May2009
వైవిధ్య పరిమళాలు వెదజల్లిన ‘మట్టిపూలూ’ ఆవిర్భావ సభ
భరతఖండం, భారతదేశం, హిందుస్థాన్ మొదలైన అనేకానేక పేర్లతో పరిఢవిల్లుతున్న మన దేశంలో కొన్ని వర్గాలు ఐదుతలల అగ్రవర్ణసర్పాల వేటుకు గురవుతున్నారు. ఆధిపత్యకులాల కుట్రల్లో భాగంగా ఎన్నో విధాల వివక్షలతో పాటూ ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ స్త్రీలు మరికొన్ని అదనపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పితృస్వామ్య, కుల, కుటుంబ హింసకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల ఫలితాలేవి వీరికి చేరట్లేదు. భారతదేశంలో స్త్రీవాదమంటే ఆదిపత్య వర్ణాల స్త్రీల సమస్యలు మాత్రమే ప్రస్తావించబడుతున్నాయి. అందులో ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ గురించి ఏమి ఉండదు. పైగా వీరిని అణిచివేసే క్రమంలో ఈ స్త్రీవాదుల పాత్ర కూడా ఉంటుంది. స్త్రీ వాదం చల్లబడింది, మహిళల కలాలు, గళాలు స్థబ్ధమయ్యాయి అనే వాదనలకు తెర దించేందుకు ‘మనలో మనం’ సదస్సు విశాఖలో నిర్వహించబడింది. కాని ముందు కంటే భిన్నంగా ఏమీ జరగలేదు. అక్కడ వివిధ అస్థిత్వాలకు సంబంధించిన చర్చల్లో ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటి అస్థిత్వాల ప్రతిపాదన గుర్తించలేదు, వీరి సమస్యలను గురించి చర్చించలేదు. వీరి ప్రశ్నలకు వాదనలకు సమాధానాలు దొరకలేదు. ఎన్నాళ్లనుండో మనుసుల్లో మెదలుతున్న ఆలోచన అయినప్పటీకీ ‘మనలో మనం’ అనుభవంతో అత్యవసరంగా ప్రత్యేక వేదిక అవసరాన్ని గుర్తించి ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ రచయిత్రులు ‘మట్టిపూలు’ పేరుతో ఒక వేదికను ఏర్పరుచుకున్నారు.
ది:22-03-2009 ఆదివారం నాడు హైదరాబాదులో ‘ప్రోగ్రెసివ్ మీడియా కార్యాలయం’లో “మట్టిపూలు” ఆవిర్భావసభ నిర్వహించబడింది. దళిత, బహుజన, మైనార్టీలకు చెందిన సాహితీకారులు, సాహిత్యాభిమానులు 50 మందికి పైగా మహిళలు ఈ సభలో పాల్గొన్నారు. వారికి జరిగిన అన్యాయాలను, అణిచివేతలని చర్చించుకున్నారు. తరతరాలుగా జరుగుతున్న రకరకాల దాడులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అత్యధిక సంఖ్యలో ఉండి అల్ప సంఖ్యాకుల ఆధిపత్యధోరణులను వ్యతిరేకించాలని తీర్మానించుకొని, మార్గాలను, ప్రణాళికలను చర్చించుకున్నారు. ఒకరి బాధను ఒకరు పంచుకున్నారు, ఒకరి కోసం అందరం నిలుద్దామని ధైర్యం చెప్పుకున్నారు. ‘మట్టిపూలూ ఆవిర్భావసభ ఒక చారిత్రాత్మక సంఘటన అని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా రాష్టం నలుమూలల నుండి వచ్చిన మహిళామణులు చర్చల్లో ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు.
సభ తమతమ పరిచయాలతో ప్రారంభమైంది. జూపాక సుభద్ర ఐక్య వేదిక అవసరాన్ని, మట్టిపూలు శీర్షిక, కార్యాచరణ పై అభిప్రాయాల ను ఆహ్వానించారు.
-
డా.జెల్లి ఇందిర, (పద్మావతి విశ్వవిద్యాలయం, తిరుపతి): ఐక్యవేదిక అవసరం ఎంతోఉంది. మనకు పత్రిక అవసరం. ఈ చర్చలు సభానిర్వహణంతా రికార్డు చేయబడాలి, సిద్ధాంతాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అందరి అనుభవాల సారం సిద్ధాంతం అవుతుందన్నారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీలు మిత్రుత్వంతో సాగితే ఏదైనా సాధిస్తాం అన్నారు.
-
శ్రీదేవి (కరీంనగర్): శీర్షిక గురించి స్పందిస్తూ పూలు అనేది సున్నితత్వాన్ని స్పురింప జేస్తుంది కాబట్టి మెరుగైనది మరొకటి ఆలోచిస్తే బాగుంటుంది, ఐక్యవేదిక అవసరం ఏంతో ఉందన్నారు.
-
జి. విజయలక్ష్మి (బి.సి.జర్నలిస్ట్, హైదరాబాదు): బి.సి.లు అన్ని ఉద్యమాల్లో అన్ని సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నారు, అన్నింటికి స్పందించారు, నేను ఒకొక సారి బి.సి.నన్న సంగతి మరచి, దళిత మైనారిటీల సమస్యలపై రచనలు, ఉద్యమాలు చేశాం, ఇప్పుడు మీకేం చరిత్రుంది, మీరేం ఉద్యమాలు చేశారు అనే ప్రశ్నల ఎదుర్కొంటున్నం. ఇప్పుడు నా గురించి నేను రాసుకోదలుచుకున్నాను. ఆనేక అణిచివేతలకు, వివక్షకు గురయ్యాం. ఎటువంటి రాయితీ, సానుభూతి దొరకలేదు. ఈ సభకు రావడం పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. అన్నిటి కన్నా శక్తివంతమైన ఆయుధం అధికారం. ఆ దిశగా మన ప్రయాణం సాగాలి. రాజ్యాంగంలో బి.సి.లకు అన్యాయం జరిగింది, దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కలిగించాలన్నారు.
-
గోగు శ్యామల (నల్లపొద్దు, హైదరాబాదు): మట్టిపూలు, మట్టిమనిషి, మట్టికూతలు, మట్టికతలు… ఎప్పుడూ మట్టి కాకుండా చరిత్రాత్మక ఐడింటిటీ వుంటే బాగుంటుందన్నారు. ఇక్కడి కొచ్చిన వారంతా ఒక్కొక్కరు వారివారి రంగాలలో ధిక్కరించి, ఢీకొట్టిన ధీమంతులు. రైటింగ్ క్రైటేరియా మీదనే మనం కలవాలి, రాసేవాళ్లు పురమాయించే వాళ్లు కావాలి, ఆల్టర్నేట్ సిద్ధాంతాల ప్రాతిపాదికన, సిద్ధాంతపరంగా అభివృద్ధి కావాలి, నిర్మాణం గట్టిగా ఉండాలి. ఈ బేస్ లో స్త్రీల సమస్యలకు సంబంధించిన దృక్పధం అవసరం ఉంది, కలవడమనేది ఆనందకరం, దిక్సూచివంటి సిద్ధాంత స్థోమత, హైరార్కి వుంది, బ్రాహ్మణశక్తులన్నీ అలెర్టయి దాడులకు దిగవచ్చు, మనం ఎదుర్కోగలం, సిద్ధాంత పరంగా ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చేవాళ్లు వస్తారు లేక పోతే లేదు అన్నారు.
-
సూరేపల్లి సుజాత: చాల చోట్లకు వెళ్లినపుడు ఎస్.ఇ, ఎస్.టి, బి.సి, మైనారిటీలు అక్కడక్కడా కరివేపాకులా కనపడుతుంటారు. ఇలాంటి వేదిక అవసరం. ఆల్టర్నేట్ ఇంకేమయినా ఉందా.. ఒకే శక్తిగా ఒకదగ్గరికి చేరాలి, చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి, కామన్ ఐడియా ఒక పెద్ద గోల్. అదే వుమెన్ ఫోరం ఫర్ జస్టిస్ . చాలా మంది మగాళ్లకు ఇది ఇష్టం ఉండదు అన్నారు.
-
షాజహనా (హైదరాబాద్): మట్టిపూలు పేరు తాత్కాలికం, ఖమ్మం నుండి అనసూయ, వరంగల్ నుండీ కోయ కళ్యాణి, సూర్యానాయక్ కూడా వస్తాం అన్నారు. పనుల వల్ల రాలేదు. మైనారిటీలు అణచివేతలకు గురవుతున్నారు. అయేషా కేసు ఉదాహరణ, తెలంగాణ రచయితలు అరెస్టయితే ఎవరూ పట్టించుకోలేదు. బహిరంగంగా మాట్లాడ గలగాలి, మైనారిటీల పై దాడులు జరిగినప్పుడు అందరూ స్పందించాలంటే ప్రత్యేక వేదికవసరం, ‘మనలో మనం’ లో అదే చెప్పినా ‘ఖైర్లాంజీ గురించి రాస్తే’ భూమిక ప్రచురించ లేదు. ఇటువంటి చర్చలన్నీ రికార్డు చేయబడాలి. మన రచనలన్ని ప్రతి సంవత్సరం సంకలనాలుగా ప్రచురించాలి, మనం రాసినవే కాదు మనవాళ్లు అనుభవాలు ఓరల్ గా చెప్పినవి కూడా రికార్డు చేయగలగాలి అన్నారు.
-
డా.. జాలాది విజయ (ప్రజారాజ్యం పార్టీ): తనదైన శైలిలో కవితాత్మకంగా స్పందించి మనకోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకేయాల్లోకి వచ్చానన్నారు.
-
జ్వలిత (ఖమ్మం): బి.సి.లు అత్యధిక జనాభా ఉండి అత్యంత వెనుకకు నెట్టబడ్డవాళ్లు. 93 కులాలతో జనాభాలో 50 శాతం ఉన్నప్పటికీ ఎటువంటి అస్థిత్వం లేకుండా అనేక ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నాం, ఇంకా కొన్ని కులాలను బి.సి.లో చేర్చడమనేది రాజకీయ కుట్ర. రిజర్వేషన్ శాతం పెంచకుండా బి.సి.లలో చేర్చడం వల్ల బి.సి.లకు నష్టం జరుగుతుంది. ‘మనలో మనం’ అనేది సూడో ఐక్యత అయినప్పటికీ ఎన్నాళ్లనుండో నానుతున్న విషయం అయినా ‘మట్టిపూలు’ ఆవిర్భావించడానికి వారి చర్య ఎంతో ఉపయోగపడింది, బి.సి.లకు మైనారిటీలకు మధ్య గొడవ పెట్టే ప్రయత్నం జరిగింది. బి.సీ.అస్థిత్వ వేదిక గురించి ‘సింగిడీ’ ఆవిర్భావ సభలో, తెలంగాణ రచయితల సభల్లో అడిగినట్టే ‘మనలో మనం’ లో అడిగాం సమాధానాలు, స్పందనలు లేదు. దళిత, ఆదివాసి, ముస్లిం, క్రిష్టియన్, మైనారిటీలకు ప్రత్యేక అస్థిత్వాలను గుర్తించారు, కాని బి.సీ.లకు ప్రత్యేక అస్థిత్వం అంటే అందరికీ అభ్యంతరంగానే ఉంది అని జ్వలిత అంటున్నప్పుడు షాజహానా కలగజేసుకొని మేం బి.సీ.లమే నలుగురం ఉన్నం మమ్మల్ని బి.సీ.లుగా గుర్తించడంలేదు మీరు అన్నారు. జ్వలిత సమాధానం చెప్తూ మీరు బి.సీ.లు అయినా గుంపులో గోవింద అన్నట్టు వేరే అస్థిత్వాలతో ఉన్నారు, బి.సీ.లకు ప్రత్యేక అస్థిత్వ గుర్తింపు కావాలంటున్నప్పుడు ఇందిర కలగచేసుకొని సింగిడి, తె.ర.స. వేరు ‘మట్టిపూలు’ వేరు, ఇద్దరినీ ఒక గాటకట్టకండి, మండల కమీషన్ సమయంలో ఉద్యమించారని గుర్తు చేశారు. వాదనలొద్దు చర్చను కొనసాగించండన్నపుడు జ్వలిత చట్టసభల్లో 33శాతం రిజర్వషన్లో జనాభా దామాషా ప్రకారం 16 శాతం బి.సీ. మహిళలకు చెందాలి, క్రీమీలేయర్ని బి.సి.లకు వర్తింపచేయడమనేది రాజకీయ కుట్ర. అందులో అన్నివర్గాలు పాత్ర వుంది. బి.సీ. రచయిత్రులు (సాహితీకారులు) సంఖ్యా పరంగా చాలా తక్కువ, వారి గురించి వారు రాసుకుంది తక్కువ. అందరి కంటే భిన్నంగా బి.సీ.మహిళలకు ప్రత్యేక సమస్యలున్నాయి, అణచివేతలు అవమానాలున్నాయి. గుర్తింపు సానుభూతి లేదు ఇక సహానుభూతెక్కడిది. అందుకే ‘బహుజన స్త్రీ సాహిత్యాన్నీ సంకలనం చేసేందుకు ప్రకటనిచ్చాను.
-
జూపాక సుభద్ర (హైదరాబాద్): సాహిత్యంలో ఉద్యమ సాహిత్యంలో మనమెక్కడా లేము. నీలి మేఘాల్లో లేము. మనకాళ్లు సమానంగా లేవు కలిసి నడవడం కుదరదు, మాకు ప్రత్యేక సహకారం కావాలి, చలం, కొడవటిగంటి మా గురించి రాయలేదు, వారు చెప్పేది సమాజ స్త్రీలందరికి వర్తిస్తుంది అంటే మాకు అభ్యంతరం. కులం వేరు శ్రమ వేరంటున్నారు. శ్రమను గుర్తిస్తారట. ఐడెంటిటీ కావాలి అలయెన్స్ కావాలి అంటున్నపుడు ‘ఎల్లి ‘ నవలా రచయిత్రి అరుణ వాళ్లకేం మన గురించి రాయటానికి, వాళ్లు పిలిస్తే మీరెందుకెళ్లారు (‘మనలో మనం’) అన్నారు. ఇందిర కలగచేసుకొని 1938లో ఒక పుస్తకం వచ్చింది. అందులో దళిత స్త్రీలను వివాహం చేసికోవడం వల్లే భారతదేశ నాగరికత పతనమయ్యిందన్నారు. 1987లో దళిత యువతిపై పోలీస్ స్టేషన్ లో పోలీసులే సామూహిక అత్యాచారం జరిపారు. ఇటువంటివి మరెక్కడా కనిపించవు, దేవదాసీలను వుమెన్ చట్టాలకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. దేవదాసీలుగా మారడానికి ఆ స్త్రీలు చాలా వ్యతిరేకిస్తారు అదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర అన్నారు.
-
డా.వినోదిని(యోగి వేమన విశ్వ విద్యాలయం, కడప): మట్టిపూలకు ఒక ఫ్లాట్ ఫాం ఉంది కార్యాచరణకు సూచనలు కావాలి. ఇటువంటి సదస్సు ఏర్పాటుకు చాలా రోజులనుండి చర్చ నడుస్తుంది. శ్యామల, స్వాతీతో మాట్లాడా, ఫిర్యాదులున్నాయి, ఎస్.సి, ఎస్.టి, బి.సి, లను వ్యతిరేకించినా సిద్ధాంతపరంగా సమాధానాలు కావాలి. ఆధిపత్యవర్గాల మహిళలు తామను తాము తగ్గించుకొని వస్తే కలుపుకుందామా, 5సం.ల సోషల్ వర్క్ అనుభవం తో వాళ్లలో స్త్రీవాద పురుషులను కలుపుకుందామా, ‘మరియ కథ’ రాసినపుడు ఏ సిద్ధాంతం లేకుండానే రాసాను, కొందరు పాఠకులు ఇందులో సిద్ధాంతం చూపారు అన్నారు.
ఇందిర కలగ చేసుకొని ‘ దళిత స్త్రీల పై అత్యాచారాలూ మీద ఎం.ఫిల్ చేశాను కొన్ని అనుభవాలు తెలుసు. ఉద్యమాల అనుభవాలు తెలుసు. ఉద్యమాల అనుభవం ఉంది. సిద్ధాంతం వల్ల కచ్చితమైన సోషియో కల్చరల్ కాన్సెప్ట్ ఉంటుంది. కులం అమీబా వంటిది అది ఎక్కడయినా ఏ రూపంలో అయినా వుండవచ్చు ప్రభావం చూపవచ్చు. సిద్ధాంతం అవసరం చరిత్ర అధ్యయనం అవసరం. సైద్ధాంతిక భావ జాలం వుంటేనే నిలబడతాం’ అన్నారు.
-
చంద్రశీ (దళిత వుమెన్ థియోటర్): మట్టిపూలు బాగుంది. సున్నితంగా మట్టివాసన మట్టిపరిమళం బాగుంటుంది. సిద్ధాంతాలు మారతాయి. మారని సిద్ధాంతాలు కష్టాల పాలు చేస్తాయి. కమ్యునిష్టుల్లా సాధించేది ఉండదు. ఊరికో ‘ఖైర్లాంజి’ ఉంది, జరుగుతుంది. బి.సీ. మహిళల చేతుల్లోనే దళిత స్త్రీలు వివస్త్రలు గావించబడుతున్నారు, బాధించబడుతున్నారు అన్నారు.
-
పుట్ల హేమలత (రాజమండ్రి): మట్టిపూలు పేరు గురించి చర్చించను. మన భావజాలాలు వాళ్లకు కూడా తెలియాలి అంటే చర్చల్లో వాళ్లు కూడా పాల్గొనేలా చెయ్యాలి, సంవత్సరానికి ఒక్కసారైనా బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. రాబోయే తరానికి మన అనుభవాల సారం అందాలి. చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట భావజాలంతో అవగాహన పెరిగిందన్నారు.
-
శ్యామల: ఎవ్వరు విభీషణ పాత్రలు పోషించవొద్దు, కొరియర్ గా పని చేయవద్దు అన్నారు. వినోదిని మనలో మనం – మట్టిపూలు పరస్పర పూరకాలు కాదు. ఇదొక చీర అదొక చీర, ఇక్కడ చీర అక్కడ జాకెట్టు కుదరదు అన్నప్పుడు. డ్యూయెల్ మెంబర్ షిప్స్ వద్దు అని జ్వలిత అన్నారు.
-
అనిత (హైదరాబాద్): మన దృక్పధంతో స్త్రీల పై అత్యాచారాలను వ్యతిరేకించాలి, ఆ దిశగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అన్నారు.
-
వాజిద కాతిన్ (కర్నూలు): స్త్రీ సమస్యలు చాలా ఉన్నాయి. చేతవడి పేరుతో సజీవ దహనం చేస్తున్నారు కమిటీలు ఏర్పడి తమతమ ప్రాంతాలలో పేపర్ మీడియా ద్వారా హైలైట్ చేయాలి. ఆయేష కేసు విచారకరం. ఎవరూ పూర్తిగా శ్రద్ధవహించడం లేదు. బీడి కార్మికులు, బసివిని వ్యవస్థ పై పని చేయాలి అన్నారు.
-
రాజేశ్వరి (కొత్తగూడెం): సాహిత్యరంగంలో బి.సీ.లం తక్కువ ఉన్నాం. ఈ వేదిక ఆవిర్భావం ఆనందకరం. బి.సీ.లు సంప్రదాయాల ముసుగులో ఉండి ప్రోత్సాహంలేక వెనుకబడి ఉన్నారు. మన రచనలు సామాజిక సమస్యల పై ఉండాలి అన్నారు.
-
సూరెపల్లి సుజాత (సికిందరాబాద్): పోలేపల్లి ఉద్యమం పై వనిత టి.వీ, ప్రోగ్రాం చేస్తే ఇట్లాంటి వాటికి అర్ధగంట సమయం అవసరమా, అధికారుల పై కూడ చిత్రీకరించాలన్నారు. పల్లెల్లో మాల మాదిగ ప్రత్యేక చర్చీలున్నాయి. వివిధ కార్యక్రమాలు చేస్తున్నా నేనెవరికి తెలియదంతే అన్నారు.
సుధీర్ఘ చర్చానంతరం క్రింద కొన్ని తీర్మానాలను ప్రకటించారు:
-
ఎస్.సి, ఎస్.టి,బి.సి, మైనారిటీ స్త్రీల జీవితాలు సాహిత్యంగా ఈ వేదిక రికార్డు చేస్తుంది.
-
ఆధిపత్య కుల పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ వేదిక పని చేస్తుంది.
-
ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ స్త్రీలకు చెందిన అన్ని రంగాల పరిశోధన అన్నీ విశ్వవిద్యాలయాల్లో జరగాలి.
-
ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ స్త్రీల మేధస్సు పై జరుగుతున్న భావజాల దోపిడిని ఈ వేదిక వ్యతిరేకిస్తుంది.
-
ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీలకు సంబందించిన చరిత్ర తిరిగి రాయడం పై ఈ వేదిక పని చేస్తుంది. మొదలైన పదికి పైగా తీర్మానాలు చేశారు.
సాయంత్రం జూపాక సుభద్ర అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. షాజహానా స్వాగతం పలుకగా ప్రముఖ రచయిత్రులు కవయిత్రులు వినోదిని, జి.విజయలక్ష్మి, గోగుశ్యామల, జ్వలిత, పుట్ల హేమలత, వజీదా ఖాతున్ వక్తలుగా వ్యవహరించారు.
ఆ సభలో పాల్గొన్న సాహితీకారులు… నస్రీన్ ఖాన్, జాలాదివిజయ, చంద్రశ్రీ, డా.సరోజిని, అనిత, జెల్లి ఇందిర, సుజాత సూరేపల్లి, టి.రాజేశ్వరి, అనంత లక్ష్మి, కె.ఝాన్సి, శ్రీదేవి, కృష్ణవేణి, అనురాధ, టి.అనురాధ, సువర్చల మొదలైన వారు పాల్గొని చారిత్రాత్మకతను సృష్టించారు.
9 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు
May 4th, 2009 at 1:08 am
అలస్యంగ ఐనప్పఇకి మంచి పని జరిగింది. మత్తిపులు ఎర్పదతమ్ మంచి పరినమమ.
May 4th, 2009 at 7:11 am
ఈ రిపొర్టకు ర చ య త పెరు లె దు ఎందుక ని, ఇదే సంచికలో మొద టి రిపోర్టుకు
మలీశ్వ రి అని వుంది స మస్య్ ఏమిటీ ? అర్ద ము కాలేదు
May 6th, 2009 at 8:10 am
ఈ రిపొర్ట్ రాసిన వారి పెరు లేదు .పైన నేను అన్నట్టుగా రాసిన మాటల్లో’” వాళ్ల ఉమ్మడి వేదిక ఒక కుట్ర. వినోదిని వాళ్లు స్త్రీవాద పరిదిని కుంచింప చేశారు’” అన్న మాటల్లో వాస్తవం లేదు. ఒక సారి రికార్డులను సరి చూసుకుంటే బాగుంటుంది.నేను మట్టి పూలని కాని,ఉమ్మడి వేదికని కానీ మంచి పరిణామాలు గా ఆహ్వానిస్తాను.దళిత ,బహుజన స్త్రీ వాదం పై ఎన్ని శాఖల నుంచి అయినా విస్తృతంగా అధ్యయనం జరగాల్సిన అవసరం వుంది.అప్పుడే ఇతరులకి కూడా మట్టి పూలు ఏమి కోరుకుంటుకుంటున్నాయో , మట్టి పూల అస్థిత్వం ఏంటో తెలుస్తుంది.
దయ చేసి పై వ్యాఖ్యలకి ఈ సంచిక లోనే వివరణ కోరుతున్నాను.
-పుట్ల హేమలత
May 10th, 2009 at 5:51 am
వినొదిని వాళు స్త్రీవాదం కుంచింప చెసారు….. అన్న చోట వినోదిని గారు అన్న మాటలు ఇవి ” వాళ్ళు( అంటే స్త్రీ వాదులు) స్త్రీ వాదాన్ని కుంచంప్ చేసారు” భావించ గలరు, (హేమలత గారి మాటలు కావు)
ఇక ‘ ఉమ్మ డి వేదిక ఒక కుట్ర ‘ అని అన్లెదు అంటె వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం ఇవి రెండు ప్రింటింగు లో పొరపాట్లుగా భావించగలరు.
May 10th, 2009 at 6:00 am
ఎడిటర్ గారికి ఒక మనవి పుట్లహేమలతగారి మాట ల్లో”’ఉమ్మ్ డి వేదిక్ ఒక్ కుట్ర, వినొదిని వాళ్ళు స్త్రీ వాదాన్ని కుంచింప చేసారు” అనే వాక్యాలు తొల్గించ గలరు.
May 11th, 2009 at 12:25 pm
ఇదొక సుభ పరిణామం
అభినందనలు
May 23rd, 2009 at 1:50 am
బాగుంది……
అభినందనలు……..
కృపాకర్ మాదిగ
July 23rd, 2009 at 1:13 pm
మట్టి పూల వేదిక ప్రారంబించడము అభినంధనీయము. ఈ మట్టి పూల వేదిక నిలబడడానికి మనకు వీలున్నంతమేర్ ఆన్ని విధాలుగా సహకరించాల్సిన్ బాధ్యత్ ఉనంది.
March 5th, 2010 at 5:26 am
దళితులల్లొ మెధవులు చాల మ0ది ఉన్న దళితుల్ కొస0్ పనిచెయ్యఢ0 లెదు