Jun2009
విధ్వంసం ఆవలివైపు
-కె క్యూబ్ వర్మ
ఇప్పుడు నేను కవిత్వం
రాయలేకపోతున్నాను
నా అక్షరాల మాటున దాగిన
సన్నని దారాన్ని ఎవరో
పుటక్ పుటక్ మని తెంపుతున్న శబ్దం
నా చుట్టూ ఎవరో సమాధి రాళ్లను
చక చకా పేర్చుతున్న వైనం
తెరలు తెరలుగా నా కనులముందు
గుండెల పై టన్నుల కొద్దీ బరువైన ఇనుప
దిమ్మెలను పేర్చుతుంటే విరిగిపడుతున్న
ఎముకల శబ్దం. . . .
ఏవో సునామీ వలయాలు నన్ను తమ
బ్లాక్ హోల్ లోనికి లాక్కుపోతూ. .
కానీ చివరాఖరికి తూరుపునుండి ఒక
సన్నని గాలి తెమ్మర నన్ను తాకుతూ. .
vishvasi Jun 21, 2009 1
నిజంగనె ర్రాయలెకె పూతున్నమ్ .
ప్రాణహిత » జూన్ 2009 సూచిక Jul 6, 2009 2
[...] విధ్వంసం ఆవలివైపు : కె క్యూబ్ వర్మ [...]