ఆధునిక పరిజ్ఞానం – మహిళలు

- డా|| కే.శారద

సమాజ స్వభావం చలనశీలమైంది. మేధావులు సమాజాలను మూడూ రకాలుగా వర్గీకరించారు. మొదటివి – ఆహార సేకరణ, వేట ప్రధానంగా ఉన్న ఆదిమ సమాజాలు. రెండోవి – వ్యవసాయ సమాజాలు. మూడోవి – పారిశ్రామిక, సైబర్నెట్ సమాజాలు. విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల ఆధారంగా, పెట్టుబడి ప్రధానంగా జరిగిన పారిశ్రామికీకరణ సామాజిక పరిణామ దశల్లో ఒక గుర్తించదగిన మలుపు. ఈ మలుపు తిరిగిన కాలమే ఆధునిక కాలం. అప్పుడు ప్రచారంలోకి వచ్చిన స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు ఆధునికతకు పునాదులు. ఆధునికత, ఆధునికతావాదం, ఆధునికీకరణ అనేవి పదిహేడో శతాబ్దం నుంచి ఐరోపా ఖండంలో వాడుకలోకి వచ్చాయి. ఆధునికత అనేది సమాజపు ప్రత్యేక లక్షణాలను నిర్వచించే పదమే అయినా అప్పుడు కాల సూచిగా కూడా ఉంటుంది. మధ్యయుగపు సమాజ లక్షణాల నుంచి ఆధునిక యుగం తనను తాను వేరు చేసుకొంది.

పారిశ్రామిక పెట్టుబడి దారీ ఆర్ధిక వ్యవస్థలూ, ప్రజాస్వామిక , రాజకీయ సంస్థలూ వర్గాలుగా విడిపోయి ఉన్న సమాజాలను ఆధునిక సమాజాలుగా ఊహించవచ్చు. హేతువాద దృక్పధం, శాస్త్రీయత, వ్యక్తివాదం, పబ్లిక్-ప్రైవేట్ విభజన, ప్రజాస్వామ్యం, జాతీయ వాద సామాజిక ఉద్యమాలు, పరాయీకరణ, పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామికీకరణ మొదలైనవి. ఆధునికతలో కీలకాంశాలు. ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఐరోపాఖండ సమాజాలలో రూపుదిద్దుకొన్న అంశాలు. ఇవి ప్రపంచ ఐక్యతను సాధించే అంశాలుగా కూడా భావించబడ్డాయి.

అయితే యూరప్ సమాజాల్లో మార్పు తెచ్చిన అంశాలను ప్రపంచానికంతటికీ వర్తింపజేయాలనుకోవడం, ఈ పరిధిలోకి వచ్చిన దేశాలూ వాటి సంస్కృతి మాత్రమే అభివృద్ది చెందినవనీ తక్కిన సమాజాలూ, సంస్కృతులూ వెనకబడ్డాయనే ఆలోచనను ఆయాదేశాల ప్రజలలో కలిగించే ప్రక్రియ ఒకటి జరగడాన్ని మనం గమనించవచ్చు.

ఆధునికతను మొదటగా సంతరించుకొన్న ఫ్రెంచి, ఇంగ్లాండూ దేశాలు సాంస్కృతిక వైవిధ్యాలనూ, ప్రత్యేకతలనూ విస్మరించాయి. ఆధునికతలో స్వేచ్చా సమానత్వాలు సంపూర్ణంగా అనుభవంలోకి రాలేదనే విషయం అర్ధం చేసుకోబడిన విషయమే.

ఆధునికతను సంతరించుకొన్న దేశాలు ఆధిపత్య దేశాలుగా చెలామణి అవుతూ, తమ ఆధిపత్యాన్న్ని మిగతా ప్రపంచ దేశాల మీద రుద్దడానికి కూడా ప్రయత్నించడం చారిత్రక సత్యం. అంతేకాదు – మిగిలిన ప్రపంచ దేశాలలోని జాతులు తమని తాము సంస్కృతీ హీనమైన జాతులుగా, అభివృద్ది చెందని దేశాలుగా భావించుకొనేటట్లు చేశాయి. ఈ భావన నుంచే ఆయా జాతులు తమ సంస్కృతుల్ని వదులుకొని గుడ్డిగా పాశ్చాత్య సంస్కృతిని కౌగలించుకొన్నాయి. అలా కౌగలించుకొన్న దేశాల్లో తొలిచదువులు (వేదాలు) చదువుకొన్న భారత దేశం కూడా ఒకటి.

పారిశ్రామీకరణలో భాగంగా ఏర్పడిన వలసరాజ్య స్థాపన భారతదేశంలో జరిగిన తర్వాతనే, ఇంగ్లీషు విద్య ద్వారానే భారతదేశంలో ఆధునికత కాలూను కొన్నది. అప్పటి భాఅత సమాజానికి ఆధునికత అనివార్యమైన పరిణామైంది. ఉద్యమ స్థాయిలో జరుగుతున్న మత మార్పిడులను అడ్డుకోవలసిన అవసారాన్ని భరతదేశంలో మధ్యతరగతి మేధావులు గుర్తించారు. హిందూ సమాజంలోని వర్ణ, వైషమ్యాలను సవరించుకోవలసిన సంధర్భమది. మన ప్రమేయం అంతగా లేకనే భారత దేశంలో పారిశ్రామికీకరణ చాపకింద నీరులా ప్రవేశించింది. రవాణా సౌకర్యాలు, తంతి, తపాలా సౌకర్యాలు, ఏర్పాటైపోయాయి. సమాచార ప్రసార వ్యవస్థ ఏర్పడింది. ఆధునికతను మనం ప్రత్యేకంగా ఆహ్వానించకుండానే మనదేశంలోకి ప్రవేశించింది.

అప్పటి భారత సమాజంలో కొన్ని చారిత్రక కారణాల వల్లా, పరిస్థితులవల్లా, గందరగోళ స్థితి నెలకొని ఉంది. మూర్ఖ మత విశ్వాసాలూ, అవిధ్య, సాంఘిక దురాచారాలు ప్రబలి ఉన్న స్థితి అప్పటి భారతదేశానిది. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన విద్యావిధానంలో తయారైన మధ్యతరగతి మేధావులు ఒకదశలో బ్రిటీష్ పాలనను సమర్థించాయి. అందుకు కారణం వాళ్లు అవలంబించిన ఆధునికతే.

పాశ్చాత్య దేశాల ఆధునికత ప్రాచ్య దేశాల స్త్రీల దిగజారిన స్థితిగతుల్ని మెరుగు పర్చడానికి ఆవిర్భవించకపోయినా, అనివార్యంగా భారతదేశంలో ప్రవేశించిన అదే ఆధునికత ఆ దేశ స్త్రీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు హేతువైంది. పునరుజ్జీవనం, సంఘసంస్కరణ, జాతీయ ఉద్యమాల రూపంలో భారత దేశానికి ఆధునికత వ్యాపించింది.

సమాజం ఆధునీకరింపబడే దశలో వ్యక్తమయ్యే పరిజ్ఞానమే ఆధునిక పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానం మన స్త్రీల జీవితాలలో ఏ మార్పులు తెచ్చిందో అంశాల వారీగా పరిశీలిద్దాం

విద్యారంగం:

ఇది చాలా ప్రధాన మైన రంగం. మన దేశంలో స్త్రీలు విద్యారంగానికి (సంప్రదాయ విద్య ) క్రమంగా దూరమయ్యారే గాని మొదటినుంచీ కాదు. మహమ్మదీయులు మన దేశానికి తెచ్చిన పరదా పధ్ధతి మన స్త్రీల పరిస్థితిని దారుణంగా మార్చి ఇంటికే పరిమిత మయ్యే స్థితికి నెట్టేసింది. అందరికీ అన్ని అవకాశాలూ సమానంగా అందడం ఆధునిక సమాజ సలక్షణం. చాలామంది స్త్రీలు విద్యారంగంలో అత్యున్నత స్థాయి ఎదుగుతున్నారన్న విషయస్ం ప్రత్యక్షంగా కనిపిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కంప్యూటర్ విద్యలో కూడ స్త్రీలు గణనీయంగా ప్రవేశించి ఉన్నారు. ఇదంతా ఆధునికత తెచ్చిన మార్పుల వల్లే సాధ్యమైంది. విద్యవల్ల ఉద్యోగాలు, వాటి వల్ల ఇంటి బైట భిన్నమైన పరిస్థితులను, సంక్లిష్ట సంధర్భాలనూ ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కావలసిన మనస్థైర్యమూ నేటి స్త్రీలకు ఉన్నాయని నిరూపిస్తున్నారు.

ఉద్యోగ స్వామ్యంలో భాగస్వాములైన స్త్రీలలో ఏర్పడీన ఆధునిక దృక్పధం జీవితంలొణి అన్ని పార్శ్వాల పట్ల హేతువాద ఆలోచనా విధానాన్ని ఏర్పరిచింది. అయితే లక్షలాది మంది స్త్రీలు విద్యారంగంలో అభివృధ్ధికి నోచుకోకుండా ఉన్నారు. కర్మిక, శ్రామిక, కర్షక రంగాల లాంటి అసంఘటిత రంగాలలో పని చేస్తున్న స్త్రీల హక్కుల్ని కాపాడటానికి విద్యావంతులైన స్త్రీలు తమ ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినపుడే వారి విద్యకూ, జ్ఞానానికీ సార్ధకత.

ఉపాధిరంగం:

ఆధునీకరణలో ప్రధాన సూత్రమైన పారిశ్రామికీకరణ వల్ల లక్షలాది స్త్రీలకు ఉపాధి ఏర్పడింది. స్వయం ప్రతిపత్తితో మనుగడ సాగించిన భారతీయ గ్రామాల్లోని వృత్తిపనివాళ్లందరూ పోగొట్టుకొన్న జీవనోపాధిని కర్మాగారాల్లో వెదుక్కోవడం జరిగింది. అయితే విద్యావంతులై ఆఫీసుల్లో, విద్యాలయాల్లో, ఇతరత్రా పని చేసే ఉద్యోగుల కున్న భద్రత వీరికి లేకుండా పోయింది. తమదైన నివాస యోగ్యమైన స్థలంకూడా లేని పరిస్థితి వీరికి ఏర్పడింది. కార్మిక స్త్రీల పిల్లలు విచ్చిన్నమైన ఉమ్మడి కుంటుంబ వ్యవస్థలో అభద్రతలో బతకవలసిన పరిస్థితి ఏర్పడింది.

పాలనా రంగం:

ఆధునికతను ప్రపంచాని కందించిన పాశ్చాత్య దేశాల స్త్రీల కంటే ముందుగానూ, విస్తృతంగానూ ఆసియా దేశాల స్త్రీలు పాలనా రంగంలో భాగస్వాములయ్యారు. అవడమే కాదు ఉపఖండ స్థాయి ఉన్న భారతదేశంలాంటి విశాల దేశానికి స్త్రీ ప్రధాని అయ్యింది. అయితే కోట్లమంది స్త్రీలలో వేళ్ళమీద లెక్కించగలిగినంతమంది మాత్రమే పాలనా రంగంలో ప్రవేశించినంత మాత్రాన ఆధునికతను సంతరించుకొన్నట్లు కాదు.

ఆధునీకరణలో భాగమే ప్రజాస్వామ్యం. ప్రజా సమూహాలన్నీ ఎలాంటి మినహాయింపులు లేకుండా ఓటు హక్కు ద్వారా పాలనలో పాలు పంచుకోవడమే ప్రజాస్వామ్యం. ఆధునిక సమాజ మూల స్థంభాల్లో ప్రజాస్వామ్యం ఒకటి. ప్రజాస్వామ్యం ఏర్పడిన తరువాత వ్యక్తులకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు లభించాయి. స్త్రీల కిచ్చిన ప్రత్యేక కేటాయింపుల వల్ల వారు పాలనా రంగంలో ప్రవేశిస్తున్నారు. భర్తల చాటున, భర్తల పెత్తనం కింద ఉంటూ నామ మాత్రంగా ఉండే స్థితిని దాటి చాలామంది స్త్రీలు తమదైన శక్తి సామర్ద్యాలతో రాజకీయ పాలనా రంగంలో రానిస్తున్నారు.

సమాచార ప్రసార రంగం:

ఆధునిక యుగానికి పూర్వం సమాచారం అందరిదీ కాదు. సమాచార సేకరణలోనూ ప్రసారంలోనూ మందకొడి తనమ్ ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం సమాచార సేకరణ, ప్రసరణ రంగాలలో విప్లవాన్నీ, విస్ఫోటనాన్నీ కలిగించింది. ఆధునిక యుగంలో సమాచారం ప్రజలందరిదీ. ప్రసార రంగంలో ప్రధాన వాహకాలైన పత్రికలు, రేడియో, టి. వి. లలో ప్రధాన పాత్ర పురుషులదే అయినా స్త్రీల ఉనికికి చాల అప్రాధాన్యముంది. శ్రావ్యమైన కంఠం, అందమైన రూపం, లావణ్యం స్త్రీల సొత్తులు ఇవే ఈ రంగాలలో స్త్రీలకు అర్హతలైనాయి. వీటికి స్త్రీల అందచందాలు, మాటలచాతుర్యంతో నడిచే బుల్లి తెర కార్యక్రమాలు స్త్రీలకు ఉపాధి అవకాశాలను కల్పించాయి. టీచరు, నర్సు, డాక్టరు, గుమాస్తాలాంటి ఉద్యోగాలకు పర్యాయపదంగా మిగిలిన విద్యావంతులైన స్త్రీల ఉపాధి పరిధిని పెంచిన గనత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవిస్తున్న సమాచార ప్రసార రంగానిదే.

ఆధునిక పరిజ్ఞానం స్త్రీల జీవితాలలో మార్పులు తెచ్చిన మరికొన్ని కోణాలు.

నగరీకరణ:

పరిశ్రమలూ, కార్యాలయాలూ పెరగడం, విద్యావంతులైన కొందరు సౌకర్యవంతంగా జీవించాలనుకోవడం వంటి కారణాలు గామీణుల వలసలకు దారి తీశాయి. విద్యావంతులైన గ్రామీణ స్త్రీలతో పాటు, పిల్లల చదువులకోసం కూడా పట్టణాలకు, నగరాలకు కుటుంబాల వలసలు పెరిగాయి. ఇటువంటీ కుటుంబాల్లోని స్త్రీలు తమ ఖాళీసమయాలలోను ఆర్థిక వనరులను మెరుగు పరచుకోనే కార్యక్రమాలలో వినియోగించడం ప్రారంభమైంది. ఉదా: బట్టలు, నగల వ్యాపారం, చిన్న చిన్న ఫ్యాన్సీ షాపులు నడపడం, పిండివంటలు, ఊరగాయలు, చేసి అమ్మడం లాంటివి.

ఆధునిక పరిజ్ఞానంతో సంపాదించుకొన్న జ్ఞానాన్నీ, మెరుగుపరచుకొన్న ఆర్ధిక పరిస్థితినీ తల్లి ఒడిలాంటి పల్లె ప్రజల జీవితాలను మెరుగు పరచటానికీ కూడా ఉపయోగ పడినప్పుడే సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఆధునిక పరిజ్ఞానం వల్ల ఏర్పడీన గతిశీలత మితిమీరకుండా చూడవలసిన బాద్యత స్రీలు కూడా పంచుకోవాలి. అప్పుడే ఆధునిక పరిజ్ఞాన ఫలాలు పూర్తిగా మానవాళికి అందుతాయి. వ్యతిరేక పార్శ్వపు దుష్పరిణామాలు తగ్గుతాయి. పట్టణాలను ఆనుకొని ఏర్పడే మురికివాడలు తగ్గుతాయి, గ్రామాల సమీపాల్లో కూడా పరిశ్రమలు స్థాపించబడడం, ఎక్కడికక్కడ విద్యా ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయగలగడం జరిగితే నగరీకరణను, వలసలను కొంత వరకు తగ్గించవచ్చు.

పారిశ్రామికీకరణ:

ఆధునీకరణ మూలస్థంభాల్లో పారిశ్రామికీకరణ ఒకటి. ఇరవైయ్యో శతాబ్దంలో అభివృద్ది చెందుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణ అన్ని రంగాల కన్నా వేగాన్ని పుంజుకొన్నది. పరిశ్రమల్లో పనిచేస్తున్న శ్రామికుల్లొ స్త్రీల శాతం గణనీయంగా పెరిగింది. అదిసుమారు 30% శ్రామికుల్లో స్త్రీ శాతాన్ని పెంచిన దేశాల్లో పరిశ్రమల అభివృద్ది గణనీయంగా పెరిగినట్లు గణాంక వివరాలు తెలుపుతున్నాయి. అయితే శ్రామిక స్త్రీలలో 90% మంది అసంఘటిత రంగాలలోనే పనిచేయడం వల్ల వాళ్లకి భద్రత లేకుండా ఉంది. పెట్టిన పెట్టుబడికీ ఇచ్చే వేతనాలకీ రాబట్టే పనికీ సంబంధించిన వ్యూహంలో భాగంగా ఉపాధి కోల్పోయే వాళ్ళు స్త్రీలే. స్త్రీల జీవితాల్లొ మంచి మార్పులు తీసుకొస్తున్న ఆధునిక పరిజ్ఞానం వాళ్ల హక్కులను కాపాడే బాధ్యతను కూడ తీసుకున్నప్పుడు స్త్రీల జీవితాలను ఆధునిక పరిజ్ఞానం మరింత మెరుగు పర్చగలుగుతుంది.

చట్టం-స్త్రీలు:

హిందూ ధర్మ శాస్రం ఆధారంగా రచించబడీన చట్టాలు విద్యావంతులైన స్త్రీల ప్రమేయంతో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులతో స్త్రీలకు వెసలుబాటు ను కల్పించేవిగా తయారు చేయబడ్డాయి. యజమాని బానిస సంబంధాలుగా మారిన వైవాహిక బంధాలున్నుంచి విముక్తి కోరుకొనే హక్కును స్త్రీ నేడు పొందగలిగింది.

కుటుంబ సంబంధాలు:

సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలలో ఉత్పత్తి వినియోగాలు కుటుంబమే నిర్వహించేది. వ్యక్తులకు గాక సమూహాలకు ప్రాధాన్యమున్న వ్యవస్థ ఉమ్మడి కుటుంబ విధానం. ఇప్పటి కేంద్రీకృత కుటుంబ విధానం ఆధునికతలో భాగంగా వచ్చిందే. చదువులకోసం, ఉద్యోగాల కోసం రాజకీయాల్లో ప్రవేశం కోసం, వ్యాపారంకోసం ఉమ్మడి జీవన విధానం వల్ల ఏర్పడింది. చెదిరిపోయే పరిస్థితి ఆధునిక జీవన విధానం వల్ల ఏర్పడింది. ఈ పరిస్థితి, స్వంతానికి వనరులు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకొనడానికి దారితీస్తుంది. సమిష్టికన్న వ్యష్టి ప్రయోజనమ్, ప్రాధాన్యం పెరగడం జరిగాయి. ఉమ్మడి కుటుంబాలలో లుకలుకలు బయల్డేరడం, అవిచ్చిన్నం కావడం ప్రారంభమైంది.

ఆధునిక కుటుంబంలో సభ్యులు కుటుంబానికి దూరంగా బ్రతకడానికి సదుపాయా లుండడం వల్ల కుటుంబ౦ ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతూ ఉంది. పరస్పర సేవలూ సహకారాలు, ప్రేమ ఆధారంగా మనవలసిన కుటుంబ వ్యవస్థ వ్యక్తి చైతన్యంతో పెరిగిన అహంకారం వల్ల కలతలకు నిలయమవుతూ ఉంది. సభ్యుల మధ్య ఘర్షణలు పెరుగుతూ దగ్గరితనం లేకుండా పోవడం ప్రారంభమైంది. అహర్నిశలూ కుటుంబానికి అంకితమై సేవలు చేసిన గృహిణి పెరిగిన ఉద్యోగ భాద్యతలతో తరగని ఇంటి పని భారంతో , పనిని పంచుకోనే తత్త్వాన్ని పోగొట్టుకొన్న కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి, ఒత్తిడి పెంచుకొని అనారోగ్యం పాలవుతూ ఉంది. గృహిణికి పెరిగిన మొబిలిటీ మరిన్న బైటి పనులు ఒత్తిడిని పెంచుతూ ఉంది. కొత్త విద్యావ్యవస్థ పిల్లల్ని ఇంటికి దూరం చేస్తూ తల్లి బాధ్యతలను మరింత పెంచుతూ ఉంది. కనబడని తాళ్ళతో బంధింపబడిన ఆధునిక మహిళ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది.

ముగింపు:

అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాలకు ఆధునికతను సంతరించుకోవడం ఒక అనివార్యమైన పరిణామంగా అభివృద్ధిచెందిన, ఆధునికమైన దేశాలుగా తమని తాము భావించు కొంటున్న అగ్రరాజ్యాలు సవాలు విసిరాయి. వెనకబడిన దేశాలు ప్రజలు మరింత చైతన్యంతో, ఆరోగ్యంగా, శాంతంగా, సౌకర్యంగా, సజీవంగా బతకడానికి అవసరమైనంత మేరకు ఆధునికతను ఆహ్వానించవలసిందే. ఆధునికతకున్న అనుకూల ప్రతికూల పార్శ్వాలను విజ్ఞతతో గమనిస్తూ తమని తాము సజీవ వ్యక్తులుగా రూపుకట్టూకోగల సామర్ధ్యం మహిళలకే ఉంది.

- డా|| కే.శారద
(అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు అధ్యయన శాఖ,
ఎస్.వి.యూ కాలేజ్, తిరుపతి)

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో