విమల ‘మృగన’ ఆవిష్కరణ

విమల కవిత్వం ‘మృగన’ ఆవిష్కరణ 09 మే 2009న, సుందరయ్య విజ్ఞాన భవనం మినీ హాల్‌లో జరిగింది. ప్రముఖ రచయితలు, రచయిత్రుల మధ్య ‘మృగన’ను విప్లవ కవి వరవరరావు ఆవిష్కరించారు.

పర్‌స్పెక్టివ్‌ ప్రచురణ కర్త ఆర్కే మాట్లాడుతూ ఇంతవరకు మేము వ్యాసాలు,కథల అనువాదాలు వేసినప్పటికి కవిత్వాన్ని వేయడం ఇదే మొదటిసారి, విమల కవిత్వంలో అద్భుతమైన ఆర్తి ఉన్నదని అన్నారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి శివారెడ్డి మాట్లాడుతూ పరిణామశీలమై జీవితం, పోరాటం,కలలు, వసంతాలు, అడవులు, ఆశ అన్ని కలగలిపిన కవిత్వం విమలది, అని అన్నారు. 1990లలో వచ్చిన అడవి ఉప్పొంగిన రాత్రిలోని విమల కవిత్వానికి ‘మృగన’ విమల కవిత్వానికి చాలా పరిణతి ఉన్నదని చెప్పారు. సౌందర్యాత్మకంగా విప్లవ కవులు రాయగలరని శివసాగర్‌ నిరూపిస్తే, దాన్ని ఇంకా అద్భుతంగా మలిచినది విమల కవిత్వం.

‘మృగన’ను ఆవిష్కరించిన వరవరరావు ప్రసంగిస్తూ ‘ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే హక్కు, అర్హత తనకు సంపూర్ణంగా ఉన్నాయన్నారు. సృజన పత్రిక సాహిత్యానికి చాలామందిని పరిచయం చేసింది. విమలకూడా అక్కడి నుంచి వచ్చిన రచయిత్రే. కవిత్వాన్ని రాసి పక్షుల్లా ఆకాశానికి ఎగిరేస్తే పాఠకులు అందుకున్నదే ఈ అద్భుతమైన కవిత్వం. ఈ కవిత్వంలో తీవ్రమైన కోపం, గొప్ప ఆశ, సముద్రపు అలలు, వెన్నెల, సీతాకోక చిలుకలు, ఒరిగిపోతున్న ప్రజా ఉద్యమాలు తిరిగి చిగురించుకుంటాయనే ఆశ అన్నీ ఈ ‘మృగన’లో ఉన్నాయి.

విమల ఈ కవిత్వంలో ఫీనిక్స్‌ పక్షిని విప్లవ సాంప్రదాయానికి భిన్నంగా వాడింది. పుస్తకం నిండా వెన్నెల ఝండా, ఉద్యమ విలువల కోసం కలలుకన్నది. నిప్పుల్లో కడిగినట్లుగా విమల విశ్వాసాన్ని పొందడానికి తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచింది. అంతేకాదు తన కవిత్వంలో తుపాకులే కాదు వెన్నెల, స్వేచ్చా, సాయంత్రాలు, సుత్తికొడవలితో పాటు నెమలి ఫించం కూడా ఉందని” అంటూ వరవరరావు గారు తన ప్రసంగాన్ని ముగించారు.

ఇదే సభలో ఈ పుస్తకం మీద ప్రసంగించిన చూపు కాత్యాయని మాట్లాడుతూ 1990లో విమల అడవి ఉప్పొంగిన రాత్రిది ఒక దశ, మృగన ఒక దశ నమ్ముకున్న ఆశయాల చట్రంలో గాయపడి బయటకొచ్చిన విమల తన కవిత్వంలో ఘర్షణపడుతూ ఆశల్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయం ఈ కవిత్వంనిండా కనపడింది. విమల కవిత్వం ఒంటరిది కాదు, చాలామంది ప్రశ్నలకు జవాబు విమల కవిత్వం అని ముగించారు.

ఈ సమావేశం ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. తెలుగు సాహిత్యంలోని కొంతమంది ప్రముఖ కవులు తమకు నచ్చిన ఇతర కవుల కవిత్వాన్ని చదివి సభను ఆనందపరిచే పద్దతి ఈ సభలో జరిగింది. సిద్దారెడ్డి, సుధాకిరణ్‌,గుడిహాళం రఘునాథ్‌, ఘంటశాల నిర్మల,కొండేపూడి నిర్మల, నిఖిలేశ్వర్‌,నగ్నముని ఇతర కవుల కవితల్ని చదివారు.

2 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

2 అభిప్రాయాలు

  1. hrk Jun 3, 2009 1

    సభ జరిగిన తీరు చాల బాగుంది. విమలకు, ఆర్కే కు అభినందనలు. సభ రిపోర్టింగ్ కూడా చాల బాగుంది. ఆహ్వాన పత్రం ప్రకారం కవి మితృలు తమకు నచ్చిన విమల కవితలు చదవాలి. రిపోర్టులో వాళ్లు ఇతర కవుల కవితలు చదివారు అన్నట్లుగా వుంది? వైవిధ్యం కోసం కార్యక్రమం మార్చుకుని వుండొచ్చు.
    -హెచ్చార్కె.

  2. ప్రాణహిత » జూన్ 2009 సూచిక Jul 6, 2009 2

    [...] విమల ‘మృగన’ ఆవిష్కరణ : వేముగంటి మురళీకృష్ణ [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో