చేసే పెత్తనం ఎన్ని రూపాలలో వుంటుందో, దాని వల్ల ఉత్పన్న మయ్యే పరిణామా లెలా వుంటాయో, వాటిని ఎవరి సంస్కారానికి పరిధులకు తగ్గట్లు ఎలా పరిష్కరించుకొంటున్నారో చిత్రించిన కుటుంబరావు కథలు నిస్సందేహంగా పాఠకుల చిత్త సంస్కార అభివృధ్ధికి తోడ్పడతాయి. మొత్తం చదవండి »
May2009
-సి.కాశిం
ఇది తెలంగాణ. మారు పేరు గాయాలవీణ. దీని గతం పోరాటచరిత్ర. వర్తమానంలో నా ఆశను, ఆశయాలను భుజానికి తగిలేసుకొని సాగిపోతున్న బిడ్డలను కన్న తల్లి. నాడు నైజామోడికి వ్యతిరేకంగా పోరాడింది. అరవై తొమ్మిదిలో ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడింది. డెబ్బైలో దొరోడికి వ్యతిరేకంగా దండు కట్టింది. ఇంకా దండు సాగుతున్నది. ఇన్నేండ్లు నడిచి… నడిచి… కొట్లాడి…. కాళ్ళకు కలుకులొచ్చినవి. అయినా ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు ఉద్యమిస్తూనే ఉంది.
May2009
- గంటేడ గౌరునాయుడు
పొద్దు ములిగి పోయింది.
సంధ్యా రాగంలోని అందాల్ని కాక విషాదాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించిన ఓ నీటి రంగుల చిత్రానికి ఆ చిత్ర కారుడు పెట్టిన పేరది.
దిగంతాలకు విస్తరించిన అపారమైన జలరాశి. ఆ జలరాశి నడుమ ధ్యాన మన్నుడైన మునీశ్వరుడి శిరస్సులా గుడి గోపురం గూటి నుండి శలవు తీసుకుంటున్న కాంతి పక్షిలా గోపరుని వెనుక అస్తమిస్తున్న సూర్య బింబం.
May2009
- పి. వరలక్ష్మి
ఏడేళ్ల తరువాత దిలీప్ వాళ్ల అవ్వగారి ఊరికి పోతున్నాడు. తాత చనిపోయినప్పుడు పోయిందే చివరి సారి. అవ్వ చాలా సార్లు కబురు పంపింది రమ్మని. టెంత్ క్లాస్, ఎంసెట్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ క్లాసులు, ఎప్పుడూ బిజీ బిజీ. ఇప్పుడైనా మెడిసిన్లో సీటు రాకపోబట్టి, డిగ్రీలో చేరబట్టి కొంచెం గాలి పీల్చుకుంటున్నాడు. దిలీప్ వాళ్ల అవ్వగారు ఊరు ఈమధ్య తరచు పేపర్లో వస్తోంది. మొత్తం చదవండి »
May2009
గ్రీష్మతాపం పెచ్చరిల్లుతున్న అకవిత్వపు కాలంలో, హృదయాల నుండి హృదయాలకు సన్నజాజి పరిమళం వంటి సమ్మోహనపు సమయాలు కొడిగడుతున్న కాలంలో కవిత్వమంటే కేవలం దేహ సంబంధమైనదే అనుకుని పైపై మాటలతో వ్యాకరణాంశాలుగా మారిపోయిన గ్రీష్మతాపంలో బంధన చాయ చిరు జల్లై మనోవల్మీకంలోకి జొరబడిపోయింది.
May2009
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్
‘కవిత్వం నా గుండె మంట’- అంటాడు అన్వర్. అన్నింటికి దూరమౌతున్నా కవిత్వానికి దూరం కాలేక పోతున్నానన్న కవి బలహీనతే బహుశా పై రెండు మాటలకు బలాన్నిస్తున్నాయి. ‘ముఠ్ఠీ’ (పిడికిలి) కవితా సంపుటిలోని 51 కవితలు చదివితే కవి నిరంతర పరిణామశీలమైన సమాజంలోని పరిణామాలకు భాగస్వామి అవుతూనే ఆలోచనని, ఆవేశాన్ని బాహ్య ప్రపంచంతో కలిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం చదవండి »