ముఠ్ఠీ

- డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

‘కవిత్వం నా గుండె మంట’- అంటాడు అన్వర్‌. అన్నింటికి దూరమౌతున్నా కవిత్వానికి దూరం కాలేక పోతున్నానన్న కవి బలహీనతే బహుశా పై రెండు మాటలకు బలాన్నిస్తున్నాయి. ‘ముఠ్ఠీ’ (పిడికిలి) కవితా సంపుటిలోని 51 కవితలు చదివితే కవి నిరంతర పరిణామశీలమైన సమాజంలోని పరిణామాలకు భాగస్వామి అవుతూనే ఆలోచనని, ఆవేశాన్ని బాహ్య ప్రపంచంతో కలిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ”లేచి నిలబడ్డానికి ఎన్ని గాయాలైనా / మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చిగురించి / కొత్త ఆశల చిగురుల్ని తొడుగుతుంది’- ‘పతనమైన చెట్టుకాడ మొక్క / మళ్ళీ ఎదుగుతుంది / దూరం దూరంగా వుంటున్న నన్ను మళ్ళీ కౌగిలించుకుంటుంది ‘ అంటూ తన ఆశావహ దృక్పథానికి అద్దంపడతాడు. ‘ఓ నిశ్శబ్ద మెరుపు దేహంలో – ఓ నిశ్చల పిడుగు తనువంతా / అలలన్నీ లేచి ముంచే కెరటంలా – ముఠ్ఠీ” అన్నది కవి భావన బిగిసిన ‘ముఠ్ఠీ’ (పిడికిలి) గుండె బలానికి ప్రతీక. తెరుచుకున్న పిడికిలి కూడా జీవితంలోని శూన్యతను, వాస్తవాలను బహిర్గత పరిచి తేలికైనా మనసుతో మనిషికి ఒక రకమైన నైతిక బలాన్ని అందిస్తుంది. అన్వర్‌ కవిత్వానికి ఈ రెండు బలాలు ఉన్నాయి. వీటికి పునాదిగా దు:ఖం వుంది. ”దూప/ నిలువెత్తు దూప, కంటినిండా గొంతునిండా / మనసునిండా తనువంతా దూపా- అంటాడు. ఆత్మీయమైన పలకరింపుకోసం పలవరిస్తున్న కవి దూప ఒక పార్శ్వం. ”ఉన్నదంతా కొల్లగొట్టి దోపుకునే దూప” దారుల నుంచి పారా హుషార్‌ అంటూ పాఠకులను మేల్కొలిపే ప్రయత్నం కవి ‘దూప’ లో మరో పార్శ్యం.

కవికి ప్రతి అనుభవం ఒక గాయంలా మిగిలింది. జీవితంలోని వైరుధ్యాలను, వైరుధ్యాలలోని ఏక సూత్రాలన్ని అన్వేషించే ప్రయత్నంలో అవమానాలను మోస్తాడు. మోసాలనూ పలకరిస్తాడు. స్నేహలనూ పలవరిస్తాడు. ఈ ప్రయత్నంలోనే ఎదురయ్యే దు:ఖ సముద్రంలో ఈదులాడి ఈదులాడి తీరాన కూర్చోని గాయాలను కుప్పపోస్తాడు. జ్ఞాపకాలను ఏరుకుంటాడు. మమతల మట్టిని హత్తుకుంటాడు. ముస్లిం జీవితాలను, తెలంగాణ వెతలను స్పర్శిస్తాడు. ‘నాయిన’ జ్ఞాపకాలు. కలిసిన వ్యక్తులతో, తిరిగిన ప్రాంతాలతో పెనవేసికుపోయిన అనుభూతులు, సంవేదనలు ఆవిష్కరిస్తాడు.

ప్రజల జీవితాల్లోని వర్తమాన బాహ్య వాస్తవికతలు అన్వర్‌ కవిత్వానికి ప్రేరణగా నిలిచి కవితలు వస్తువు ప్రధానంగా అభివ్యక్తమౌతూ కొన్ని చోట్ల వచనానికి స్థానానిచ్చాయి. మనుషుల ప్రవర్తనా సరళి మీద, వర్తమాన సమాజం తీరుపట్ల కినుక వున్నా దు:ఖాల ఎత్తి పోత, అస్తిత్వ పోరాట లక్షణం, వ్యక్తిత్వం అన్వర్‌ కవిత్వానికి అదును పదును అందజేస్తున్నాయి.

  • ముఠ్టీ (పిడికిలి) – అన్వర్‌, పేజీలు, 108 : వెల. 40/- రూపాయలు ప్రతులకు : 16-10-374, శివనగర్‌, వరంగల్‌-506 002.

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

ఒక అభిప్రాయం

  1. జాన్ హైడ్ కనుమూరి May 4, 2009 1

    సమీక్ష బాగుంది.

    రూప్ కుమార్ కు, అన్వర్ కు అభినందనలు
    జాన్ హైడ్ కనుమూరి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో