కుడి ఎడమైతే ఏమౌతుంది?

- షేక్ కరీముల్లా

గత సంవత్సరం తిరుపతిలో టి.టి.డి. సారధ్యంలో తెలుగు సంస్కృతీ వికాస వేదిక పోరుతో జరిగిన “తెలుగు భాషా బ్రహ్మోత్సవాల” గురించి విన్నాక ఓ వ్యాసం రాయాలని అనిపించింది. ప్రస్తుతానికి ఇది అపస్తుతమైనా తెలుగు సాహిత్యంలోని ద్వంద్వ వైఖరులు అర్ధం చేసుకోవటానికి ఇది ఉపయోగపడతుంది. లౌకికత్వం, ప్రగతి శీలత కేవలం పడిగట్టు పదాలుగా మారిపోయి ఆచరణలో ఎలా తేలిపోతునాయో విషదమౌతుంది. అలాగని ముస్లిం కవులమైన మాకు టి.టి.డి కార్యక్రమాలపై కానీ మాకె వ్యతిరేకత లేదు. కాకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లల్లో “కొంతమంది” తాము మతాలకు అతీతులమని , మతం వాసన సోకితే ముక్కు మూసుకునే అపర ప్రగతి శీల వాదులమని చెప్పుకుంటున్న వాళ్లు కరుణాకర రెడ్డి నిర్వహించిన దళిత గోవిందాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడ్తూ కవిత్వం రాసిన దళిత కవులు పాల్గొన్న ప్రత్యేక సందర్భం కనుక కొన్ని విషయాలు నిర్మొహమటంగా చర్చించదల్చుకున్నా.

కుడి ఎడమైతే ఏమౌతుంది? మత మౌతుందా! లేక మత ఛాందసమౌతుందా? మొత్తం ఇలాంటి కార్యక్రమాన్ని ముస్లింలు నిర్వహిస్తే ఎలా వుంటుందో ఊహించుకుందాం. కుడి టి.టి.డి. బోర్డు అని ఎడమ జుమ్మామసీదు ట్రస్ట్ అని అనుకుందం. ఇప్పుడు కుడి ఎడమలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పోల్చుకుందాం. కుడి స్థానంలో ఎడమ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. వేదం – సిద్దేశ్వర పీఠాధిపతి స్థానంలో పవిత్ర ఖురాన్ – మౌలానా హమీదుల్లా హరీఫ్, వేద ధర్మం – షణ్ముఖ శర్మ స్థానంలో ఇస్లాం ప్రాశస్త్యం – మౌలానా నద్వి, రామాయణం సమకాలీనత-సుబ్రహ్మణ్య శాస్త్రి స్థానంలో ఇస్లాం సంస్కృతి – నైతిక విలువలు – జకీర్ నాయక్. ఇంత వరకూ బాగానే వుంది. ఇప్పుడే అసలు కథ మొదలౌతుంది.

ఈ ముస్లిం ధార్మిక అంశాల సరసనే జుమ్మా మసీదు ట్రస్టే దళిత సాహిత్యం తరపున ఎండ్లూరి సుధాకర్ను, విప్లవ సాహిత్యం తరుపున చందు సుబ్బారావును అభ్యుదయ సాహిత్యం గురించి ఎస్వీ సత్యనారాయణను ఆహ్వానించిందనుకుందాం. కార్యక్రమం ఎలా కనిపిస్తుందో ఒక్కసారి ఊహించండి. సభ కుడి ఎడమయ్యేసరికి చాలా అసహజంగా, అసహనంగా అనిపిస్తుంది కదూ! చాలా మందికి కుడిలో కనపడని అభ్యంతరాలు, మత ఛాందసాలు ఏడమలో కన్పించి కలవర పెడ్తాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మెజారిటీ మత అధిపత్య భావజాల వ్యవస్థలో మైనార్టీలు, మైనార్టీ సంస్కృతులు, విశ్వాసాలు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటూన్నాయో తెలియజేయటానికే ఇదంతా. ఈ సభకు హాజరైన లౌకిక వాదులు, ప్రగతిశీల వాదులు ఇలాంటి సభలకే ముస్లింలు నిర్వహిస్తే హాజరౌతారా? టోపీలు… గడ్డాలు… పర్ధాలు… య్యాక్… ఛీ.. ఛీ.. మత ఛాందసులు … తాలిబన్లు వీళ్ల ప్రక్కన మేం మా వాదాల్ని గురించి చర్చించడమా అని ఈసడించుకుంటూ దూరం జరగరా?

తెలుగు సహిత్యంలో “ఇస్లాం వాదం” అనే పదాన్ని జీర్ణించుకోలేక పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇస్లాం అనే ఒకేఒక్క పదాన్ని మేం ఉపయోగించిన కారణంగా ఇది మత ప్రచారమని, ముస్లిం సాహిత్యంలోకి ముల్లాలు, మౌల్వీలు ప్రవేశిస్తున్నారని వాపోయిన వారూ ఉన్నారు. వారికి వేదాలు వాటి ప్రాశస్త్యం గురించి చర్చలు జరిపో వేదికలపై పాల్గొనటాకి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవుటం విచిత్రంకదా? ఈ సభల్లో వేదాలపై దంభీరోపాన్యాసాలు చేసే ఉద్దండ పండితులు, ఎర్రెర్రని భావాల ప్రగతిశీల వాదులు పరస్పరం భుజం కలిసి చప్పట్లు, దుప్పట్లు పంచుకుని మురిసిపోవటం అందరికీ తెల్సిందే కదా! ఇదంతా ఎందుకు రాయాల్సి వస్తుందంతే ఇస్లాంవాద సాహిత్యం మేం తీసుకువచ్చినపుడు ఎన్నిరకాల వివక్షత మా పట్ల కొనసాగిందొ మాకు అనుభవ పూర్వకమైన విషయం. ఇక కొంతమంది దళిత కవుల విషయానికొస్తే ఇస్లాంవాదం పట్ల అంటీ అంటనట్లు వ్యవహరించి మమ్మల్ని అంటరాని వాళ్లను చేసేసిన వాళ్లు టి.టి.డి నిర్వహించె సభల్లో తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా దళిత కవిత్వ ఆత్మాభిమానాల్ని, ఆక్రోశాల్ని వెళ్లబోసుకోవటం వాళ్లు మాట్లాడుతున్న విషయాలకు విరుధ్దం కాదా? హతవిధీ! మద్దూరి నగేష్ బాబు, సుందర్రజులు చచ్చిపోయి బతికి పోయారు కానీ బతికుంటే దళీత సాహిత్యానికి పట్టిన ఈ దుర్గతిని చూసి ఖచ్చితంగా చచ్చేవరు.

తెలుగు సాహిత్య చరిత్రను అందులోని మంచి చెడులను విశ్లేషించటం నిఖార్సైన సాహితీ విమర్శకుల లక్షణం. కానీ యూరప్ సామ్రాజ్యావాదం అంటించిన “ఇస్లామోఫోబియా” “ముస్లిమోఫోబియా” అనే అంటు వ్యాధులకు గురైన కొంతమంది సాహితీ విమర్శకులకు “సాయిబు” నిప్పు, జంగ్, కవాతు వంటి చైతన్యవంతమైన పుస్తకాలు కనబడలేదు. కనబడినా కనబడనట్లే నటించారు. మౌనం ఒక పెద్ద కుట్ర కాదా? ఇలా మౌనంగా మమ్మల్ని, మా సాహిత్యాన్ని అనగద్రొక్కే వారికన్నా మమ్మల్ని ద్వేషించే పరివారీయులె నయం కదా! నిజానికి వీళ్ల దృష్టిలో ముస్లిం సాహిత్యం అంటే తమ సమాజాన్ని, సంస్కృతిని, విశ్వాసాన్ని నిత్యం తిట్టుకుంటూ శత్రువు కత్తికి పదునిచ్చే ముస్లిం కవుల సాహిత్యమే నిజమైన ముస్లిం సాహిత్యం. తమ సమాజంపై జరిగే దుష్ప్రచారాల్ని తిప్పి కొట్టే వాళ్లంతా మత ఛాందసులు. ప్రపంచంపై పెత్తనం చేస్తున్న పెట్టుబడి దారీ, సామ్రాజ్యవాద శక్తులు తరు బేదోళిక, రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోపం ఇస్లాంపై తీవ్రవాద ముద్రలు వేస్తుంటే, ముస్లింలను హింసావాదులని ప్రచారం చేస్తుంటే మా ధర్మం హింసను కాదు శాంతిని బోధిస్తుందని ముస్లింలమైన మేం శాంతిని నమ్మిన వాళ్లమని కనీసం చెప్పుకోకూడదా? ఇలా చెప్తే అది మత ప్రచారమౌతుందా? ఒక సమాజం తన అస్తిత్వాన్ని, విశ్వాసాల్ని కాపాడుకోవటం కోసం పెనుగులాడటం సామాజిక బాధ్యతో కాదో తెలియని అమాయక సాహిత్యకారులా వీళ్లంతా! ముస్లిమ్లను తిడ్తూ వచ్చిన విద్రోహ సాహిత్యాన్ని యూనివర్శిటీలలో అద్యయనాలకై ప్రమోట్ చేస్తున్న వాళ్లు ముస్లిం అస్తిత్వ వేదనకు, శాంతితో కూడిన ఇస్లామియా జీవన విలువలకు అలవాలమైన మా సాహిత్యాన్ని ఎందుకు ప్రమోట్ చేయరు? అదేమని ప్రశ్నిస్తే ఇక మా గొంతులకు, రాతలకు కాలం చెల్లినట్లే. ఇలాంటి అవమానాలు ముస్లింలకైనా, ముస్లింకవులకైనా నిత్య కృత్యమెనని మాకు తెల్సు. కాకపోతే తెలుగు సాహిత్యంలోని ద్వంద్వ ప్రవృత్తులు ఎలా ఉంటాయే తెలియజేయటం మా బాధ్యత కనుక తెలియజేస్తున్నాం.

మున్ముందు సాహిత్య విమర్శ నిజమైన లౌకిక విలువల వైపుకు, ప్రజాస్వమిక భావనల పైపుకు ప్రయాణం చేస్తుందని ఆశిద్దాం.

12 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

12 అభిప్రాయాలు

  1. kcubev Jun 1, 2009 1

    చివరిగా మీరు వ్యక్తపరిచిన ఆశావహ దృక్పధం పట్ల కృతజ్ణతలు తెలియచేసుకుంటూ ఇది ఎన్నాళ్ళుగానో కొనసాగుతున్నదానికి మరో తోక మాత్రమే. అధికారంలో వున్నవాడికి వాడి గతం ముసుగు తొడిగి వాడి వెనకాల పోయి పబ్బం గడుపుకోవడం మన ప్రగతిశీలవాదులకు అలవాటైన అవకాశవాదం. ఆలస్యంగానైనా మీ స్పందనతో ఏకీభవిస్తున్నాను.

  2. saleem basha mphil Jun 3, 2009 2

    మీ వ్యాసం చాల బాగుంది.విశాలమైన(దాదాపుగా హిందూ సమాజమంత) ముస్లిం జీవితాన్నీ ముస్లిం రచయితలు వివిద కోనాల నుంచి స్రుజించవలసిన అవసరం ఎంతైనా ఉంది.సమాజంలో ఎవరి స్థానాలను వారు కాపాడుకోవాలనే ప్రయత్నంలొ స్వఉన్నతి కోసం కొందరు ఇలాంటి వాటికి పాల్పడుతుంటారు.లక్ష్యశుద్ది లేక పోవడం దీనికి కారణంకావచ్చు.

  3. కె.మహేష్ కుమార్ Jun 3, 2009 3

    చాలా ఆలోచనాత్మకంగా ఉంది.

  4. vishvasi Jun 4, 2009 4

    కరీముల్లా గారి వ్యాస0 చాలా బాగుంది .ససాహిత్య లొకమ్ లొ
    ఇలాంటి వివక్ష సహిత్య సముద్రానికే తీరని లోటుగా నెను భావిస్తాను.ముస్లిం్ కవులను అందరిని గుర్థించి అందరిని ఆదరించె విశాల హృదయం సన్నగిల్లి పోతుమందని అనిపిస్తుంది.ఆసలు చాందసం అంటె ఎమిటో నిర్వచిం్ చె అవసరం ఎంతో ఉంది.మరి మీరు ఏమంటారు?

  5. MOHAMMAD.ILIAS Jun 4, 2009 5

    కరీముల్ల గారి వ్యసం చాల బాగ ఉంది. ఈనాడు ముస్లింస్ ఏ విధంగ వివక్షకు గురి అవుతున్నరొ మనలను ఆలొచింపచెసె విధంగ ఉంది. ఒక నిజమైన దెష భక్తికి ఈ వ్యసం హౄదయకొలమానమి మనిషి ఉనికి ఏ విధమైన అన్యాయానికి గురి అవుతున్నదొ తెటతెల్లం చెస్తుంది. హట్సాఫ్ఫ్ టు కరీముల్ల .

  6. రవికిరణ్ Jun 4, 2009 6

    చక్కగా చెప్పేరండీ కరిముల్లా గారు. ఐతే కుడి, ఎడమల్ని అటు ఇటు మార్చినందువలన సాహిత్యానికి జరిగే మంచేవీలేదు. అది టి.టి.డి సభైనా, జుమ్మా మసీదు సభైనా సామాన్యుల దరి చేరని సాహిత్యోపయోగవేవిటి ఒకరికొకరు శాలువలు కప్పుకోవడం తప్ప, ఒకరి వీపు ఒకరు గోక్కోవటం తప్ప, అప్పుడప్పుడూ ఎవరి మీదనో రాయెయ్యటం తప్ప.

    ఈ రకవైన సభలు వార్తలు సృష్టించడానికే కాని, సాహిత్య సృష్టికి కాదు కదా. కనుక ఈ రకవైన సభల్ని ప్రక్కన పెట్టడవే ఉత్తమం. ఈ రోజు స్త్రీవాద, దళిత సాహిత్యానికి ఏ రకవైన సాంఘీక, సాంస్కృతిక పరిస్థితులైతే వున్నాయో, అవే పరిస్తితులు, అవసరాలు ముస్లీమ్ సాహిత్య సృష్టికి కూడా వున్నాయి. అందరం మానవ సమాజంలో భాగవే, కానీ ఆ సమాజంలో అందరికీ అన్ని సమాజిక పరిస్తితుల పట్ల అవగాహనుండదు. అమ్మ ఒళ్ళోనే పెరిగినా స్త్రీగా అమ్మ పట్ల నా అవగాహనకి పరిమితులున్నాయి. ఆ పరిమితులే స్త్రీవాద సాహిత్యానికి, అదే విధంగా దళిత సాహిత్యానికి, ఆ దిశలోనే ముస్లీమ్ సాహిత్యానికి ఒక అవసరాన్ని కలుగ చేస్తున్నాయి. ఆ అవసరం తప్ప, సభావేదిక మీద దుప్పట్లు ఇచ్చి, పుచ్చుకోవటం కాదు సాహిత్య సృస్టికి కారణం.

  7. divikumar Jun 5, 2009 7

    కొడవటిగంటి కుటుంబరావుగారు చెప్పిన మాటొకటి గుర్తొస్తోంది.”కసాయి వాడు జీవకారుణ్యం
    మీద సెమినారు పెడితే భూతదయగలవారంతా పాల్గొటమేనా?”
    కరిముల్లా గారు చెప్పిన కుడి ఎడమైతే అలాగే వుంటుంది.బహుశా పాకిస్తాను బంగ్లాదేశాల్లో కూడా ఇలాగే వుండొచ్చు.దాన్ని ఆదర్శంగా తీసుకునే హిందూత్వ వాదులు కూడా వుండొచ్చు.
    టి.టి.డి.ని లౌకిక సంస్థగా నిర్వహించటమే ఎరుగని పాలకులు దాన్నిహిందూ ధార్మిక సంస్థగా
    నడుపుతూ దాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకొరకు,అనగా పచ్చిలౌకిక స్వార్థాల కొరకు
    వాడు కుంటున్నారు.మేధావులైన రచయితలు నిర్వాహకుల స్వార్థాలనెరిగి ప్రవర్తించాలి.
    తిరుపతి వెంకన్న భార్యలలో వొకరైన బీబీ నాంచారమ్మ కారణంగానైనా ముస్లిములకు
    టి.టి.డి.లో మూడవ వంతు వాటా ఇవ్వటం న్యాయమేననే వాదనకు ఆస్కారముంది.కనుక
    ఇస్లాం రచయితలను ఆహ్వానించకనే పోవటం తిరుపతి వెంకన్నకు కూడా అపచారం చేసిన దానితో అది సమానమే అవుతుంది.—దివికుమార

  8. MS Ramanjaneyulu Jun 6, 2009 8

    Karimulla gari Vyasam chaala bagundhi. Mammlni aalochimpa chesindhi. Good aargyument.
    MS Ramanjaneyulu
    Vinukonda.

  9. నచకి Jun 7, 2009 9

    జరిగిన సభ సంగతి నాకు తెలియదు కానీ మైనారిటీలని అర్థం చేసుకుని అందరికీ కలుపుకుపోయే లాగా ఉండటం మెజారిటీలో ఉన్నవారికి ఇష్టమైనా కాకున్నా కష్టం మాత్రం అవును. భాషలోని జాతీయాలు,సామెతలు, లోకోక్తులు కూడా చాలా వరకు మెజారిటీ ప్రజలకే దగ్గరగా ఉండటం కూడా గమనించవచ్చు. నా దృష్టిలో దానికీ ఇదే కారణం. (ఈ క్రమంలో మైనారిటీలకి బాధ కలగటం, వారు దానిని వెళ్ళబుచ్చే మార్గాన్ని ఎంచుకోవటం అన్నవి సమంజసమా కాదా అన్నది మెజారిటీలో ఉన్న వారు బేరీజు వెయ్యటం కూడా నేను మొదట చెప్పిన కష్టం కిందకే వస్తుంది… కనుక అలా బేరీజు వేసి మైనారిటీల బాధ లేదా భావవ్యక్తీకరణ తప్పు అని తేల్చటం మెజారిటీలోని వారు చేసే తప్పు కావచ్చు.)

    జరిగిన సభ, తితిదే వారి నిర్వాహకం, వివిధ కవుల నడవడి నాకు చూచాయగా కూడా తెలియవు కనుక వారి తప్పు ఉందా, లేదా, ఉంటే ఎంత తప్పు అన్నది నేను తేల్చలేను. కానీ, ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా ఉన్న దేశంలో మతం, (మతపరమైన మరియు మతేతరమైన) మైనారిటీ/మెజారిటీ పట్ల వ్యవహరించే తీరు మాత్రం సవ్యంగా ఉన్నట్లు తోచదు నాకు. అలా చూస్తే ఈ కార్యక్రమం తీరు ఆశ్చర్యకరమూ కాదు, ఎప్పుడో ఒకసారి చెదురుమదురుగా జరిగే ప్రత్యేక సంఘటనా కాదు, సాహిత్యానికే సంబంధించిన విశేషమూ కాదు. మన దేశప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల ఉండే అవగాహనాలోపానికి వేలాదిగా ఉన్న తార్కాణాలలో ఒకటి, అంతే! ఇది మన దురదృష్టం! ఇప్పటికైనా ఇటువంటి వ్యాసాలు మరింతగా వస్తే సంతోషమే… చదివిన వారు మారినా మారకపోయినా, ఇటువంటి ఖండనార్హమైన అనుభవాలు కలిగిన వారికి వాటి గురించి వ్రాయటానికి మరి కొంత ప్రేరణగా నిలుస్తుంది, మైనారిటీల బాధలు మెజారిటీకి మరి కొంచెం అర్థమయ్యే అవకాశాముంది.

  10. Kumar Jun 8, 2009 10

    నాకు తెలుగు లో టయిపు చేయడమ్ సరిగా రాదు.అందుకే ఇంగ్లీషు లో రాస్తున్నాను.

    After reading this blog post, and some of the comments, I would like to share some of my thoughts and questions, in the spirit of free discussion.

    1.Sheikh Karimulla says he has heard about the ‘Telugu Bhasha Brahmotsvalu’, and so, one assumes he has not attended it.Has it been the case that they have not invited any Telugu poets who happen to be Muslim? What about Dalit Muslim poets?

    2.What is ‘Islam vaadam’ in Telugu literature? Is there a similar ‘Hindu vaadam’, Christian Vaadam’ also ? I know there are Marxist, Dalit and Stree vaadam movements in Telugu literature, but this is the first time I am reading about Islam vaadam. Hence, curious.

    3.Yes, there are some great Telugu poets and writers who were/are Muslims.Is existence of Muslim writers synonymous with Islaam vaadam?Have these people written about religion-based atrocities in AP on Muslims ? Or are they responding to the issues affecting the global Ummah, in Telugu? Is that necessarily ‘Telugu Samskrutee Vikaasam’ if I write in Telugu about the plight of Kashmiri pandits or the holocaust of the Jews?

    4.Sheikh Karimulla says the minority culture is suffering from the majority religion’s dominant culture and associated terminology.He doesn’t say where and how in AP. Also, it is not clear whether Karimullah sees Muslim poets and writers as essentially representing Islam, or their individual literary selves within the overall literary culture of Telugu. I mean, do we really want to see Siva Reddy as a Reddy poet and Smile as a Muslim poet ?Are such distinctions important? Where would we classify an original, romantic voice like Mehjabeen?

    (Aside: As a Telugu, I would love to listen to the muezzin calling the faithful to the mosque in Telugu.I even asked a Muslim writer friend about this. I mean, Christianity communicates itself to the masses in their native tongue.Why can’t Islam do the same and preach the language of peace to the rural Muslim poor in Telugu ? He smiled and said:We are all Muslims first, and last.Language is a divisive thing.Notion of nationhood is divisive also.And we feel that the only culture worth preserving is an Arabic-dominated culture handed over from the Prophet (PBUH).)

    5. One of the commentors said TTD should be secular. I think this is a laughable suggestion. It is an administrative unit for a Hindu temple.The TTD doesn’t get any funds from our secular Govt. The crores of money earned by the temple through its devotees offerings goes into the Govt’s coffers(which in my opinion is extremely anti-secular).The TTD has every reason to expect functions held with its money to focus on a culture that is complimentary to the ‘Dharma’.It would want to do research on Annamayya and not Periyar. Are we enforcing such expectations on Wakf Board and the Roman Catholic Church in India ?

    6.The same commentor wants a 1/3rd share of TTD to go to Muslims because Bibi Nanchari is one of the wives of Lord Balaji :)

    I would like the commentor to be happy because the Govt of AP is using Endowments dept revenues (funds from temple Hundis and properties) to help improve Wakf properties and repair of Churches.

    My take: India is a democracy but it is secular only in name.The Govt does interfere in every aspect of the majority religion.India’s minorities are a peaceful lot and in general have no issue with the essentially Sanatan Dharmic character of this civilisation. They are a part and parcel of it. And we know how to celebrate our diversities.

    But especially the Muslims of India (and in AP) have been betrayed by their intelligentsia including the writers and poets who claim to represent the Muslims.None of the Sheik Karimullahs of AP have, to my knowledge, ever questioned as to why, inspite of so much prosperity and GDP growth rate in the last two decades, Muslim slums remain where they are in our towns and cities.The same Muslim leaders keep getting elected showing the బూచి of Hindu extremism, doing precious little for the economic upliftment of Muslims.And the poets who want to represent Muslim vaadam, never ask why, in Hyderabad, the outskirts have seen a transformation due to IT and BPO industry, the city itself has been beautified and lots of flyovers have been built, but Old City remains a gutter and a ghetto.And Owaisi clan still wins.There will be no relevance for any Islam vaadam in Telugu lit, as long as some poets and writers want reservations in kavi sammelans because they are Muslims, and nothing else. Let them write a Muslim Maha Prasthaanam, and awaken the masses from the real cheaters among themselves.I will then be proud of my Telugu Muslim poets.

    P.S.: Yes, this is a provocative post from me.My apologies as the intention is not to hurt any one.I am just frustrated by the pseudo talk about irrelevant issues, by the intelligentsia.Thanks for bearing with me.

  11. Ramesh Jun 17, 2009 11

    Sri Karimulla gari vyasam chala hipocratic ga undi. Ee naa comment chaala mandiki kopam teppinchavachu. Kaani oka prasnaku Karimulla garu javabu cheppali. Adi, TTD nirvahinche karyakramam elaga Hindu mataaniki ateetamga untundi? TTD oka dharmaaniki sambandhinchina samsta. Indulo emaina tappu unnada? Is it a crime? Vere matalaku vaari vaari samsthalu leva? Aa samstalu evaina literary kaaryakramaalu nirvahiste tama mataaniki ateetanga nirvahistunnayaa? Emaina alaanti udaaharanalu unte avi ‘exceptions’ maatrame. Ee vyasam daanimeeda vachina abhiprayaalu choosaka naaku navvalo edavalo teliyataledu. Indulo chaala mandi mana raajakeeya parteelu pracharam chese pseudo secularism prabhavamulo unnaaru. Alaagani neenu RSS vaadini kanu. Kaani evari mataanni vaaru anusaristu itara mataalanu gouravinchadam annade secularism. Ika saahityam, bhasha vishayanikoste prastuta mana sahiteevettalu, kavulu chaalamandi naa veepu nuvvu goku, nee veepu nenu gokuta anna paddhatilone unnaru. Everybody has his own groups. Dalita vada, stree vada sahityam laage minority vaada sahityam kooda ravali, Kaani adi vidveshalu penchadaniki kadu, majority religionku chendinavaru adi chadivi vaalla culture nu ardham chesukonediga undaali. Sri Karimulla garu, itara minority origin ga unna kavulu ituvanti meaningless vyasalaku badulu ardhavantamaina saahityanni andhistoo vari religion meeda vari community meeda itarulaku unna dvesha bhavanni pogotte prayatnam chestarani aasistunnanu.

  12. రహంతుల్లా May 24, 2010 12

    తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు
    తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్వాక, ప్రబోధాత్మక శతక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;
    *ముహమ్మద్‌ హుస్సేన్‌
    భక్త కల్పద్రుమ శతకం(1949)
    మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ”సుమాంజలి”.
    హరిహరనాథ శతకము
    అనుగుబాల నీతి శతకము
    తెనుగుబాల శతకము
    *షేక్‌ దావూద్‌
    1963లో రసూల్‌ ప్రభు శతకము
    అల్లా మాలిక్‌ శతకము
    *సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌
    సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము
    *ముహమ్మద్‌ యార్‌
    సోదర సూక్తులు
    *గంగన్నవల్లి హుస్సేన్‌దాసు
    హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య
    *హాజీ‌ ముహమ్మద్‌ జైనుల్ అబెదీన్‌
    ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము
    *తక్కల్లపల్లి పాపాసాహెబ్‌
    వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
    బెండ్లియాడి మతమభేదమనియె
    హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
    పాపసాబు మాట పైడిమూట
    *షేక్‌ ఖాసిం
    సాధుశీల శతకము
    కులము మతముగాదు గుణము ప్రధానంబు
    దైవచింత లేమి తపముగాదు,
    బాలయోగి కులము పంచమ కులమయా,
    సాధులోకపాల సత్యశీల
    *షేక్‌ అలీ
    గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో ‘గురుని మాట’ శతకం
    మానస ప్రబోధము శతకం
    *షేక్‌ రసూల్‌
    మిత్రబోధామృతము అనే శతకం
    *ఉమర్‌ ఆలీషా
    బ్రహ్మ విద్యా విలాసము.
    “తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ” అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో పి.హెచ్.డి వచ్చింది.ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు.సయ్యద్ నశీర్ అహ్మద్ “అక్షర శిల్పులు” పేరుతో 333 మంది ప్రస్తుత తెలుగు ముస్లిం కవులు రచయితల వివరాలతో 2010 లో పుస్తకం ప్రచురించారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో