Jul2009
ఐదేళ్ళ తెలుగు కథ
ప్రతి అయిదేళ్ళకీ కథ మారుతుందా? మారవచ్చు. ఇప్పుడు తెలుగు కథ మారుతున్న వేగాన్ని చూస్తూంటే, గత అయిదేళ్ళలో వచ్చిన వస్తు, శిల్ప పరమయిన మార్పుల్ని గమనిస్తే, అయిదేళ్ళ మార్పుని ఒక అంచనా వెయ్యవచ్చని అర్ధం అవుతుంది. ఈ మార్పు మొత్తం తెలుగు సమాజంలో వస్తున్న మార్పు. దీనికి ప్రాంత, లింగ, మత, కుల తేడాలు లేవు. అలాంటి మార్పుని ప్రతిఫలించే కొన్ని ఊత్తమ కథల్ని ఎంపిక చేసి, ఒక సంకలనంగా తీసుకు రావాలని మా సంకల్పం. అందులో భాగంగా మా మొదటి సంకలనం కోసం 2005 నించి 2009 వరకు వచ్చిన కథలని పరిశీలనకి తీసుకుంటాం.
“అయిదేళ్ళ కథ” శీర్షికన 2010 లో ఈ సంకలనం వెలువడుతుంది. ఈ సంకలనం యథతధంగా తరవాత ఇంగ్లిష్ లో కూడా ప్రచురించాలని ప్రస్తుత ఆలోచన.
ఈ సంకలనం కోసం మీరు ఈ 2005 నించి 2009 మధ్యలో చదివిన మంచి కథల్ని సూచించండి. . మీరు సూచించిన ప్రతి కథనీ మేము చదివి, మా సంకలనంలో ప్రచురణకి పరిశీలిస్తాం.
సంకలనాలకు సాధారణంగా వైయక్తిక లెదా సంస్థాగత ఉద్దేశాల పరిమితి వుండడం ఇటీవల మనం గమనిస్తున్నదే. అలాంటి పరిమితులేవీ లేకుండా ఏ రకంగా చూసినా ఇది ఉత్తమ కథ అనుకున్నదల్లా మా సంకలనంలో వుండాలని మా తపన. మీ సూచనలు లేకుండా ఇది సాధ్యం కాదు.
అన్ని ప్రాంతాలకూ, అన్ని మాండలికాలకూ, అన్ని ధోరణులకూ సంబంధించిన అచ్చ తెలుగు కథల సంకలనం మా సంకల్పం.
మీ సూచనలు పంపండి. అచ్చంగా ఒక ఉత్తమ సంకలనం మనం తీసుకు వద్దాం.
మీ సూచనలు అఫ్సర్ ( afsartelugu[at]gmail.com ) లేదా గుడిపాటి ( gudipati8[at]gmail.com ) కి పంపండి.
అభిప్రాయాలు లేవు »సాహిత్య ప్రకటనలు