తలుపులు తీయడమంటే

- కె. అంజనేయకుమార్‌

ఎప్పటికైనా
తలుపులు పదిలంగా తీయాలి
నిద్రిస్తున్న దేవతాస్త్రీ వంటి మీద
సీతాకోక వాలినట్టు…
అంటీ అంటక చేతి మునివేళ్ళు వుంచి
తలుపులు పరిమళంగా తీయాలి
అద్దం మీద
ఇల్లాలు పెట్టిన బొట్టు బిళ్ళ
అతి లాఘవంగా తీసినట్టు
తాళం కప్ప తీయాలి
పొయ్యిమీద తాలింపు కళాయి పక్కన
పరపరా ఉల్లిపాయ చాకుతో కోసినట్లు కాక..
మనసు కాగితంపై అనుభూతి కవిత రాసినట్టుగా
తలుపుకున్న గొళ్లెం మధురంగా తీయాలి
నిర్వచనాలు అందరూ ఒకేలా చెప్పినట్టు కాక
నిర్మల చలనాలు సముద్రగర్భంలో విచ్చుకున్నట్టుగా…
భళ్ళున కాక.. ఒక్క ఉదుటున
మన కనురెప్పలు తెరుచుకున్నట్టుగా
తలుపులు కనురెప్పలు తెరుచుకున్నట్టుగా
తలుపు అసంకల్పితంగా తీయాలి
ఇప్పుడు
తలుపులు తీయడమంటే
వరిచేలో…చేత్తో కలుపుతీయడం లాంటిది!
ఇప్పుడు
తలుపులు తీయడమంటే
రాజకీయాల్లో….ఓట్లతో కలుపుతీయడం లాంటిది!!
ఇప్పటికైనా
తలుపులు పదునుగా తీయాలి

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “తలుపులు తీయడమంటే”

  1. 1
    kcube varma Says:

    తలుపులు తీయడం ఎంత మృదువుగా కనురెప్పలు తీసినట్టుగా వున్న అంతే భళ్ళున శతృవుపై వెయ్య గలగాలి మిత్రమా. మీ కవిత చదవగానే కనురెప్పలపై సన్నని మృదువైన వేలి స్పర్శ్ అనుభూతి పొందాను. ధన్యవాదాలు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో