Aug2009
సందిగ్ధ సమయాన
అంగీకరించనూలేక
నిరాకరించనూలేక
ఎంతయాతన పడ్డావు
ఇష్టాలకు నిష్టాలకు మధ్య
ఎంత అతలాకుతలమయ్యావు
సందిగ్ధాల మధ్య
నువ్వు ఒకసంక్షుభిత మనస్వినివై
“నువ్వు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నావు” అంటూ
గుంజాటనతో ఎంత పెనుగులాడవు
పెనవేసుకున్న వేళ్లనునొక్కిపట్టి
భుజంమీద తలవాల్చి నువ్వు చూసి బేలచూపుల స్పర్శ
చీకట్లో కూడా నన్నుతాకి నన్నెంత కలవరపెట్టిందో..
నిషేధిత అనుబంధం ఒకవైపు
అనిష్టబంధం మరోకవైపు
తిరుగలి రాళ్లమధ్య గింజలా ఎంత నలిగిపోయావు
నన్ను కాదనడానికి
నువ్వెంత కష్టపడ్డావు
October 11th, 2009 at 6:12 pm
[...] సందిగ్ధ సమయాన – జుగాష్ విలీ [...]
October 12th, 2009 at 7:17 am
[...] సందిగ్ధ సమయాన – జుగాష్ విలీ [...]