తమన్నా

- ‘పాన్‌మరక’ అలీ

హైదరాబాద్‌ బంధం చార్మినార్‌ చమన్‌
బాంబుల మోతలు,మతాలు,మతలబులు
అమాయక జనాలు బలిపీఠంపై బొమ్మలు
బద్‌నామ్ కూతలు అమలిన మనసులు
నెలవంకలు,పాచికలు, తుపాకి తూటాలవేటలు.
సర్కార్‌ సర్కస్‌లో నా షేర్‌ బంధీలు.

అనుమానం చూపు భూతమై ప్రత్యక్షమౌతుంది
విదేశీ అదృశ్య హస్తం చిలుక జాతకం షూరూ
అక్కడివాడు ఇక్కడ బుడుబుంగ నాటకం
సీసంగోలిలు పొదిగిన వాడి కంట్లో కలక

నేనొక మిలిటెంట్‌ మిస్టరీ
నేనొక ఐ ఎస్‌ ఐ వంకరచూపు
నేనొక ఉగ్రవాది ఊతం ఉరుకులు
మెడలో తీవ్రవాది మంత్రం తాయత్తు.
గడ్డం,మతం ముద్దెరై నలుగుతున్న అనుభవం
శిల్పి చేతుల్లో అద్భుతంగా రూపుదాల్చిన ఊహ చిత్రాలు
ఇది నా పిశాని మీది రాతకాదు అభూత కల్పనలు
జాగీర్లు యజాత్‌ వక్ప్‌ ఆస్తులు సమస్తం
నా అబ్బసొత్తు కానేకాదని బుకాయించుడా!!!
షేర్‌- బక్రి ఖేల్‌మే మూడు సింహాల కుట్ర
గాలిలో దీపం గరీబి గులాముల జీనా
ఫుట్‌పాత్‌కు అతుక్కపోయిన కాపురాలు
విద్య “కొన”జాలని జంగ్లీ అవులాద్‌
ఆగ్రహ జ్వాలకు కనికట్టు ఆనవాళ్ళు
గిరిగీసి నోటికి తాళం కప్ప గొళ్ళం.

పొట్టచీల్చుకొని ఆకలిపేగులు చూపలేను
అక్షరాలు నాది శాంతిగీతం
రస్తాలో రుకావట్‌ తొలిగించే రివాజు,
ఒక ర్యాలిని భుజాలకెత్తుకోలేని మట్టి తలకాయలు.
ధర్నాకైనా హిమ్మత్‌లేని లాల్చిపైజామాలు
రూమిటోపీలకు బిగించిన హద్దుల సంకెళ్ళు
నా నోట్లోని నాలుకకు కుట్లేసిందెవరురా?!
మేము మౌనంగా జులుంను మోసె బండగుర్తులమేనా!!

గుడ్డకాల్చి మీదికి విసిరే నైజం కాని చిరునామాలు
శూన్యంలో చేతులు సాపి దువా చేసే పసిహృదయాలు
కాటువేసి అమాంతం మింగటానికి తెర్సుకున్న
కాషాయం ఆనకొండ కళ్ళల్లో నిప్పు కణికల కొలిమి
సర్కారి పట్టాలు వాటా పంచుడు దూరపు కొండలు
చాకరీల దలిందర్‌ జిందగీలే తోఫా తోరణాలు.

అతుకుల బతుకుకు గతగుర్తులు పుట్టుమచ్చలు
నవాబుగిరి అచ్చుగుద్దిన గుంగీ గుడియాలు
వెన్నెముక పరాయితనంతో రంపపుకోతలు
నా సూర్మా కళ్ళల్లో సూక్ష్మ కెమెరాలు బంధించాను
కల్‌కా తెలంగాణకే చమన్‌మే నయినా రోష్నీ
తలంపుల్లో తక్‌దీర్‌కి ఇంద్రధనుస్సు మెరపులు
మదిలోతుల్లో నుంచి తన్నుకొస్తున్నా తమన్నా.

బతుకు మరమత్తుకు ఇంజనీరింగ్‌ ఇంజన్లు నై
బీమారిని కనిపెట్టే డాక్టరు పట్టాలు పగటికలలు
మెరిసే చేలలో పనిముట్లై తేలుతు
రాత్‌దిన్‌ భయాన్ని మోస్తున్న దేహాల గుంపులు
వెక్కిరిస్తున్న కొంపగోడుల మరకలు గురకలు
కొత్త మెరుగులు హంగులు అద్దుకోటానికి
ఆకుపచ్చని మైదానాల్లో కొత్త గాలివిసురు.
దేశం నిండా అలుపెరగనీ ఈద్‌ కా చాంద్‌లు

తెలంగాణకు ఆవహించి చుట్టుకున్న కుంద్లా
సైతాన్‌ రూపంలో దాక్కున్న నరదృష్టి తెరలు
ఊదుపొగలు జతగాళ్ళు జనాలు గుంపులగులేర్లు
దశ దిశా నిర్దేశానికి కొత్తదారి వెతుకులాట.

నా వతన్‌లోని జమీన్లు కబ్జా చేసుకుందెవరురా?
బతుకు భారంగా గరిబీ చిప్పలోకి
దిగజార్చింది ఎవరితరపు కపటనీతి?
రేపటి తెలంగాణా కోసం దూలాడటాన్కి
పోగుపడి అలావా గుండం తవ్వుతున్నాం.

హుషారి
జనాభానిష్పత్తికి సరిసమానంగా తూకం శూన్యం
ప్రభుత్వ నౌకరీలు భర్తీలు నునుపు కొండలు
ఉన్నత శ్రేణి విద్యలు నా ఇంట్లో అందని ద్రాక్ష
రాజ్యాధికారం కోసం వాటాల కోటాలు
బరాబర్‌గా బట్వాడా చేసుకుందాం.
చిల్లులుపడి మునుగుతున్న మన ఓడకు
కోటాను కోట్ల ఊపిరిలూది పూడ్చుకుందాం
“ నా ఓటుబండి ఎటువైపు ఉర్కుతుందో
అటువైపే తరాజులో గెలుపు మొగ్న్గుతుంది”.

నెలవంకను తెంచుడు ముంచుడు మానుకో
జాతి ఐక్యతశక్తి ఒక నిశ్శబ్ద విప్లవం
అది అగ్నిపర్వతమై పగ్లి లావా చిమ్మే
సమయం కనుచూపులోనే కనిపిస్తుంది.
పోరుతోనే హక్కులు సాధించుకుంటాం
ఐక్యతను విరిచి పోగులుపెట్టె గాలి గొట్టాలు
దళిత్‌ ముస్లిం మధ్యల గుంజాటన గుళికలు

మేము మైనపు ముద్దలం అతుక్కపోతాం.
తాటాకు చప్పుళ్ళకు బెదిరే కుందేళ్ళుకాదు
కోర్కెతీర్చిన బొటనవేలు కాదు ఇది చూపుడువేలు
మన్యంలో పులిపంజాలమై కదులుతున్నాం
మా గుండెల్లో దాక్కున్న పిడుగులు
చీకట్లో ఉరుములై ప్రవహిస్తాయ్‌.

నే పుట్టిన గడ్డమీద నన్నోడొక్కు సైకిల్‌జేసి
నిలువునా నన్ను దోపిడి చేసే వాడి గుండెల్లో
ఇప్పుడే. . నేనొక యుద్ధ సైరన్‌ మోగిస్తున్నా. .

2 అభిప్రాయాలు »కవితలు

2 అభిప్రాయాలు

  1. pravallika Jun 1, 2009 1

    మీటా పాన్ని తిన్నంత ఆనందంగున్నది, ఆలి బాయి

  2. vishvasi Jun 21, 2009 2

    చాల బగుంది.అలి గారు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో