యివాళ వుండెళ్లు…

- అరుణ్‌ బవేరా

ఏ దుఖ్ఖానికైనా, ఆనందానికైనా ఏం కారణముంటుంది…?
అన్నిటికీ మనసే జన్మస్థానం.
కలలు మోసం చేస్తాయి కదా!
అవును
కలల్ని నువ్వూ మోసం చేస్తావు!
ఎట్లా జరుగుతుంది ఈ పరస్పర మోసపూరిత ప్రేమ…?
నీలో ఇంత విధ్వంసం,
జరుగుతుందని ఎన్నడైనా గుర్తించావా….!
అలలు అలలుగా ఎగసిపడే మనసు
నీలో యిన్ని శిథిలాలున్నాయా…? తెలుసా నీకు…?
నీ శోకాన్ని సముద్రానికి వినిపిస్తావా….!
ఈ లోకం ముందు యిట్లా మోకరిల్లుతూనే… దాన్ని ఏమని పిలుస్తావు నువ్వు…?
నీ శాసనాలు ఎవరు అమలు చేస్తారో ఈ లోకంలో…?
నా కోసం మిగుల్చుకున్న
ఈ రెండు క్షణాల్నీ నీ దోసిట్లో పోసాను… ఏంచేస్తావు నువ్వు…?
నీ చూపు సోకిన చోటల్లా …అక్కడ నేనై కరగనా…!
నా కోసం మిగిలిన ఈ ఒక్క ఆకాశాన్నీ నీ నుదుటన పెడుతున్నాను
యిప్పుడు….నాలో గర్జించేది నువ్వే!
నీలో మెరిసేది నేనే!
కరిగిపోతావా… నా కళ్ల చివర వెలిగే వెన్నెల్లో
యింకా నన్ను మాటాడనీ…
నా తెల్లటి రెక్కలతో ఈ ప్రపంచానికి గాలి విసిరి జోల పాడనీ…!
అలా వెళ్లిపోకు మిత్రమా దిగులుగా….
యివాళ ఉండెళ్లు….
నీతో ఈ ఒక్క సాయంత్రానికీ నోచనీ….!

3 అభిప్రాయాలు »కవితలు

3 Responses to “యివాళ వుండెళ్లు…”

  1. 1
    dasaraju ramarao Says:

    ఆకాశాన్ని నుదుట బొట్టు పెట్టినా, శిధిల శోకాన్ని సముద్రానికి వినిపించినా,ప్రేమ, కలలు

    మోసం చేసినా,తెల్లటి రెక్కలతో గాలితో జోల పాడినా, ఆప్తుని శాసనాలు అమలు కాని విద్వంసపు లోకంలో, ఎన్ని క్షణాల్ని కరిగించి దోసిట్ల పోసినా, మార్దవపు మనసున్న మిత్రుడు దిగులు గానే వెళుతుంటాడు, లోన గర్జించుకుంటూనే…అతని వెన్నంటె మీ కవిత్వము కూడా!

  2. 2
    bendalam krishna rao Says:

    మానవతను కవితగా వినిపించినఅరుణ్ బవెరా కు అభినందనలు

  3. 3
    m s naidu Says:

    మీ కవి, మీ లోని కవిత, “నా కళ్ల చివర వెలిగే వెన్నెల్లో” ….

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో