తెల్ల దెయ్యం నీడ

- కాత్యాయనీ విద్మహే

పచ్చని పెద్ద మైదానాలు
పిల్లకాలువలు
పెద్ద పెద్దరోడ్లు
బారులు బారులుగా
మెత్తగా పరిగెత్తే కార్లు
సుఖంగా
శుభ్రంగా
అన్నీబాగానే వున్నాయి
ఊపిరే ఎందుకో ఆడటం లేదు
ఊహలే ముందుకు సాగటంలేదు

నడక కనబడదు
శ్రమించే చేతులు కనబడవు
చెమటొడ్చే మనుషులు కనిపించరు
చింపిరి తలలు కనబడవు
చిరిగిన చీరెలు కనబడవు
చింతలు, వంతలు లేనే లేవు
ఊపిరే ఎందుకో ఆడటం లేదు
ఊహలే ముందుకు సాగటం లేదు

సమీకృత సంపద
విశీర్ణం చేసిన జీవితాలను
దిగంతాలకు నెట్టి
విస్తరించికొన్న
మైదానాల విశాలత్వంలో
శ్మశాన నిశ్శబ్ద విషాదం
ప్రతిధ్వనిస్తుంటే
ఊపిరి ఆడుతుందా?

దూరాన్ని మింగి
మత్తుగా సాగే మెత్తని రోడ్డు
మనిషిని మింగిన అభివృద్ది కొండ చిలువ
అయి భయపెడుతుంటే
ఊహలు సాగుతాయా?
పంట, తిండి
వస్త్రం, తైలం
ఎలక్ట్రానిక్ వస్తుభయం
ఏవీ తనవి కాకపోయినా
అన్నిటినీ తనవిగా
చేసుకోగల
గుత్తాధిపత్య అధికారమాయాదండంతో
ప్రపంచాన్నంతా శాసిస్తున్న
అహంకారాన్ని శ్వాసిస్తున్న
మాయల ఫకీరు నీడలో
ఎవరికైనా ఊపిరి ఆడుతోందా?
ఎక్కడైనా ఊహలు విచ్చుకొంటాయా?
మాహాబజార్లు
మాయాబజార్లు
చైన్లయి
ప్రపంచాన్నంతా చుట్టేసే
కబంధ హస్తాలై
విస్తరిస్తుంటే
ఉనికిని కోల్పోయే
స్థానిక మార్కెటును
గురించిన భయంలో
ఊహలు ఊపిరి పోసుకొంటాయా?

ప్రపంచాన్నంతా చాపగా చుట్టి
చంకన పెట్టుకొని చక్కా పోవాలనుకొనే
హిరణ్యాక్ష వారసత్వం
ధిక్కార ఎవరిదైనా నేరమేనంటుంది
అంతిమ తీర్పులు ప్రకటించే
నిస్సిగ్గు, నీతిమాలిన
ప్రపంచశాంతి కార్యక్రమంగా
అమలు చేస్తుంది.
తన తనం నుండి
ఎంతో మందిని పరాయీకరించి
తనకోసం
తనవికాని
వేటినైనా
భూగోళం మీద ఏమూల వున్నా
ఇట్టే కనిపెట్టి
గద్దలా తన్నుకు పోయే
తెంపరి తనపు
తెల్లదయ్యంతో
నేను కరచాలనం చెయ్యలేను
కలిసి నడవలేను.

(2005 లో తానా సభలకని అమెరికా వెళ్ళి వచ్చినప్పటి నుండి సద్దాం ఉరితీత వరకు నాలో కలిగిన అలజడికి, అశాంతికి అక్షర వ్యక్తీకరణ.)

ఒక అభిప్రాయం »కవితలు

ఒక అభిప్రాయం

  1. రవికిరణ్ Jun 4, 2009 1

    అవును, నిజవే కదా!

    పచ్చని పంట పొలాల్ని కబళించి
    కురుపుల్లా విస్తరించిన సెజ్ల మధ్య
    ఊపిరాడుతుంది.
    కాదంటే పిట్టల్లా
    కాల్చేసే చోట
    ఊపిరాడుతుంది
    నడిబజార్లో ఆడవాళ్ళ
    చీరలూదదీసే చోట
    ఊపిరాడుతుంది.
    అక్కడే వాళ్ళని
    గ్రామ పెద్దలు
    మానభంగం చేస్తే
    అక్కడ ఊపిరాడుతుంది.
    సగం మంది,
    మనుషుల్ని పశువుల కన్నా
    హీనంగా చూసె చోట,
    పశువుల్లాగే తెగ నరికే చోట
    ఊపిరాడుతుంది.
    అవును నిజవే కదా
    ఊపిరికి విలువలేని చోట,
    ఊపిరికి కొరతేవుంది.

    తానా సభలకి ఒక సారి అమెరికా వచ్చి గడిపిన నాలుగు రోజులు, వున్న నలుగురు స్నేహితుల ఇళ్లు మీకమెరికా గురించి ఏవీ అవగాహననిచ్చుండవు. ఇక్కడా మన తెలుగు దేశంలో లాగే మనుషులే వుంటారు. ఇక్కడా సాయంత్రాలు, అమ్మలు, నాన్నలు ఆఫీసుల్నుండి, పంట పొలాల నుండి ఇంటికొస్తారు. ఇక్కడా మనుషుల్ని మనుషులు ఇష్టపడతారు, వాళ్ళకొసం త్యాగాలు చేస్తారు. తెలుగు అమ్మల్లాగే అమెరికా అమ్మలు కూడా పిల్లల్ని ప్రేమిస్తారు, లాలిస్తారు. మొగుళ్ళని వాటేసుకుంటారు. ఇక్కడా ఆకలి చావులు లేకున్నా, ఆకలి వుంది. పేదరికం వుంది. చిరిగిన వస్త్రాలు తక్కువైనా, చీకిపోయిన గవున్లున్నాయి. ఇక్కడా ఏడుపులున్నాయి, బాధలున్నాయి, సుఖాలున్నాయి. ఇక్కడా ప్రజలు సమస్యల కోసం పోరాడతారు. ఇక్కడా కోపం, అసహ్యం, వంచనా అన్నీ వున్నాయి మనకు లాగే.

    అమెరికా రాజకియాలు, అమెరికా ఆర్దిక విధానాలు, అమెరికా విదేశాంగ విధానాలు విమర్శకి అతీతం కావు. అమెరికా దేశం, ఆ దేశంలో ప్రజలు (తెలుపు, నలుపు, ఎర్ర, పచ్చ, బ్రవును,…….) మీకు నచ్చితీరాలని నేను చెప్పటం లేదు. ఐతే ఇక్కడ తెల్ల దెయ్యాల్ని చూడగలిగిన మీ జ్యాత్యాహంకారం బీజాలు మాత్రం అక్కడ మన పవిత్ర భారద్దేశంలో పడ్డవేనని మనవి చేస్తున్నాను.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో