మంచీ-చెడూ

మూలం: వైరముత్తు, అనువాదం: ఆర్‌. శాంతసుందరి

నీతి వాక్యాలు వల్లించిన
తొలిభాష ఏది?
తమిళమా? చైనీసా??
లాటినా? గ్రీకా?
కాదు…అవేవికావు…
ప్రకృతి
తన నుదుటిబాధ.. కనుబొమల మీద
కళ్లలో…బుగ్గల్లో
ఛాతిమీద…బాహుమూలాలలో
రాసి ఉంచిన నీతినే
తన భాషలోకి అనువదించాడు మనిషి
పైకెగబాకుతూ మండుతోంది జ్వాల-
పైకిమొలకెత్తుతుంది విత్తనం-
పైపైకే ఎగసిపోతుంది మబ్బు-
పైకే పెరుగుతాడు మనిషి-
అంతా పైపైకే…
కాని కిందికి పడుతుంది
అది……..కందిలి కురియకపోతే
మరి పైకి పెరిగేది
ఈభూమిలో ఏది?
వాన అన్నది-
“కరుణ కలిగినవాడే
ప్రాణులన్నిటికే
నాయకుడిగా ఉంటాడు.”
తీరం మేలుకుని ఉందా?
నిద్రపోతుందా ?
తెలీదు.
పాడడం తెలిసినపక్షులు
తమ పాటలకి తామే
చప్పట్లుకొడుతాయా?తాళం వేస్తాయా?
తెలీదు.
మాతృభాషే రానిమనుషులకి
తమ పాట అర్థం అవుతుందా?అవదా?
తెలీదు.
కానీ
గులకరాళ్లని
నోట్లో వేసుకుని
నది పాడుతూనే ప్రవహిస్తుంది
నది కూడా ఒక గీతావాక్యం చెప్పింది
“కర్తవ్యాన్ని నిర్వహించు
ఫలితం కోసం ఎదురుచూడకు. ”
ఎక్కేవాళ్లందరినీ
వంగి రమ్మని చెబుతుంది
దిగేవాళ్లందరినీ
నిటారుగా నడిపిస్తుంది
తొండ అంది
“వినయంగా బతికితే
పైకి వెళ్తావు
విర్రవీగుతూ బతికితే
కిందికి దిగిపోతావు, ”

* * *

వేర్లని తెంపేస్తూ పారే
నదిమీద కూడా
గలగలా పూవులను రాల్చే
ఒడ్డునున్న కొమ్మలు..
తెంపినందుకు కోపం లేదట
తడిసినందుకు కృతజ్ఞతట
చెట్టు అంది-
” ఎవరేం చేసినా
మంచే చెయ్యి ”
చిరునామాలేకుండానే భూమ్మీదికి వస్తుంది
ఎక్కడ ఆల్చిప్ప మేలుకుని ఉంటుందో
అక్కడ పడి ముత్యంగామారుతుంది
వాన చినుకు అన్నది
” ముత్యం తాలుకు విత్తు
ఎప్పుడైనా పడొచ్చు
మేలుకుని ఉండు ఓ మనిషి మేలుకుని ఉండు ..”

* * *

కింద బురద
పైన నాచు
తను చుట్టూ కప్పల సంగీతం
అయినా
నీళ్లలో జ్వాలలు పూసినట్లున్న
తామరపూలకే
ఎంత సౌందర్య గంభీరం
తామరపువ్వు అన్నది-
“పరిసరాల వల్ల ఘనత పొందడం సులభం
పరిసరాలకు ఘనత చేకూర్చడమే గొప్ప”
అస్తమయం అన్నారు-
గుడ్లగూబలకి సంతోషమయింది
నక్షత్రాలు ఆనందంతో నాట్యంచేశాయి
తను మరణించలేదన్న సంగతి
చంద్రుడికి వెలుగునిచ్చి
నిరూపించాడు సూర్యుడు
సూర్యుడు అన్నాడు-
“మరణించాక కూడా జీవించి ఉండాలంటే
నీ పాదముద్రలని వదలివెళ్లు”

* * *

అగ్ని పర్వతం పేలింది
యాభై కిలోమీటర్లు పారింది
అగ్నిప్రవాహం
అక్కడి వాళ్లెవరూ
ఇల్లు వదిలిపోలేదు
అగ్నిప్రవాహం ఆరి బూడిదయ్యాక
విత్తులు నాటగా
ఆరింతలుగా అద్భుతమైన పంటలు
అగ్ని పర్వతం అన్నది-
“ఏ ఒక్క చెడులోనైనా
ఇంకొంత మంచి ఉంటుంది.”

6 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

6 అభిప్రాయాలు

  1. kolord97@gmail.com Jul 7, 2009 1

    వైరముథు గురించి వినడ్ మె ఎంథొ గొప్పగా ఉంది కవిథ.

  2. R.Santha Sundari Jul 16, 2009 2

    నా అనువాదం చదివి స్పందించిన(పెరు తెలియదు)పాఠకునికి/పాఠకురాలికి ధన్యవాదాలు.

  3. pasupuleti geetha Jul 17, 2009 3

    శాంతసుందరి గారికి,

    నమస్తే, వైరముత్తు కవితల్లోని తాత్విక గాఢతకి మంచి-చెడు అద్దం పట్టింది. ఇంత మంచి కవితని అందించినందుకు ధన్యవాదాలు.
    -పసుపులేటి గీత

  4. Nagalakshmi Varanasi Jul 17, 2009 4

    ఎంత అందమైన కవిత!
    గులకరాళ్లని నొట్లో వేసుకుని పాడుతూ ప్రవహించే నదీ,
    గలగలా పూలు రాల్చే కొమ్మలూ,
    నీళ్లలో జ్వాలలు పూసినట్టున్న తామరల గంభీర సౌందర్యం,సౌజన్యం..
    మనిషికి మార్గం నిర్దేశించే ప్రకృతి ని ఎంత అందంగా కవితలో చూపారు! ఇంత చక్కని కవితని సుకుమారమైన తెలుగులో హృదయంగమంగా అందించిన శాంతసుందరి గారికి ధన్యవాదాలు!

  5. R.Santha Sundari Jul 17, 2009 5

    నా అనువాదానికి స్పందించిన నా స్నెహితురాళ్లందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు.

  6. R.Santha Sundari Jul 19, 2009 6

    పాఠకులు గమనించ ప్రార్థన:
    48 వ పంక్తి లో మొదటి అక్షరం, ‘తొ’ కాదు, ‘కొ’…తొండ కి బదులు,కొండ అని చదువుకొగలరు.
    ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్హిన నాగలక్ష్మి కి ధన్యవాదాలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో