May2009
రెక్కలు
- పి.శ్రీనివాస్ గౌడ్
జీవం
రాలిపోయిన తర్వాత
మనిషి
మురిగిన కోడిగుడ్డు
గంధపు చెక్క
మనసు
ఇప్పుడే
చిరునవ్వై మళ్లినవాడు
చివరిశ్వాసై
వెళ్ళిపోయాడు
రెప్పపాటు
జీవితం
సంక్లిష్ట
సమస్యల మధ్య
సదా
జీవన పోరాటం
బతుకు
ఉమ్మనీటిలో శిశువు
మనిషి యాంత్రికమౌతూ
యంత్రాలకు
మానవీయ స్పందనలు
అద్దుతున్నాడు
కన్నీళ్లుండవు
యంత్రాలకు
వర్షం
రాక ముందు
ఉమ్మదం తీస్తుంది
చల్లగాలి వీస్తుంది
సూచనలుంటాయి
ప్రతి ఘటనకు ముందు
చక్రాలున్నా
ఇరుసు లేకుంటే
బండి
ముందుకు సాగదు
జీవితానికి ఇరుసు
ప్రేమ