Comments on: తెల్ల దెయ్యం నీడ

By: రవికిరణ్
అవును, నిజవే కదా!

పచ్చని పంట పొలాల్ని కబళించి

కురుపుల్లా విస్తరించిన సెజ్ల మధ్య

ఊపిరాడుతుంది.

కాదంటే పిట్టల్లా

కాల్చేసే చోట

ఊపిరాడుతుంది

నడిబజార్లో ఆడవాళ్ళ

చీరలూదదీసే చోట

ఊపిరాడుతుంది.

అక్కడే వాళ్ళని

గ్రామ పెద్దలు

మానభంగం చేస్తే

అక్కడ ఊపిరాడుతుంది.

సగం మంది,

మనుషుల్ని పశువుల కన్నా

హీనంగా చూసె చోట,

పశువుల్లాగే తెగ నరికే చోట

ఊపిరాడుతుంది.

అవును నిజవే కదా

ఊపిరికి విలువలేని చోట,

ఊపిరికి కొరతేవుంది.

తానా సభలకి ఒక సారి అమెరికా వచ్చి గడిపిన నాలుగు రోజులు, వున్న నలుగురు స్నేహితుల ఇళ్లు మీకమెరికా గురించి ఏవీ అవగాహననిచ్చుండవు. ఇక్కడా మన తెలుగు దేశంలో లాగే మనుషులే వుంటారు. ఇక్కడా సాయంత్రాలు, అమ్మలు, నాన్నలు ఆఫీసుల్నుండి, పంట పొలాల నుండి ఇంటికొస్తారు. ఇక్కడా మనుషుల్ని మనుషులు ఇష్టపడతారు, వాళ్ళకొసం త్యాగాలు చేస్తారు. తెలుగు అమ్మల్లాగే అమెరికా అమ్మలు కూడా పిల్లల్ని ప్రేమిస్తారు, లాలిస్తారు. మొగుళ్ళని వాటేసుకుంటారు. ఇక్కడా ఆకలి చావులు లేకున్నా, ఆకలి వుంది. పేదరికం వుంది. చిరిగిన వస్త్రాలు తక్కువైనా, చీకిపోయిన గవున్లున్నాయి. ఇక్కడా ఏడుపులున్నాయి, బాధలున్నాయి, సుఖాలున్నాయి. ఇక్కడా ప్రజలు సమస్యల కోసం పోరాడతారు. ఇక్కడా కోపం, అసహ్యం, వంచనా అన్నీ వున్నాయి మనకు లాగే.

అమెరికా రాజకియాలు, అమెరికా ఆర్దిక విధానాలు, అమెరికా విదేశాంగ విధానాలు విమర్శకి అతీతం కావు.  అమెరికా దేశం, ఆ దేశంలో ప్రజలు (తెలుపు, నలుపు, ఎర్ర, పచ్చ, బ్రవును,…….) మీకు నచ్చితీరాలని నేను చెప్పటం లేదు. ఐతే ఇక్కడ తెల్ల దెయ్యాల్ని చూడగలిగిన మీ జ్యాత్యాహంకారం బీజాలు మాత్రం అక్కడ మన పవిత్ర భారద్దేశంలో పడ్డవేనని మనవి చేస్తున్నాను.