దుమ్ముకమ్ముకుంటున్న వేళ…

నిన్నటి అనుభూతులను పాతర తీసి పాతిపెట్టు
మళ్లీ మొలకెత్తకుండా అరచేతులతో అదిమిపట్టు
మరుపు నిన్నావరించనీ
పాతజ్ఞాపకాలేవో గుర్తుకొచ్చి
నీ కాళ్లకు అడ్డంపడొచ్చు
ప్రేమ చొరబడని కవచమేదో
గుండెనిండా కప్పుకో
వలపు తెమ్మర తాకి నీవులిక్కిపడొచ్చు
అనవసర ద్వేషంతోనైనా సరే
నువ్వెప్పుడూ రగిలిపోతుండాలి
మనసెప్పుడన్నా  వెనక్కి తిరిగి గింజుకోవచ్చు
నీవు నడిచే దారి నీకు నచ్చాలంటే
చూపులెప్పుడు అంబరానికే అంటుకోనివ్వు
దుమ్ముకమ్ముకుంటున్నమర్మమేమిటో  నీమతినికెలకవచ్చు

నీ ఆలోచనలు ఎటు పరుగెడితే
నీఅస్థిత్వాన్ని అటే పరుగెత్తనివ్వు
వెనక్కితిరిగి చూడకు
నీ సహచరుడెప్పుడూ  నీ వెనకే వుండి నీకు అశాంతినిస్తాడు…

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “దుమ్ముకమ్ముకుంటున్న వేళ…”

  1. 1
    kcube varma Says:

    నీ ఆలోచనలు ఎటు పరిగిదితే
    నీ అస్తిత్వాన్ని అటె పరిగెత్తనివ్వు

    జుగాష్ విల్లీ గారు ఈ వాక్యాలు ముందున్నది ఒక యోధున్ని తయారుచేసేట్లుగా వుంది. కానీ ఇక్కడకు వచ్చేసరికి దారి తప్పించినట్లుగా అనిపించింది.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో