Jun2009
హౌజ్ వైఫ్
- నీలిమ
నేనిప్పుడు చిన్నబోయిన నా ‘కంత’లోంచి
ఆకాశాన్ని చూస్తున్నాను
అంతా శూన్యం
నా ఆకాశాన్నంతా నువ్వాక్రమించావు
ఇప్పుడు నాకు సరికొత్త పేరొచ్చింది
“హౌజ్ వైఫ్” !
నువ్వు గ్లోబల్ త్రాచు కాటేసిన
నిన్నటి నా ప్రియుడివి
గమ్యం కన్పించని పోటీ ప్రపంచంలో
ముందుకు సాగడమే నీలక్ష్యం
ఇప్పుడు నీ ప్రపంచం వేరూ
నా ప్రపంచం వేరూ
“నీ” దనుకునే ప్రపంచంలో
ప్రపంచం కుగ్రామం
దేశాల మధ్య
రాష్ట్రాల మధ్య
చివరికి గ్రామాల మధ్య సరిహద్దులు
తరిగి పోతున్నాయి
ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ
‘లాప్’టాప్ అయిపోయి
నా స్థానాన్నాక్రమించేసిందిప్పుడు
‘నీ’ప్రపంచం కుంచించుకుపోతుంది
కుటుంబానికీ కుటుంబానికీ మధ్య
భార్యకీ భర్తకీ మధ్య
మనిషికీ మానవత్వానికీ మధ్య
దూరాలు పెరిగిపోతున్నాయి.
సుధీర్ఘమైన నీ ప్రయాణంలో
ఒక్కసారి నువ్వెనక్కి తిరిగి చూస్తే
వెనకబడిపోయిన నేను కనిపిస్తాను
నీ ప్రపంచాన్ని విడిచి
నువ్వు తిరిగిరాలేవు
నేను నిన్ను చేరుకోనూ లేను.
రాజశేఖర రాజు Jun 2, 2009 1
“నువ్వు గ్లోబల్ త్రాచు కాటేసిన నిన్నటి నా ప్రియుడివి”, “ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ‘లాప్’టాప్ అయిపోయి నా స్థానాన్నాక్రమించేసిందిప్పుడు”, నీ ప్రపంచాన్ని విడిచి నువ్వు తిరిగిరాలేవు నేను నిన్ను చేరుకోనూ లేను….
అందరి బతుకులూ ఇంతే మరి.. వెనక్కు తిరిగి చూడ్డానికి టైమ్ అంటూ ఒకటి ఉండి చస్తే కదా.. ‘నిన్ను చేరుకోనూ లేను’ అంటూ బాధపడటం ఎందుకు… నిన్నటి మీ ప్రియుడిని గ్లోబల్ త్రాచు కాటేసిందని మీరే అన్నారు కదా.. మీ ప్రపంచాన్ని మీరూ వెతుక్కోండి మరి. ఇంత మంచి కవిత పోస్ట్ చేయడం ద్వారా మీదైన ప్రపంచాన్ని మీరు ఇప్పటికే చూసుకున్నట్లున్నారు. ఇక వదలకండి. తండ్రి, భర్త, అన్న అంటే ఎందుకు భయం వేసిందో చెబుతూ పాతికేళ్ల క్రితమే సావిత్రి తొలి తెలుగు ఫెమినిస్టు కవిత రాశారు. మళ్లీ అది గుర్తుకొచ్చింది ఈ కవిత చూస్తుంటే… కానివ్వండి… ఎవరి ప్రపంచం వారిదే.. ఎవరి యుద్ధం కూడా వారిదే.. తప్పదు… మంచి ప్రారంభానికి అభినందనలు…
chinnibook Jun 2, 2009 2
చల బాగుంధి….మరి మీరు అదె పనిలొ ! తప్పదు ,మారె కాలమ్ థొ మనము మారాలి -:)
parimalam Jun 3, 2009 3
తేలికైన పదాలతొ చక్కగా చెప్పారు నేటీ “హౌజ్ వైఫ్” పరిస్థితి!
డాక్టర్ అప్పలయ్య మీసాల Jun 17, 2009 4
ఇవి మామూలు మాటలు కాదు గదా ! ఎక్కువ కాలం స్మ్రితికి రావాల్సిన వస్తువులు ఇవి.
ఇది కవిత్వం కాబట్టి ఇంకా బలంగా ఉండాలి అని నా అభిప్రాయం.
డాక్టర్ అప్పలయ్య మీసాల
amara Jun 18, 2009 5
తప్ప్ దు భర్త అయినా భార్య అయినా తమ ప్రపంచం్ కూడా తాము చూసుకోవాలి లేకపోతే గ్లోబల్ త్రాచు కాటేసిన
నిన్నటి నా ప్రియుడిని
భరిస్తూ, చింతిస్తూ కూర్చొవాలి.