Aug2009
August 2009 సంచిక
Aug2009
తరగని దూరం
“ఇటు వైపెందుకూ??”
అచ్చం జేబుదొంగని పట్టుకున్నట్టే అడిగింది ఆవిడ.
నా మొహం మళ్ళీ నల్లబడింది. స్కూటరు ఎక్కిన దగ్గన్రుంచీ ప్రతి మలుపు దగ్గరా ఇటెందుకు? అటెందుకు.. అని ఆవిడ సతాయిస్తూనే వుంది. మొత్తం చదవండి »
Aug2009
అచ్చమైన మనిషిలా మిగిలిపోతాం
ఉద్యోగ రీత్యా బదిలీ అయి గత ఏడాది డిసెంబరు 8 న ఉదయం హైదరాబాదుకు వచ్చాను. నేరుగా మిత్రుడు గోపిని కరుణాకర్ ఇంటికి వచ్చాను. తర్వాత జూబ్లీహిల్స్ లోని మా ఆఫీసు కార్యాలయానికి వెళ్ళాను. నేను హైదరాబాదులో రైలు దిగినప్పటినుంచీ ఆఫీసుకు చేరే వరకు కనీసం ప్రతి అరగంటకోసారైనా కోకిల పాటలు వినిపించాయి. నా సెల్ రింగ్ టోన్ కూడా అదే!
Aug2009
తెలంగాణ చరిత్రలో ఒక మొహొంజొదారో
ఈ పుస్తకాన్ని చదివి గొప్ప ఎక్సైట్ మెంట్ ఫీలయ్యానని ఈ పుస్తకావిష్కరణ సభలో వరవరరావు సముచితంగా చెప్పిండ్రు. నేను కూడా దీన్ని చదివి అంతే ఎక్సైట్ అయినాను. పై శీర్షిక పెట్టటానికి ఆ ఎక్సైట్ మెంటే కారణం. మొత్తం చదవండి »
Aug2009
ప్రకృతి దార్శనికుడు మసనోబు ఫుకువోకా
గతసంవత్సరం ఆగష్టు 16న మసవోబు ఫుకువోకా మరణించాడు.బాగా మగ్గిన పండు తనంత తానే చెట్టు కొమ్మ నుండి రాలి పడినట్టు ఫుకువోకా తొంభై ఐదు సంవత్సరాల నిండు వయసులో ప్రకృతి ఒడిలోకి వెళ్ళి పోయాడు.
Aug2009
దళిత జీవితాన్ని ఉదాత్తంగా చిత్రించిన గురజాడ
గురజాడ గొప్పకవితలన్నీ 1910-12ల మధ్య వచ్చాయి. అవి ఆధునిక సమాజానికి కావలసిన సంస్కరణ భావజాలాన్నందించాయి. “ముత్యాల సరములు” భూస్వామ్య వ్యవస్థ నేర్పిన మూఢనమ్మకాలను, మూఢాచారాలను ఖండించింది. “కన్యక” స్త్రీని పురుషుడు బలవంతంగా లోబరుచుకునే దుర్మార్గాన్ని నిరసించింది. “పూర్ణమ్మ” బాల్యవివాహంలోని అసంబద్ధతను విమర్శించింది. మొత్తం చదవండి »
Aug2009
40 ఏళ్ల ఉద్యమ సాహిత్యం – కళింగాంధ్ర వస్తు – శిల్పాలపై దాని ప్రభావం
ఉత్తరాంధ్ర భౌగోళికంగా నేటి ఒరిస్సా రాష్ట్రంలో కొంత భాగం అనగా తెలుగు అధికంగా మాట్లాడే ప్రాంతాలను కలుపుకుని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరాలతోపాటు కళింగాంధ్రగా పిలువబడుతోంది. ఎందుచేతనంటే ఈ మూడు ప్రాంతాలకు సరిహద్దులుగా వున్న ఒరిస్సా ప్రాంతాల వారి సంస్కృతీ, సాంప్రదాయాలతో అనుబంధం విడదీయరానిదిగా వుంది. మొత్తం చదవండి »
Aug2009
తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవిత చిత్రణ పై కేంద్రసాహిత్య అకాడమి సదస్సు
తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవితం ఎలా చిత్రించడమైనది, ఇంకా ఏయే అంశాలను కథాసాహిత్యం పట్టుకోవలసి వుంది, ఇంతవరకు చిత్రించిన సాహిత్యపు బలాలు, పరిమితులు ఏమిటి అనే అంశాలపై చర్చించేందుకు గాను కేంద్రసాహిత్య అకాడమి తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ సహకారంతో రెండు రోజుల సదస్సును జులై 13, 14 తేదీలలో నిర్వహించింది. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుండి వివిధ కథా రచయితలు, విమర్శకులు పాల్గొన్నారు. మొత్తం చదవండి »
Aug2009
విప్లవకవి శ్రీశ్రీ శతజయంతి సభ
విరసం సిటీ యూనిట్ జూలై 3న శ్రీ శ్రీ శతజయంతి సభ నిర్వహించింది. ఈ సభకు అధ్యక్షురాలిగా డా.గీతాంజలి వక్తలుగా వేణు సంకోజీ, వరవరరావు, ఎన్.వేణు గోపాల్ వచ్చి ప్రసంగించారు. మొత్తం చదవండి »
Aug2009
తెలంగాణా రచయితల వేదిక సమావేశం
ఇటీవల తెలంగాణా రచయితల వేదిక సభ హైదరాబాద్ లోని సుందరయ్య విఙ్ఞాన భవన్లో జరిగింది. ఈ సమావేశానికి వచ్చి ప్రారంభోపన్యాసము చేసిన ప్రముఖ రచయిత అల్లం రాజయ్య మాట్లాడుతూ “నే వీరుల త్యాగాల్ని అక్షర బద్దం చేసి కథల్ని రాసాను, కాని ఇప్పటి సమాజం అనుకున్నదానికంటే భ్రష్టుపట్టిపోయింది. రానురాను వాతావరణం హింసాపూరితమైతున్నది. మొత్తం చదవండి »
Aug2009
లోరీన్! నువ్వే వొక కవిత!

Lorine Niedecker
Lorine Niedecker
ఈ శనివారం మాడిసన్-విస్కాన్సిన్ కి 45 నిమిషాల దూరంలో వున్న ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ ఇల్లూ, సమాధి చూడడానికి వెళ్ళాం నేనూ, నా కవిమిత్రుడు ఆస్టిన్ స్మిత్. మాడిసన్ వచ్చిన కొత్తలో వొక పాత పుస్తకాల షాపులో కవిత్వం పుస్తకాలు చూస్తున్నప్పుడు నా పక్కనే వున్న వొక అమెరికన్ కవయిత్రీ, స్నేహితురాలు “ఈ కవిత్వం చదువు” అంటూ అప్పటికప్పుడు లోరీన్ పుస్తకాన్ని కొని ఇచ్చింది. మొత్తం చదవండి »
Aug2009
మతిమరుపు
ఏదైనా సమయానికి గుర్తుకు రాకపోతే చిరాకుగా అనిపిస్తుంది. అదేగనక ఏ పరీక్ష రాస్తున్నప్పుడో, ప్రేక్షకుల ఎదుట నాటకంలో నటిస్తున్నప్పుడో, ప్రసంగిస్తున్నప్పుడో జరిగితే మరీ కంగారుగా ఉంటుంది. ఉన్న కాస్త మతీకూడా పోయినట్టనిపించడంతో మరిన్ని పొరబాట్లు చేస్తాం. మొత్తం చదవండి »
సంచికలు
పేజీలు
తాజా అభిప్రాయాలు
- బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్షిప్ పొటెంకిన్"
రాజశేఖరరాజు, హెచ్చార్కె - ఓడి గెలిచిన యోధానుయోధుడు: స్పార్టకస్
రాజశేఖరరాజు, హెచ్చార్కె, రాజశేఖరరాజు, కెక్యూబ్ వర్మ [...] - రెండు మనః ప్రపంచాలు : కేతు రెండు నవలలు
హెచ్చార్కె, a - పిండాల బావి
ravikiran, satyadarshana, rutwika, vishvasi [...] - మనం మళ్లీ వెనక్కి వెళ్ళిపోదాం...!
Nutakki raghavendra Rao, K.Rohiniprasad, nutakki raghavendra rao, Raja R Kappera - రాయలసీమ జానపద సాహిత్య సౌరభం
పవనకుమార్, తవ్వా ఓబుల్ రెడ్డి, clnraju
- బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్షిప్ పొటెంకిన్"
ప్రాణహిత సందర్శకులు