Jul2009
ఒక కొడుకు
ఆ రాత్రివేళ ఆరుబయట
మనం కలిసివిన్న రేడియో నాటకం
మహాశ్వేతాదేవి ‘ ఒక తల్లి’
అచ్చంగా ఆఖరి కొడుకు
ప్రతీ ఛటర్జీ పోలికలతో
నిత్యం పొంచివున్న ఆపదలో
దేశదిమ్మరిలా తిరుగాడిన నేను
మాటిమాటికీ నీ తలపుకొచ్చిన
ఓ యావజ్జీవిత గర్భస్థ వ్యథని
అన్యజగతిలోని
ఏ అంతిమశాంతి
నిన్ను రమ్మని పిలిచేనని
హఠాత్తుగా మాయమయేవు
కన్నీటిబొట్టులాగ మట్టిల ఇంకిపోయేవు
ఏదో ఒకరోజున
అమ్మ మరణం అనివార్యమని
ఎరుకలేని తప్త జాగరణలో
ఎన్నటికీ తల్లడిల్లే పిల్లవాడిన్నేను
ప్రాణప్రదాయినీ
జన్మాంతర పెనుతుపాను
అల్లకల్లోలంలో కనుగొనలేకున్నాను నిన్ను
July 16th, 2009 at 6:30 am
Srinu gurunchi kada!naaku srinu tho o arnellu sahavasam.swalpa kalaam lone enthaga allukupoyadante,maa iddari madhya kavisamayam gadichipoyedi.athadi jyapakam lo bhagam ga mee kavitha nu dachukontanu.meeru thanakichhina mee kavita samputini naake ichhi vellipoyadu.lampakova srinu snehaniki prathiroopam.daani kosame athanni ee prapanchaniki parichiyam cheyyali.nenu sitham…
venkatrao.n