May2009
సమూహం కోసమే
- షేక్ కరీముల్లా
దశాబ్దాలుగా
వెతుక్కుంటూనే వున్నాను
పోగొట్టుకున్నాననుకుంటూ
ఎవరో కాజేసిందాన్ని
దొంగలు పడ్డ దివాళ
దేశంలో కాదు
తడిచెమ్మల గుండెల్లో
కోతి గుండెను నోటకరిచిన
మాయదారి గ్లోబల్ మొసలిలా
మన జీవితాలనెవరో
తస్కరించి పారిపోతున్నారు
ఘనీభవించిన నెత్తుటితో
కవాటాలెప్పుడో మూసుకుపోయాయి
ఆకాశహర్మ్యాల మధ్య చలికి వణుకుతూ
కుక్కపిల్లలాంటి బాల్యం
రాబందుల పహారాలో రాజ్యం
ఇండియా వెలిగిపోతుంది
ఢంకా బజాయించండ్రి
స్లమ్‌డాగ్ ఓ న్యూసెన్స్
దేశద్రోహులకెందుకో ఆస్కార్
ప్రతినగరం ఓ అత్తరువనం
ముక్కులు మూసుకోకండి
మార్కెట్‌లో మనసు, వయసు
సెన్సెక్స్ సూచీల్లా విలవిలలాడుతున్నాయి
అరెచల్!
మనకొద్దీ ఆత్మవంచన
రాత్రికి భయపడి వెన్నెల పారిపోతే
చంద్రుడికేం విలువుంటుంది
ప్రతి సూర్యాస్తమయం
కోటి నక్షత్రాల మెరుపుకోసమే
ఇది ప్రకృతి ధర్మం
మనిషైనా అంతే
ఉపక్రమించడం, నిష్క్రమించడం
సమూహం కోసమే
May 7th, 2009 at 8:08 am
కరీముల్లా గారు,రాథ్రికి భయపది వెన్నెల పారిపొథుందా..కవిథ బాగున్ది…గీతాంజలి
October 11th, 2009 at 6:23 pm
[...] సమూహం కోసమే : షేక్ కరీముల్లా [...]