ఏటొడ్డు

- కోసూరి

ఏటొడ్డున నుంచుంటే
చిన్నప్పుడు
అచ్చు పుస్తకం
గూటిపడవతో
ఏరంతా ఈదిన జ్ఞాపకం

తుంగ కాడను
తుంపులు తుంపులుగా
హారాలు చేసి
తరగతికి తగిలించినట్లు గుర్తు

కాలంలా గమ్మున పోతున్న
నత్త నెత్తిన
ఒక్కసారిగా తాకినట్లూ,
నిశ్శబ్దంగా నీళ్లలోకి చూస్తూ
తాబేలు తల అంత వేగంగా
లోనికెలా వెళ్తుందోనని
ఆలోచనల్లో మునిగినట్లూ

ఎన్నికల వరుసల్లో నిలబడ్డ నాన్న
మేడి పండులో
పురుగుల్ని వూదినట్లూ
ఒక చల్లటి కల

ఏటొడ్డు
ఒక స్నేహితుడు
ఒక మార్గదర్శకుడు
ఎన్ని వింతలు చూపించి
నన్ను తీరం చేర్చిందీ
తడిసి, ఎండి,
దమ్ము చక్రాల గాట్లు పడిన
జీవితపు చిత్రం
నా ఏటొడ్డు

ఇప్పుడు ఏటొడ్డు
కొంగు బిగించిన ఒక స్త్రీ
ఏదో లోహవు గొట్టం
తన రెల్లు పైటలోంచి
తొంగి చూస్తోంది
బహుశా తప్పనిసరిగా
అది ఆయుధమే నేమొ
ఎవరికోసమో
మాటేసి వున్నట్లుంది

నలుగురైదుగురు కలిసి
ఒకేసారి చిందరవందరగా
హింసించినప్పటి బాధఏదో
ఇంకా వాళ్ళంతా సెగలు కక్కిస్తున్నట్లు
తన చుట్టూ వున్నగాలి
వేడిగా వీస్తోంది
బలవంతంగా లాక్కుపోయిన
గుర్తులేవో ఇంకా ఆ చిత్తడి నేలలో
నెత్తురుడికిస్తూనే వున్నాయి.

నిన్న ఈ రోజు, రేపు
ఎగబడ్డ పశువు కోసం
ఏటొడ్డు దగ్గరే
నాయిన ఎన్నికల లైన్లో వూదేసిన పురుగుల కోసం,
పంటను చెరిపేసే
అడవిపందుల కోసం
కాసినట్లు
కాపేసి వుంది….

ఏటొడ్డు
ఒక స్నేహితుడే కాదు
మృగం కోసం మాటేయటాన్ని నేర్పే
మార్గదర్శకుడు కూడా

అభిప్రాయాలు లేవు »కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో