Jun2009
ఆసుపత్రిలో పువ్వులు
- సుంకర రమేశ్
కాంతులీనే కళ్ళ నుండి
జలజలా రాలుతున్న కన్నీళ్ళు
నవ్వుల చందనాలు చల్లే
పెదవులు
వాడిపోయిన పూరేకులు
ఇంద్ర ధనువును తుంచి
ఆసుపత్రి పడకల మీద చల్లినట్టు
వలవిసిరి పిల్ల పావురాల్ని
పట్టింది జ్వరం
పిల్లల రోదనలతో పోటెత్తిన
ఆసుపత్రి గుండె
ఆసుపత్రి గది గోడలపై చెక్కిన
పిల్లల సంతకాలు
లేతకొమ్మలకు
అల్లుకున్న తెల్లని తీగలు-
ఒక్కొక్కచుక్క దిగుతుంటే
కొత్తసారమేదో వొంట్లోకి ప్రవహిస్తున్నట్టు
జింక పిల్లల్లా గెంతులేసే
పిల్లలకు
కొత్త బంధం
పక్కమీదైనా కదలనివ్వని కొత్త సంకెల-
పసిహృదయాలను
మెలిపెగుత్ను పాడు జ్వరం
కళ్ళల్లో ఒత్తులేసుకున్న
అమ్మచూపులు
లేతకన్నులకు అర్థంకాని భావాలు
స్కూల్ నేస్తాలు గుర్తొచ్చినప్పుడల్లా
నిద్రలోనే పెదువులపై విచ్చుకునే చిరు మొగ్గలు-
నవ్వడానికి శక్తిలేని పువ్వులు
సూదిగుచ్చినప్పుడల్లా
ఏడ్వడానికి చేతకాక
మెలికలు తిరుగుతున్న చిన్నదేహాలు
సలపరింతల గాలివానకు
వణుకుతున్న చివురుటాకులు
… … …
నిన్నటి నెలవంక
నేడు నిండు జాబిలి
వికసించిన నిర్మలాకాశం-
మాసిన బట్టలను తీసేసినట్టు
ఒంట్లో చేరిన జ్వరాన్ని వదిలించుకొని
చిరునవ్వు బుగ్గలతో ఆసుపత్రికి
టాటా చెబుతూ
ఇప్పుడు ఆసుపత్రిలోకి కాదు
పిల్లల దేవాలయంలోకి వచ్చినట్టుంది.
June 5th, 2009 at 8:43 am
Hello Sir ….
Your poem is very nice….
How r u sir
How is your collegues at AIR….
October 27th, 2010 at 2:20 am
మీ కవిత చాలా బాగుంది.
అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
(nallagonda)