Jun2009
మృగయ
- నామాడి శ్రీధర్
పట్టపగ్గాలు లేక
పరుగులెత్తే
కాంచనమృగమీ రోజు
నన్నొక
ధూమ ప్రతిమలా మలచి
దివిమీదికి ఉసిగొల్పావు
ఒళ్ళన్నీ
ఆరని వత్తుల కనులు
స్వతహాగా అస్త్రకారుడిని
అబద్దం ఆకురాయికి
పదనుదేరిన వేటకొడవలి
మిలమిల నవ్వు
వడివడిగా
చతుష్పాదిలా
కలయతిరుగుతున్నాను
ఇనుప తీగలు
నీలి రక్తనాళాలు
కలగలిపి అల్లిన వలతో.
June 1st, 2009 at 6:51 am
ఈ కవిత బాగుంది.
June 3rd, 2009 at 3:11 pm
‘ఇనుప తీగెలు రక్తనాళాలు కలగలిపి అల్లిన వల తో….’, ‘దివి మీదికి ఉసిగొల్పిన ధూమ ప్రతిమ.’… వావ్! ‘బంధన ఛాయ’ నుంచి మొదలైన నామాడి పయనం చాల బాగుంది, మనోహరంగా వుంది.
నగరానికి దూరంగా వుంటే అంత బాగుంటుందా, శ్రీధర్!
ఒక్క మాట, ఇదంతా ఎవరో చే(యి)స్తున్నారనే ఫీలింగ్ కలుగుతోంది. (దివి మీదికి ఉసి గొల్పిందెవరు?, ధూమ ప్రతిమ ఎవరు?) ‘బంధన ఛాయ’ చదివాక మరీనూ.
ఈ రకం ఫ్లైట్ అఫ్ ఇమాజినేషన్ ఎక్కడికి తీసుకెళ్తుందోనని భయం. రెక్కల గుర్రం మీది రౌతును చూస్తున్నప్పటి భయం. నిజమే, నిజమే. ఎగరాలి, భయపడితే కుదరదు. కంగ్రాట్స్ .
December 13th, 2009 at 11:16 am
శ్రిధర్ గారు,
మీ కవితలు చాలా భాగున్నాయి.
December 27th, 2009 at 6:48 am
what you desired to said through these lines of words are never reach my mind. so change your way of talking in so called your poetry.