పాతికేళ్ల రంజని-కుందుర్తి అవార్డుల కవన ప్రస్థానం

- డా|| నాళేశ్వరం శంకరం

మనకున్న సాహిత్య సంస్థలలో ‘రంజని’ సంస్థకు విశిష్టమైన చరిత్రవుంది. ఇదొక జీవనదిలాంటిది స్వలాభంకోసం, స్వప్రయోజనాలకోసం నడిచేసంస్థ కాదిది ఏజీ ఆఫీస్‌ ఉద్యోగులంతా కలిసి ఏర్పాటుచేసుకున్న సంస్థనే గాని, ఇది ప్రభుత్వ సంస్థకాదు. 1961 నుంచి నేటిదాకా ఎక్కడా ఆగిపోకుండా నిర్విరామ కృషిచేస్తూనే ఉంది. ఈ సంస్థకార్యక్రమాలు, పత్రికనిర్వహణ, ప్రత్యేకసంచికల ప్రచురణ, కవిత్వం, కథల సంపుటాలు, పరిశోధనాగ్న్రంధాలు విమర్శనాగ్న్రంధాలను ప్రచురించి ఒక ప్రామాణిక సాహిత్యసంస్థగా ఎదిగింది రంజని నిర్వహించే పనులన్నీంటి కన్న ప్రతి ఏట రంజని – కుందుర్తి అవార్డులను యువ కవులకు ఇరవై యేళ్ళ బట్టి ఇస్తూ వస్తున్నది ఇంతటి నిర్విరామ కృషికి ప్రధాన కారకులు చీకోలు సుందరయ్యగారు. ఆయనకు, రంజని సంస్థ సభ్యులకు నా ప్రత్యేక అభినందనలు

పాతికేళ్ళ రంజని – కుందుర్తి అవార్డుల కవితలకు ఒక మహా ప్రస్థానం ఉంది. అవార్డులకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతియేట యువకవులకు, కవయిత్రులకు ఆవార్డులనిస్తుంది. అవార్డుకు కవిని ఎంపికచేయడం కన్నా వారికవితను ఎంపికచేయం ఈ సంస్థ ప్రత్యేకత ప్రతియేట పోటికివచ్చే వేల కవితలను మొదట వడపోస్తారు. ఆతరువాత కవితరాసిన కవిపేరును, చిరునామాను రహస్యంగా ఉంచుతారు. వడపోసిన కవితలకు ముగ్న్గురు సీనియర్‌ కవులను న్యాయనిర్ణేతలుగా నియమిస్తారు. వారిచేత కవితలు సెలక్ట్‌ చేయమని చేప్పకుండా ఆయా కవితలలోని వస్తు,రూపాలను బట్టి, అభివ్యక్తినిబట్టి మార్కులు వేయమంటారు. ముగ్న్గురు న్యాయనిర్ణేతలు వేసిన మార్కులను కలిపి ఏ కవితకు ఏక్కువ మార్కులు వస్తే దాన్ని అత్యుత్తమ కవితగాను ఆతరువాత వచ్చిన మార్కులను బట్టి ఉత్తమ కవితగాను అదేవరుసలో ఉండే పది కవితలను మంచి కవితలుగా స్వీకరించి ఈ కవితలు రాసిన కవుల పేర్లను పత్రికాముఖంగా ప్రకటిస్తారు. అవార్డులు అందజేసిన తరువాత ఆ కవితలను ఒక ప్రముఖ పత్రికలో ప్రచురణ అయ్యేట్లు చూస్తారు. ఇలా ప్రతియేటా అవార్డులు ఇచ్చిన కవితలను సంకలనాలుగా ప్రచురిస్తారు. 1984 నుంచి నేటివరకు ఆగిపోకుండా కొనసాగిస్తున్న సంస్థ మనరాష్ట్రంలో మరొకటిలేదు.

ఇప్పటి వరకు అవార్డు పొందిన కవితలను ఏడు సంపుటాలుగా ప్రచురించారు. 1. గొంతులు చిగిర్చాయి 2. ముప్పయ్‌ కవితలు 3. గమనం 4. ఆకాంక్ష 5. కిరణం 6. స్పృహ 7. ఒక నులివెచ్చని స్పర్శ. ఈ ఏడు సంపుటాలలో ఉన్న మొత్తం కవితలు 280,ఇందులో ఇరవై నాలుగు కవితలు అత్యుత్తమ కవితలు. మరో 24 కవితలు అత్యుత్తమ కవితితలు. మరో 24 ఉత్తమ కవితలు. మిగిలినవి మంచి కవితలు. గత సంవత్సరానికి గాను అవార్డులు పొందిన కవితలింకా ఇందులో పొందుపరచలేదు. ఇంకా పుస్తకరూపంలో రావడానికి సిద్ధంగా ఉన్నాయి

ఈ ఏడు అవార్డు కవితా సంపుటాలతో పాటు రంజని. . కవిత్వం కోసం ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు చేసింది. ’అమ్మ’ అనే ఒక మహా సంకలనాన్ని ప్రచురించింది. ఇందులో అమ్మపైన నూటపద్దెనిమిది కవితలున్నాయి. అలాగే ‘మావూరు’ అనే మరో బృహత్తరమైన వచన కవితా సంకలనాన్ని ప్రచురించింది. కవులు పుట్టి పెరిగిన ఊళ్ళ నేపథ్యంలో నూట అరవై కవితలు ఇందులో ఉన్నాయి. పందొమ్మిది భారతీయ భాషలు,నలభైకి పైగా ప్రపంచ భాషలలోని కవితలను అనువదించి ఒక మహాసంకలనంగా ప్రచురించింది. ఆధునిక తెలుగు కవులలో రంజనికి నచ్చిన తొమ్మిదిమంది కవుల,కవియిత్రుల కవితల ఆడియో కేసెట్‌లను తీసుకువచ్చింది. విశ్వవిద్యాలయులు,గొప్పగొప్ప పబ్లిషర్స్‌ ప్రచురించవల్సిన పనిని రంజని చేసి సఫలంపొందింది. వచన కవిత్వానికి రంజని చేస్తున్న కృషి మరువలేనిది. దానివెనుక శ్రమిస్తున్న చీకోలు సుందరయ్య శ్రమ మరువరానిది. ప్రస్తుతం రంజని వచన కవిత్వంలో చేసిన కృషిని మాత్రమే

విూ ముందు ఉంచే ప్రయత్నమిది.

కందుర్తి నిజంగా వచన కవితాపితామహుడే. ఆయన స్వయంగా ఫ్రీవర్స్‌ ప్రింట్‌ను స్థాపించి ప్రతియేట ఒక కవితాసంపుటికి అవార్డునిచ్చి మంచి కవిత్వాన్ని ఆదుకున్నాడు. ఆయన తదనంతరం కూడా ఫ్రీవర్స్‌ ప్రింట్‌ వచన కవితా సంపుటాలకు అవార్డులను అందిస్తుంది. ఫ్రీవర్స్‌ ప్రింట్‌ అవార్డును సాహిత్య అకాడవిూ అవార్డంత గౌరవంగాను, ఒక్కోమారు అంతకన్నా ఎక్కువగాను భావిస్తారు. అలాగే కుందుర్తి మరణాంతరం ఆయన పేరు విూద ప్రతియేటా వచన కవితకు రంజని-కుందుర్తి అవార్డును ఇస్తున్నారు. ఫ్రీవర్స్‌ ప్రింట్‌ అవార్డుకు ఎంత విలువ ఉందో రంజని-కుందుర్తి అవార్డుకు అంతే విలువుంది.

రంజని-కుందుర్తి అవార్డు కవిత్వమే ఉత్తమ కవిత్వమని నేనటంలేదు. ఏ అవార్డు కవిత్వమైనా సరే,అవార్డు కవిత్వమే ఉత్తమ కవిత్వమని, పొందనిది సాధారణ కవిత్వమనే భావన నాకులేదు. అవార్డు ఒక కవి కవితకు రావడం వల్ల ఆ యువకవిలో కాస్త ఉత్సాహం కలిగి మరింత బాధ్యతతో మరింత మంచికవిత్వం రాయగలడు. రంజని ప్రచురించిన రెండు వందల ఎనభై అవార్డు కవితలు అధ్యయనం చేస్తే వాటిలోని ప్రత్యేకత,విలక్షణత కవిత్వంలో వస్తున్న పరిణామం అర్థమవుతుంది. ఈ చిన్నవ్యాసంలో ఇన్ని కవితల్ని విశ్లేషించడం సాధ్యం కాదు. వీటిన్నిటిని చదివినపుడు ఏ కవికి ఆ కవే ప్రత్యేకమైన కవి. అలాగే ఏ కవితకు ఆ కవితే. ఎవరి కవితావస్తువు వారిదే. ఎవరి కవిత్వ ఎత్తుగడ,నడక,ముగింపు,భాష,పదాలు, పదబంధాలు,వ్యక్తీకరణలు,విభిన్న కవితా వస్తువు గల గట్టిగింజలవంటి కవితలు ఇందులో ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా ఈ అవార్డు కవితల కవితా వస్తువు ప్రజల సమస్యలు,సంఘర్షణలు,ఆకాంక్షలకు అద్దంపట్టేట్టున్నాయి. కవులు

తమ ఉనికిని కాపాడుకోవటం కోసం రాసిన కవిత్వం కాదిది. ప్రజల ఆవేదనలను, రోదనలను,ఆవేశాలను,తిరుగుబాట్ల ప్రతిఘటనలను విప్పిచెప్పిన కవిత్వమిది. 1984 నుంచి నేటివరకు మన రాజనీతి

ఆర్ధిక,సాంఘిక రంగాలలో వచ్చిన మార్పులు,ప్రజలు చేసిన

ఉద్యమాలు పోరాటాలను గుర్తించి రాసిన కవితలు ఇందులో

ఉన్నాయి. ఈ కాలంలో వచ్చిన స్త్రీవాదం,దళితవాదం, ఆధునికానంతర కాలం,మైనారటీవాదం, ప్రాంతీయవాదం, వివిధ ధోరణులుగల కవిత్వం ఈ అవార్డు కవితల్లో ఉన్నాయి.

దళితవాదం తెచ్చిన తిరుగుబాటు తత్వం గల కవితలు ఇందులో ఉన్నాయి. దళిత కవుల ప్రధాన ధ్యేయంలోని ఆవేశం,కోపం వారి కవిత్వంలో ఎందుకు ఛార్జి అయిందో తెలియాలి. మద్దూరి నగేష్‌బాబు బతికున్నంతకాలం చిరునవ్వుతోనే జీవించాడు. కవిత్వం విషయంలో ఆయనొక గండ్రగొడ్డలే. ఈ గండ్రగొడ్డలే దళిత కవిత్వానికి వన్నె తెచ్చింది.

ఆయన తరువాత పైడి తెరేష్‌బాబు అంటాడు. . . ” గింజ మీద నాపేరు చెక్కడం నేర్చుకున్నాను,బాటమీద పోరాటానికి చర్మాన్ని ఆయుధం చేసినవాణ్ణి. . , ఇపుడు నేను చెప్పులు తొడుక్కుని బాటమీదకొస్తున్నాను. ”

అనడంలో వర్ధమానకవి కవిత్వానికి కావాలిసిన ప్రత్యామ్నాయ కవితా వస్తువును,భావజాలాన్ని కవన వేదిక మీద సమకూర్చి పెట్టినట్లయింది. చల్లపల్లి స్వరూపరాణి స్త్రీల ముక్త కంఠాల్ని ఆహ్వానించింది” నేను శిల్పాకృతిలో వున్న నల్లని మాంసపు కళాఖండాన్ని , నాకు శరీరం తప్ప మనసెక్కడిది మరి! గంధపు చెక్క,,విప్పవూవులతో పాటు అడవి అందాలు సైతం అమ్మకపు సరుకై ఎన్నిసార్లు అంగళ్లకు రవాణా కాలేదు. మా తాత ఏకలవ్యుడు వేలును మీ పాళీగా చేసుకున్నది చాలక మా పచ్చని పరువాలను కూడా నిప్పుల్లో తగలబెడతారని తెలిస్తే. . మా అడవితల్లి పత్రహరితానికి బదులు పత్రవిషాన్ని విరజిమ్మేది” అనడంలో భావనను ఆవేశంగా ఆక్రోశంగా ఉద్విగ్న్నంగా చెప్పడంలోనే దళిత కవుల కవన శిల్పంపురుడు పోసుకుందని గ్న్రహించాలి. ఇలాంటి కవితలు కొన్ని ఇందులో ఉన్నాయి. కాస్త దళితబాధను సింక్‌ చేయగల కవిత్వం,అవార్డు కవిత్వంలో ఉండటం విశేషం.

ఉద్యమాలే ప్రజల కన్నతల్లులు. ఉద్యమ చైతన్యం ప్రతివారిలో ఉండాలనే వాడు ఒంటరి సామాజికుడైనా సమిష్టి మనిషైనా సత్య చైతన్యశీలి కావాలి. చైతన్యంతో కూడి త్యాగం ప్రజల స్వభావంలో భాగంకావాలి. ఉద్యమాలు, ఉద్యమకారుల గుణాత్మక నిబద్ధత ప్రజలకు అత్యవసరం అంటాడు నాళేశ్వరం శంకరం. ” వెలిగే నయనాలే ఆశతో ఆశయాల్ని చేరగలుగుతాయి. ఏకాకి అయితేనేవ్‌ు గమనిస్తూ అడుగుతీసి అడిగేస్తే నది కనబడుతుంది. సముద్రం కనబడుతుంది. మట్టిలో దిగబడిలేచి నడిచేవాడికే భవిష్యత్‌ కనబడేది. మనం తెగినపుడే తెగించినపుడే మనదారి మనకు స్పష్టంగా కనబడి దారి చూపుతుంది”. ప్రజల బాధల్ని గమనించే స్వభావం, ఉద్యమాల మార్గం వ్యక్తుల్లో ఉన్నపుడే మనిషి సామాజికుడు కాగలడు.

కుందుర్తు అవార్డు కవులలో ఆశారాజు ఒకరు. వీరికి రెండుమూడు సార్లు అవార్డులు వచ్చాయి. ఊహబలంగా ఉన్న కవి. రిథవ్‌ు ఆఫ్‌ థాట్‌కుండే ధ్వని బలంగా ఉంటుంది. సహజత్వం పొరలుపొరలుగా దర్శనీయమవుతుంది. ఆశారాజు. . మనిషి ఆయుధం కావాలంటాడు. ” ఈ జీవన పోరాటంలో మనిషే ఆయుధం కావాలి! ఈ లోకం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. జీవితాన్ని మిగల్చకుండా తినేస్తుంది. ఆయుధంలేని మనిషికి బతుకులేదు” అంటాడు. అలాగే గుంటూరు ఏసుపాదం,కోట్ల వెంకటేశ్వరరెడ్డి,కె. కిషోర్‌కుమార్‌, అన్నవరం దేవేందర్‌ కవితలు ఈ రిథవ్‌ు ఆఫ్‌ థాట్‌ని మరింత ముందుకు తీసుకుపోయాయి.

అవార్డు పొందిన కవిత్వంలో వ్యవసాయ కవిత్వం ద్వారాలు తెరిచింది. రైతుల వేదనకు చాలా కవితలు అద్దం పట్టాయి. తుమ్మల దేశ్‌రావ్‌ “మట్టి మీద శ్వాసిస్తున్న మనిషి దైన్యాన్ని చూసి. . గింజల కోసం నెత్తురోడుతూ భూమి దుఖిస్తుంది. పచ్చని స్వప్నం అమాంతం ఎగిరిపోయి. . భూమి దుఖిస్తుంది. తడారిన గొంతుతో ఆకాశాన్ని రొంపుకుంటూ. . ” ఇలా రైతు జీవన దుఖాన్ని హృదయానికి హత్తుకునేట్లు రాశారు. అలాగే యం. వి. రామిరెడ్డి రైతు దుఖం లోతుల్లోకి వెళ్లి కారణాలు వెతికి చెప్పిన కవితే ‘తరిలేదు ఆరుతడీలేదు. ప్రాజెక్టుల గర్భంలో నీటిపిండమే లేదు” అంటాడు. పాడిపశువుల విక్రయాన్ని,దౌర్భాగ్యాన్ని కళ్ళ ముందుంచుతారు. అలాగే శంకరరాజు,రాజ్‌కుమార్‌,తాళ్లపల్లి రాంబాబు రైతుల ఆత్మహత్యలు చూసి చలించి రాశారు.

ఆధునికానంతర కవిత్వం ఈ కవితల్లో చాలానే ఉన్నాయి దెంచనాల శ్రీనివాస్‌ భావానుభూతి బలమైంది. ” పుట్టిన ముప్పై సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను. , నిశ్శబ్దం చేసిన శబ్దంలో నుంచి ఉద్భవిస్తోన్న శోకాన్ని. . , శిశువుగా ఉండగా ముందుగా తల్లి గర్భంలో ఉండే విన్నాను. నిట్టూర్పులోంచి సంధించబడిన శతాఘ్నిరావాల్ని అమ్మా! భారతీ ! నాకు గుడ్డివాడినవ్వాలని ఉంది తల్లీ”. కవిత్వంలో వ్యక్తుల ఇష్టాయిష్టాల్ని బలంగా చెప్పారు. ఆత్మాశ్రయం వస్త్వాశ్రయంతో సిద్థార్థ ,శ్రీకాంత్‌ మరికొంత ముందుకెళ్ళేటట్లు రాశారు.

స్త్రీల సమస్యల కవిత్వం చాలానే ఉంది. స్త్రీ సమస్యలోని పలు కోణాలుగల కవితలు ఉన్నాయి. లలిత కుమారి “టపా చేయని ఉత్తరం రాస్తూ రాబోయే పండుగ లాంఛనాలకు,మారకానికైనా మనింట్లో ఇంకేమి మిగల్లేదని తెలిసిన నాకు, మా వంటింట్లో గ్యాస్‌ సిలెండర్‌ ఎప్పుడు పేలుతుందోనని భయంగా భయంగావుందమ్మా. ”అని కన్నుమూసిన కూతురి ఉత్తరం చదివితే వేదన కలుగుతుంది. అలాగే సి హెచ్‌ ఉషారాణి అరబ్బుదేశాలకు అమ్ముడుపోయే బాల్యాన్ని కళ్లకుకట్టింది. నిశాపతి గారు స్త్రీ చైతన్యాన్ని ఆకాంక్షిస్తూ రాసిన కవిత ఇందులో ఉంది. చిత్తలూరి సత్యనారాయణ్నర్సయ్య కార్యాలయంలోని స్త్రీ ఉద్యోగుల మీద మంచి కవితరాశారు.

కవిశక్తివంతుడైతే కవిత్వం శక్తివంతంగా ఉంటుందని చెప్పడానికి ఎండ్లూరి సుధాకర్‌ నిదర్శనం. అందరికీ తెలిసిన స్వాతంత్య్రాన్ని తనదైన శౖలితో చెప్పి పాఠకుని మనసును మార్చగలిగాడు. ” నా దేశంలో జెండాకు,మనిషికీ ఆకారంలో పెద్ద తేడాలేదు. ఇక్కడ గుండాలకు జెండాలుంటాయి. దేశద్రోహులకు కూడా జెండాలుంటాయి. ఎవడి కర్ర బలంగా ఉంటుందో వాడి జెండా మాత్రమే రెపరెపలాడుతుంది. . ”దీన్ని విశ్లేషించాల్సిన అవసరం లేకుండానే పాఠకుడు కవితలోని భావానుభూతిని పొందగలుగుతాడు. ఇలాగే మతోన్మాదంపై పెరుమాండ్ల శ్రీదేవి, మానీయ విలువల కోసం సిద్ధార్థ, సామూహిక జీవన దుఖాన్ని ఎత్తిచూపిన మోతుకూరి అశోక్‌ కుమార్‌” ఈ తెరసాప ఎత్తడానికి కూడా నాకు మనస్కరించడం లేదంటాడు” శిది¸ల జీవితాన్ని పి. శ్రీనివాస్‌గౌడ్‌,వై. రాములు రాశారు.

కార్మికుల వ్యథలను చాలా సరళభాషలో రాసి పాఠకులను ప్రభావితం చేయగల కవుల్లో పి. విద్యాసాగర్‌ చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టేట్లు రాసిన ఒక కవిత ఉంది. కాళ్ళచేతులతో నేసిన వస్త్రాలను వాళ్ల శవాల మీదనే కప్పే దుర్మార్గ సంస్కృతిని ఎత్తిచూపాడు. వివిధ సమస్యల మీద రాసిన కవితల్లో ఎందరెందరి కవులయో మంచి కవితలున్నాయి. ఇస్త్రీవాడి జీవితాన్ని కె. గీత,లేడి కండక్టర్‌ మీ ద అద్దంకి శ్రీనివాస్‌,మహ్మదాలి సెక్స్‌ వర్కర్‌ మీద భల్లం మగ్న్గం బతుకుల మీద రాసిన కవితలు పాఠకులను వెంటాడుతాయి. అలాగే అవార్డు పొందిన కవితల్లో బాల్యం మీద రాసిన కవితలు,అమ్మ మీద రాసిన కవితలు ఎన్నో ఉన్నాయి.

వ్యతిరేకించిన కవిత్వం అవార్డుల్లోకి రావడం ముదావహం. వేముగంటి మురళి సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించారు” మనమంత అంకుల్‌ చిప్స్‌పై వాలిన ఈగలం. . వాడి గొడుగు కింద నీడను ఎందుకు పంచుకోవాలి?. , ఆయుధాలు ధరించిన చేతుల్లోంచి ఉప్పెనలా పొంగే ఉదయం కావాలని. ” అని సాధారణ ప్రజల ఆకాంక్షను వ్యక్తీకరిస్తూనే దాన్ని సాధించుకోవడానికి చైతన్యం,తిరుగుబాటు శక్తి, ఉద్యమించే స్వభావం మనలో ఉండాలంటాడు.

ఇందులో ఎందరో కవులున్నారు. అందరి కవిత్వాన్ని విశ్లేషించే పరిధి దీనికిలేదు,కుందుర్తి అవార్డులు పాతికేళ్ళ పొందిన కవితలన్నింటిని విశ్లేషించడం సాధ్యంకాని పని. రామతీర్థ,మానేపల్లి,కోడూరి విజయకుమార్‌,చిల్లర భవానీదేవి,రాధేయ,చెమన్‌,అన్నవరం దేవేందర్‌,పసునూరు శ్రీధర్‌బాబు,ఆదూరి సత్యవతిదేవి,బండ్లమాధవరావు,సుదేరా, పెరుగు రామకృష్ణ,చిత్తలూరి సత్యనారాయణ,కె. ఆంజనేయకుమార్‌ వంటి ఎందరో కవులు మరెన్నో మంచి కవితలు అవార్డు కవితల్లో ఉన్నాయి. రంజని గొంతు చిన్నదనుకునేవాళ్ళు ఈ పాతికేళ్ల కవన వృక్షమెక్కి చూస్తే ఎన్నెన్ని చిగుర్లు దొరుకుతాయో చెప్పలేను. రంజని -కుందుర్తి అవార్డుల కవిత్వంపైకి ప్రొత్సహించిన కవిత్వమని అన్నా. . , అది సమాజాన్ని నడిపించే కవిత్వంగానే నేను భావిస్తాను.

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో