ఊరికే అలా తిరుగుతూవుంటాను

- నాగరాజు

ఊరికే అలా తిరుగుతుంటాను

దిక్కులను భుజాలకెత్తుకొని
దారుల కొసలు దాటి తచ్చాడుతూ  వెదుకుతుంటాను

రోజులు 
చెక్కిళ్ల మీద అట్టలు కట్టిన దుఃఖపు చారికలు

కాలం
మకిలిబారిన ముఖం మీద
ఎడతెగక పారే విషాద సంగీతం

ఎప్పటిలాగే
ఈరోజూ ఎలా మొదలైందో  చెబుతాను

అది దగోత్తర్తమైన దుఃఖం   

చేతులకు గొలుసులతో 
శరీరాన్ని ఆసాంతం సాగదీసినట్టు
ఏది మొదలో ఏది తుదో తెలియని
నిర్నిమిత్త రోదన

పొరల లోలోపల ఎక్కడో  కలగాపులగమయ్యే 
రసాయనాల ఒత్తిడి

కాసేపు మొగున్ని తిట్టి
కాసేపు సంసారాలను తిట్టుకొని
పాపిష్టి లోకం మీద భగ భగ మండే  ఎర్రటి దుమ్మును
దోసిళ్లతో పైకెగరజల్లి
చివరకు తనకు తానే తలబాదుకొని-

మాటలు చాలవు
ఏడుపు చాలదు 

కంఠ  నాళాలు తెగి తనువంతా
తెరలు తెరలుగా ఎగసిపడే  ఊర్పుల తాకిడిలో
లింకులు తెగి నిలువెల్లా
భళ్లున రాలిపడే  గొలుసుల చప్పుడు
 
సాఫీగా ఏ  అంగము కదపజాలని
నిస్సహాయతలో 
ఎండాకాలపు నడిరోడ్డుమీద దిసపాదలతో
నడచిపోతున్నపుడు

ఆమెను నాలో చూశాను

ఊరికే అలా తిరుగుతుంటాను.

 

4 అభిప్రాయాలు »కవితలు

4 అభిప్రాయాలు

  1. prashanth May 3, 2009 1

    నాగరాజన్నయ్యా… పోయమ్ మస్తు రాసినవ్. కాని , ఇంత అమూర్తాంగ వుంటే మా లాంటి పోరగాల్లకు, కస్తి ఐతది అన్నా…. ప్రశాంత్

  2. mohan May 3, 2009 2

    దుఃఖం ఏఫ్ఫూడూ ఇలాగే ఉంటది. కవిత బావుంది సోదరా.. పాత గాయాలు కొత్తగా కళ్ల ముందు కదిలాయి. కానీ ఇలాంటీ వాటీ వల్ల ప్రయోజనం ఏమిటంట అంటున్నారు కొందరు.. షహానుభూతి కలిగించగల ప్రతిదానికీ ప్రయోజనం ఉన్నట్టెనని నా అభిప్రాయం. స్ఫటిక సద్రుశంగా ఉన్న ఈ కవితకు ఓ కన్నీటి తడి పలకరింపుతో.. పి.మోహన

  3. kcube varma May 3, 2009 3

    మసిబారిన కాలం ముఖం మీద దుఖపు చారికలు మీ కవిత ద్వారా తుడిచే ప్రయత్నం బావుంది. దుఖం ఒక పురా జ్ణాపకం కాకూడదు. కన్నీళ్ళు ఇంకిపోకూడదు. కన్నీళ్ళు లేనివాడు సైనికుడు కాలేడేమో మిత్రమా.

  4. geethanjali May 7, 2009 4

    నాగరజు గరు..మాటలు,ఎ్డుపు చాలక పొథె ఎలా ,,భయంగ వుంది..గీతాంజలి..హ్య్ద్రాబాద

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో