June 2009 సంచిక

జూన్ 2009 సూచిక

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

హౌజ్ వైఫ్

- నీలిమ

నేనిప్పుడు చిన్నబోయిన నా ‘కంత’లోంచి
ఆకాశాన్ని చూస్తున్నాను
అంతా శూన్యం
నా ఆకాశాన్నంతా నువ్వాక్రమించావు
మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »కవితలు

ఒక కాలం గడిచిపోయాక

- అనిశెట్టి రజిత

1
ఒక కాలం రోజులూ నెలలుగా
నడిచి వెళ్ళి పోయాక
మరో కాలం వచ్చి చేరుతుంది
చెట్టాకులు రాలిపోతాయి
మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

తెల్ల దెయ్యం నీడ

- కాత్యాయనీ విద్మహే

పచ్చని పెద్ద మైదానాలు
పిల్లకాలువలు
పెద్ద పెద్దరోడ్లు
బారులు బారులుగా
మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

పుష్పసిద్ది

- ఎన్. అరుణ

విత్తనం నుంచి
పువ్వుదాకా నా ప్రయాణం
పువ్వు నా మజిలీ అయినప్పుడు
ఫలం నా గమ్యం

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

బతుకు పాట

- హరగోపాల్

మెతుకు మెతుకు మీద నీ పేరున్నదె రైతన్నా
ముద్ద ముద్దా నీ నెత్తురుముద్దలేనె కూలన్నా
ఏడ నిన్ను మరిచిపోదురా నా కన్నతండ్రీ
ఎట్ల నిన్ను విడిచివుందురా నా ప్రేమలతండ్రీ

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

తమన్నా

- ‘పాన్‌మరక’ అలీ

హైదరాబాద్‌ బంధం చార్మినార్‌ చమన్‌
బాంబుల మోతలు,మతాలు,మతలబులు
అమాయక జనాలు బలిపీఠంపై బొమ్మలు
బద్‌నామ్ కూతలు అమలిన మనసులు
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

మృగయ

- నామాడి శ్రీధర్

పట్టపగ్గాలు లేక
పరుగులెత్తే
కాంచనమృగమీ రోజు

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

విధ్వంసం ఆవలివైపు

-కె క్యూబ్ వర్మ

ఇప్పుడు నేను కవిత్వం
రాయలేకపోతున్నాను

నా అక్షరాల మాటున దాగిన
సన్నని దారాన్ని ఎవరో
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

ఆసుపత్రిలో పువ్వులు

- సుంకర రమేశ్‌

కాంతులీనే కళ్ళ నుండి
జలజలా రాలుతున్న కన్నీళ్ళు
నవ్వుల చందనాలు చల్లే
పెదవులు
మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

సందిగ్ధ సంధ్యలకు ఆవల….

-  ఝాన్సీ కె.వి.కుమారి

ఇప్పుడు. . . ఇక్కడ. .
క్షణం ఆగుదామా?
గడియారంలోని క్షణాల ముల్లును
వెనుకకు తిప్పి
యుగాల ఆవలకు
అడుగులు వేద్దామా?

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

దు:ఖానుభవం

- దాసరాజు రామారావు.

 

పత్రాల్లో
హరిత కలల్ని దాచుకున్న
చెట్టుకు
ఆకులు రాలడం విషాదమే

మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

జీవాధారం

- డా|| పి. విజయలక్ష్మి

ఇడ్లీ తుంచుకుంటూ ఎదురుగావున్న గోడగడియారంకేసి చూసిన నాగభూషణం ఉలిక్కిపడి గబగబా నోట్లో కుక్కుకోసాగాడు. పదకొండు గంటలలోపు ఖచ్చితంగా తన దగ్గరకి రావాలన్నాడు లాయరు. కావలి నుంచి గూడురుకి ఎక్స్‌ప్రెస్‌లో ఒకటిన్నరగంట ప్రయాణం. అప్పుడే తొమ్మిదవుతోంది. పినాకిని పట్టుకుంటే ఒళ్ళు కదలకుండా సుఖంగా దిగుండేవాడే. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు

అమ్మ

- ‘తాయమ్మ‘ కరుణ

ఎండెక్కింది. “పొద్దుబాయె. లే! లోపలికిరా” లచ్చుమమ్మను చెయ్యిపట్టి లేపబోయాడు నర్సయ్య.

పొద్దుకు చెయ్యి అడ్డం పెట్టుకొని దారి దిక్కు చూసుకుంటూ “ఆగయ్య, పిలగాడు ఇంకా రాకపాయె. కాసేపు చూసొస్త” లచ్చుమమ్మ చిరాకు పడుతూ అంది.
“ఏం జూస్తవ్. చూసినకాడికి సాల్లే. ఇంత తిందువుగాని రా’

మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »కథలు

మద్ధిస్తం

- వి ప్రతిమ

‘తప్పు చేశాను’. . . . అనేకసార్లు ఈ వాక్యం వివేకానందరెడ్డి మస్తిష్కంలో పదే పదే కంప్యూటర్‌ స్క్రీన్‌మీదలా నిలిచి మాయవవుతోంది.
కార్తీకమాసపు చలిరాత్రి అతడి నుదటి మీద చిరుచెమట హృదయపు ఆందోళనని బహిర్గత పరుస్తున్నట్లుగా వుంది.

మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కథలు

సంఘర్షణ

- డా. కొలకలూరి మధుజ్యోతి

కాలింగ్ బెల్ శబ్దం విని, చేస్తున్న పని ఆపి వచ్చి తలుపు తీసింది లత. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, ఎంత ఆశ్చర్యం ఆ ముఖంలో. లేచిన కనుబొమ్మలు దిగటం మర్చిపోయాయి విచ్చుకొన్న కళ్ళతో ఆనందం, వచ్చిన మనిషి ఎంత ప్రియమో తెలుపుతూ ఉంది. ముప్పిరిగొన్న ఆనందాశ్చర్యాలతో స్తబ్ధంగా నిల్చున్న లతను గుమ్మంలో నిల్చొన్న సుధ చూస్తూ ఉంది. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కథలు

క్రీడ

మార్చి నెల
ఉదయం ఎనిమిదిన్నర
అంత వుదయమైనా గానీ అప్పుడే ఎండ మాత్రం జనాలకు చెమటలు కురిపిస్తోంది.

కలెక్టరేట్, సమ్మర్ స్కూల్ ర్యాలీ కోసం గుమిగూడిన స్కూల్ పిల్లలతో, అధికార గణాలతో ప్రాంగణమంతా విరబూసిన పత్తి పొలంలా ఉంది. ఆ రంగుల పొలం కలెక్టర్ కారు కోసం ఎదురు చూస్తున్నది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు

Next »