అధ్యాయం 12: తిరిగి వచ్చిన భూత నాట్యం

ఎనభై ఐదేళ్ల క్రితం
భూత నటులు అనుకునే వారు
నాట్యం చేయడం ద్వారా
తాము భూమిని మారుస్తామని.
మనల్ని మార్చుకోడానికే నాట్యం చేస్తాం.
మనం మారినప్పుడు మాత్రమే
భూమిని మార్చడానికి ప్రయత్నించగలం.
- క్రౌ డాగ్‍, 1974

భూత నాట్య మతం మొదటి వూండెడ్ నీ సంఘటనలకు కేంద్ర బిందువైంది. రెండో వూండెడ్ నీ సంఘటన‍ల నాటికి ఇండియన్ మతంతో పాటు ఇండియన్ రాజకీయాలు కుఢా ప్రాముఖ్యం వహించాయి. అందరి అంగీకారంతో వూండెడ్ నీ లోపల క్రౌ డాగ్‍ మత నాయకుడయ్యాడు. మెడిసిన్ మ్యాన్ వాలెస్ బ్లాక్ ఎల్క్ తో కలిసి క్రౌ డాగ్‍ అన్ని క్రతువులూ నిర్వహించే వాడు. వూండెడ్ నీ వద్ద చేరిన వారి ఆధ్యాత్మిక, భైతిక సంక్షేమం గురించి క్రౌ డాగ్‍ బాగా పట్టించుకునే వాడు. ‘నీ’ కి బాగా దగ్గర్లో కైల్ వద్ద వున్న మత నాయకుడు, సూ జాతిలో అందరి కంటె పెద్ద వాడు, అందరి గౌరవం పొందిన వాడు ఫ్రాంక్ ఫూల్స్ తన చోటు నుంచి మాకు మద్దతు అందించాడు. క్రౌ డాగ్‍ ‘నీ’ లోపల వుండి సూ ప్రజల కోసం చేసినంత పని ఫ్రాంక్ ఫూల్స్ బయటి నుంచి చేశాడు. మెడిసిన్‍ మెన్‍ అందరూ మాకు మద్దతుగా మా దగ్గరికి వచ్చి వెళ్లారు గాని, ఎనభై ఏళ్లుగా నిషేధానికి గురైన భూత నాట్యాన్ని పునరుద్ధరిమచిన ఘనత మాత్రం క్రౌ డాగ్‍దే అని చెప్పాలి. వూండెడ్‍ నీ లోనే, అదీ ముట్టడి సమయంలోనే క్రౌ డాగ్‍ ఈ పని చేశాడు.

లియొనార్డ్ క్రౌడాగ్‍ రకరకా పనులు చేసేవాడు. క్రతువులు పూజలు నిర్వహించేవాడు. తెల్ల ప్రభుత్వంతో మంతనాలలో ముఖ్యపాత్ర వహించేవాడు. తుపాకి గాయాలకు శస్త్ర చికిత్స చేసేవాడు, జబ్బు పడిన వారికి నయం చేసే వాడు, చివరికి కొన్ని రోజుల పాటు ఛీప్ ఇంజనీరుగా కూడా పని చేశాడు. స్వెట్‍ లాడ్జ్ లో నిప్పు ఇరవై నాలుగ్గంటలు వెలుగుతూనే వుండేది. దాదాపున ప్రతి రాత్రి ఏదో ఒక క్రతువు జరుగుతూ వుండేది. ఒక సారి యువిపి అయితే మరోసారి పేయోట్‍ సమావేశం. 1876లో తెల్లవాళ్ల మీద యుద్ధానికి వెళ్లే ముందు సిట్టింగ్‍ బుల్‍ చేసినట్లుగా, కొన్ని పవిత్ర సందర్భాలలో, ఆడవాళ్లు మగవాళ్లు తమ చేతుల మీంచి కొద్ది మాంసం తీసి పూజలో సమర్పించే వాళ్లు. కొంత మందీ నాయకులు సూర్య నాట్యంలో చేసినట్లుగా ఛాతీ మీద గాయాలు చేసుకునే వారు. అలా తాము నొప్పిని భరించడం వల్ల సమ ప్రజలకు మేలు జరుగుతుందని వాళ్ల ఆశ.

నేను ప్రతి సాయంత్రం ఏదో ఒక క్రతువులో పాల్గొనడానికి వెళ్లేదాన్ని. ఆ క్రతువులు ఎలాంటి సందడి లేకుండా నిశ్శబ్దంగా జరిగేవి. ఒక రోజు సాయంత్రం ఒక క్రతువులో పాల్గొని, వూండెడ్ నీ ఇంకో చివర వున్న మా మకాం కు వెళ్తున్నాను. దారంతా నాకు ఆడవాళ్ల ఏడుపులు, పిల్లల‍ అరుపులు, ఫిరంగుల పేలుళ్లు, పరిగెత్తే గుర్రాల గిట్టల చప్పుళ్లు వినిపించాయి. అప్పుడు నేను నడుస్తున్నది 1890లో మా ఆడవాళ్లను, పిల్లలను చంపేసిన కాంక్పె ఓపి వాక్పల అనే ప్రదేశం. అలా సగం-నిద్ర వంటి స్థితిలో గతంలో జరిగినవి అనుభవంలోకి రావడం, చరిత్రను పునర్దర్శించడం విచిత్రం అనిపించింది. దాన్నెలా అర్థం చేసుకోవాలో నాకు ఇప్పటికీ తెలియదు. అది జరగబోయే సంఘటనలను ముందుగా దర్శించడమా, చరత్ర పునరావృతం కావడమా?

ప్రతి రాత్రి యోధులందరూ తమను తాము శుద్ధి చేసుకోడం కోసం స్వెట్‍ బాత్‍లో పాల్గొనే వాళ్లు. ఈ ఇనిపి క్రతువుల బాధ్యతను లియోనార్డ్ తన మితృడు వాలెస్ బ్లాక్ ఎల్క్ కు అప్పగించే వాడు. ఒక రోజు రాత్రి ఆ క్రతువును లియొనార్డ్ నిర్వహించాడు. క్రతువు తరువాత లియొనార్డ్ మిగతా వాళ్లతో కలిసి బయటికి వచ్చే సరికి పోలీసులు వాళ్ల మీద కాల్పులు మొదలెట్టారు. తమ ఎమ్-16 తుపాకులతో స్వెట్‍ లాడ్జ్ మీద, టిపి మీద కాల్పలు జరిపారు. కొంత మంది మగవాళ్లు పక్కనే వున్న బంకర్ లోనికి దూకారు. క్రౌ డాగ్ స్వెట్ లాడ్జ్ కి బంకర్ కు మధ్య చిక్కుకున్నాడు. రెండు గంటల సేపు అలాగే, దూసుకుపోతున్న తూటాల మధ్య నేల మీద పడుకుని వుండిపోయాడు. ఆ రోజు ఎవరూ చనిపోకపోవడం నిజంగా ఒక అద్భతం.

ఏదైనా ఒక ఒప్పందానికి రావడం కోసం మేము ప్రభుత్వ ప్రతినిధులతో మొదటిసారి సమావేశం కావడాకి ముందు సూర్యోదయ క్రతువు నిర్వహించాలని అందరూ లియొనార్డ్ ను కోరారు. మొదటి వూండెడ్ ‘నీ’ సంఘటనలో ఆశ్విక దళం సామూహిక హత్యాకాండ మృతులలో ఒకరైన బిగ్ ఫుట్‍ సమాధి ముందు పూజా వేదిక ఏర్పాటు చేసి, క్రౌ డాగ్ ఇలా అన్నాడు. “మన ఈ అర్థ(భూ)గోళమే, మనం నుంచున్న ఈ భూభాగమే మన అతి పవిత్ర పూజా వేదిక. ఇది మన పవిత్ర ప్రదేశం, మన పచ్చని తివాచీ. చంద్రుడే మన రాత్రి వెలుగు. సూర్యుడే మన మార్గసర్ది, మన మహా ఆత్మ.”

లియొనార్డ్ మా ప్రధాన డాక్టర్, అక్కడ వున్న తెల్ల వైద్యులు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పని చేస్తున్న ఎం.డి. లు లియొనార్డ్ ను సంప్రదించే వారు. తెల్ల డాక్టర్లు అమదరూ ఏదో పిల్లలకు, ఊపిరి తిత్తుల జబ్బుతో బాధపడే వాళ్లకు చికిత్స చేయాల్సుంటుందనుకుని వచ్చారు. ఇక్కడ తుపాకి కాల్పుల సమస్యలుంటాయని వాళ్లు అనుకోలేదు. అలాంటి శస్త్ర చికిత్సలకు కావలసిన సామాగ్రి వాళ్ల దగ్గర లేదు. అందువల్ల శస్త్ర చికిత్సలన్నీ లియొనార్డే చెయ్యాల్సి వచ్చేది. తుపాకి కాల్పుల్లో బడ్డీ లెమాంట్ చనిపోయినప్పుడు, బంకర్‍లో ఆయనతో పాటు మరి ఇద్దరు వున్నారు. ఒకరికి పాదంలో ఒకటి, చేతిలోమరి మూడు తూటాలు దిగాయి. మూడో మనిషికి కాలిలో గాయమయ్యింది. వాళ్లందరికీ లియొనార్డే చికిత్స చేశాడు. డాక్టర్లు తీసుకునే సమయం కన్న తక్కువ సమయమే తీసుకున్నప్పటికీ, ఆ తరువాత ఎవరికీ ఇన్ఫెక్షన్ సోకలేదు. లియొనార్డ్ గాయాల చికిత్స కోసం పూర్తిగా ఇండియన్ మందులనే వుపయోగించే వాడు. తూటా తీసేసే ముందు గాయం తగిలిన చోట నొప్పి తెలియకుండా చేయడానికి ముళ్ల పంది ముళ్లను, ఎర్ర చెక్క అనే మూలికనూ వుపయొగించే వాడు. ఈ ఇండియన్ అనీస్తిసియా చాల తొందరగా పని చేసేది. అది పని చేయడం మొదలెట్టగానే సూర్య నాట్యంలో యొధులు తమను గాయపర్చుకోడానికి వుపయోగించే కత్తితో గాయాన్ని తెరిచి తూటాలు తీసేసేవాడు. చికిత్స తరువాత గాయాన్ని జింక నరాలతో కుట్టేసి, పవిత్రమైన నేల-తాబేటి నుసితో రక్త స్రావాన్ని ఆపే వాడు. సూ వీరుడు క్రేజీ హార్స్ ఈ మందును చాల ముఖ్యమైనదిగా భావించేవాడు. ఇన్‍ఫెక్షన్ రాకుండా గాయం త్వరగా మానడం కోసం లియొనార్ఢ్ తవోపి తవొతె అనే మందును (దీన్నే తెల్లవాళ్ల వృక్ష శాస్త్రంలో యర్రో అంటారు)వుపయోగించేవాడు. అంతర్గత రక్తస్రావాన్ని ఆపడం కోసం విన వాజి హుత్కన్ అనే మూలికను వుపయోగించేవాడు. ఊపిరి తిత్తుల సమస్యలకు స్వెట్ బాత్ తో పాటు రకరకాల సేజ్‍ మొక్కలతో తయారు చేసిన టీ వుపయోగించేవాడు. తెల్లవాళ్లు హార్స్ మింట్ అని వ్యవహరించే పెహోక పెహూత అనే మొక్కతో జ్వరాలు తగ్గించేవాడు. మాకు సాయం చేయడానికి సియాటిల్‍ నుంచి వచ్చిన డాక్టర్ ప్యాట్ కెల్లీకి లియొనార్డో మీద మంచి గురి వుండేది. తెల్లవాళ్ల సరికొత్త మందుల కన్న క్రౌడాగ్ చికిత్సలో గాయాలు తొందరగా మానుతాయని ఆయన అనే వాడు.

వైద్య సిబ్బందిలో రాక్‍ మాడ్రిడ్ అని చికనో తెగకు చెందిన మనిషికి కడుపులో తూటా దూసుకుపోయింది. ఆయన కడుపు ఛిద్రం కాకుండా వుండడం ఆశ్చర్యకరమే. ఎలాగో నడుచుకుంటూ ఆసుపత్రి చేరాడు. క్రౌ డాగ్ అతని కడుపులోని తూటా తీసేశాడు. అదృష్టవశాత్తు అది కడుపులో మరీ లోపలికి పోలేదు. క్రౌ డాగ్ కత్తితో తూటా తీసేయడం తనకు తెలియనే లేదని, ఇండియన్ అనెస్తెసియా చాల బాగా పని చేస్తుందని రాకి ఆ తరువాత మాతో అన్నాడు. ఈ మూలికలను ఎలా వుపయోగించాలో, చికిత్సకు ముందు ఎలా ప్రార్థన చేయాలో క్రౌ డాగ్ తెల్ల డాక్టర్లకు నేర్పించాడు.

మనుషులను బాగు చెయ్యడానికే గాక, యంత్రాలను బాగు చెయ్యడానికి కూడా క్రౌ డాగ్ ని పిలవడం విచిత్రంగా వుండేది. ఛీఫ్ ఇంజనీరుగా బాబ్‍ ఫ్రీ రాజినామా చెయ్యగానే, లియొనార్డ్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఏ వస్తువులు పాడైనా వెంటనే బాగు చేసేవాడు. అలా అన్నిటిని బాగు చేయడం అతడికి దొరికిన వరమేమో అనిపించేది. కార్ల రిపేరు చిన్నతనంలోనే నేర్చుకున్నాడు. వూండెడ్ నీ లో వున్నప్పుడు గ్యాసు పంపు, విద్యుత్ సౌకర్యాలు నిరంతరాయంగా పని చేసేట్టు చూసేవాడు. ”నీ’ ముట్టడికి కొన్ని వారాల ముందు విద్యుత్‍ సరఫరా కట్‍ చేశారు. దుకాణంలో దొరికే కిరొసిన్‍ ల్యాంపులతో పనులు చేసుకునే వాళ్లం. మా రక్షణ ఏర్పాట్లు కూడా ఛీఫ్ ఇంజనీరుగా లియొనార్డ్ బాధ్యతే. తనే పర్యవేక్షిస్తు బంకర్లు తయారు చేయించాడు. బంకర్లకు ఒక్కో దానికి ఒక పేరుండేది. గట్టి గుండె, కూర్చున్న ఎద్దు… ఇలా వుండేవి వాటి పేర్లు. చుట్టూరా రక్షణగా మైన్స్ కూడా ఏర్పాటయ్యాయి. కొంత మంది కుర్రాళ్లతో వంద పౌండ్ల బొగ్గును పొడి చేయించాడు. వెయ్యి లైట్ బల్బులు సంపాదించి, వాటిని బొగ్గుపొడితో, బ్యాటరీ యాసిడ్ తో నింపాడు. ఈ చిన్ని బల్బు బాంబులన్నింటినీ ఒక ఫ్యూజుకు కలిపి, దాన్ని బ్యాటరీకి కలిపాడు. ఈ దండను ఒక వైరు మీద వుంచాడు. పోలీసులు దాన్ని తాకితే నిప్పు రవ్వలు ఎగిరి ఆ బల్బులు పగిలేవి. నిజానికి వాటి వల్ల పెద్దగా వినాశం జరిగేది కాదు గాని,పోలీసులులను కాసేపయినా దూరం వుంచగలిగేవి. లియొనార్డ్ అన్ని పనులు చేసే వాడు గా, తను మెడిసిన్ మ్యాన్ కావడం వల్ల ఎప్పుడూ తుపాకి వుపయోగించే వాడు కాదు.

లియొనార్డ్ చేతిలో భూత నాట్యం పునరుద్ధరణే… అన్నిటి కన్న ఎక్కువగా గుర్తుండిపోయే విషయం. బతికి వున్న మా కోసమే కాకుండా సామూహిక శ్మసానంలోని మా వాళ్ల ఆత్మ శాంతి కోసం కూడా ఆ పని చేశాడని అనుకుంటాన్నేను. ఇంతకు ముందే చెప్పినట్లు, భూత నాట్యానికీ మా కుటుంబానికి చాల దగ్గరి సంబంధం వుంది. లియొనార్డ్ కు ముత్తాత అయిన మొదటి క్రౌ డాగ్ మా సూ తెగ ప్రజల్లో మొదటి భూత నటుడు మాత్రమే గాక, వారి నాయకుడు కూడా.

1989లో ఒక వ్యక్తి క్రౌ డాగ్ తో అన్నాడట- “ఒక కొత్త ప్రపంచం రాబోతోంది. ఒక కొత్త శక్తి ముందుకు వచ్చి, వాసిచుమ్ (తెల్లవాడు) పాడు చేసిన ఈ ప్రపంచాన్ని దుప్పటి లాగేసినట్లు లాగి అవతల పారేస్తుంది. దాని కింద ఒక కొత్త, పరిశుద్ధ, హరిత ప్రపంచం వుంటుంది. ఆ ప్రపంచంలో నడుస్తూ, తెల్లవాడు చంపేసిన మన పూర్వీకులను చూస్తాం. వాళ్లు తిరిగి ప్రాణం పోసుకుని, మనకు ఎదురొస్తారు. తెల్లవాడి నుంచి తప్పించుకోడానికి పర్వతాలలోని ఒక పెద్ద గుండం లోనికి వెళ్లి అదృశ్యమైన దున్నలు అన్నీ నేల కింది తమ గుహల లోంచి బయటికి వచ్చేస్తాయి. మళ్లీ గుంపులు గుంపులుగా పచ్చిక మైదానాలు అంతటా విస్తరిస్తాయి. ఇది మన పితరుని (దేవుని) మాట.” క్రౌ డాగ్ తో అలా అన్నది ఎవరో కాదు. కస్టరుతో పోరాడిన యోధుడు, మా బ్రుల్‍ తెగకు చెందిన షార్ట్ బుల్.
(క్రౌ డాగ్, షార్ట్ బుల్ కలుసుకోడం అది మరొక ఆసక్తికరమైన కథ)

ఒక అభిప్రాయం »అనువాదాలు, అపరాజిత

ఒక అభిప్రాయం

  1. ప్రాణహిత » జూన్ 2009 సూచిక Jul 6, 2009 1

    [...] : అధ్యాయం 12: తిరిగి వచ్చిన భూత నాట్యం : మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో