తెలంగాణా రచయితల వేదిక సమావేశం

ఇటీవల తెలంగాణా రచయితల వేదిక సభ హైదరాబాద్ లోని సుందరయ్య విఙ్ఞాన భవన్లో జరిగింది. ఈ సమావేశానికి వచ్చి ప్రారంభోపన్యాసము చేసిన ప్రముఖ రచయిత అల్లం రాజయ్య మాట్లాడుతూ “నే వీరుల త్యాగాల్ని అక్షర బద్దం చేసి కథల్ని రాసాను, కాని ఇప్పటి సమాజం అనుకున్నదానికంటే భ్రష్టుపట్టిపోయింది. రానురాను వాతావరణం హింసాపూరితమైతున్నది. ఉత్పత్తి మూలాల గురుంచి మాట్లాడటంలేదు. విధ్వంసాలకు కారకులైన వాటిని గురించి అన్వేషించడంలేదు. కాని ఎటువంటి ప్రలోభాలకు లోంగని తెలంగాణా కవులు, కళాకారులు ఇవాళ జరుగుతున్న పరిణామాలపట్ల ప్రతిస్పందిస్తున్నారు”, అన్నారు.

ప్రముఖ రచయిత ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ ప్రసంగిస్తూ తెరవే కు తను సన్నిహిత స్నేహితుడిని, తను గమనించినంతవరకు రాజకీయ ఉద్యమకారులతోని తెలంగాణా కవుల విమర్శనాత్మకమైన సంబంధం పెట్టుకుంటే పర్వాలేదు. తెలంగాణా వైరుద్యాలతో కూడుకున్న అస్థిత్వ ఉద్యమం. ఇటువంటి ఉద్యమానికి కార్యకర్తలతోపాటు పౌరసమాజం అండదండలు కావాలి.మధ్యతరగతి ప్రజలని ఇందులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. వర్తమానంలో ఉమ్మడి అవగాహనలు రచయితలు కలిగించాలి. స్వాభిమానాన్ని, మమకారాన్ని కలిగించే విధంగా తెలంగాణా సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు చేయాలి అని అన్నారు.

ఇంతకాలం నుంచి మళ్ళి మళ్ళీ తెలంగాణా ఉద్యమం ఎందుకు కొనసాగుతుందో పరిశోధన జరగాల్సిన ఉన్నదని ప్రముఖ పాత్రికేయులు మల్లెపల్లి లక్షయ్య అభిప్రాయపడ్డారు. తెలంగాణాది తెరిపిలేని పోరాటం అని, 1951-1969  చీకటి పుటల్ని శోధించాల్సి ఉన్నదన్నారు. తెలంగాణాలో జరిగినంత విధ్వంసం మరే ప్రాంతంలో జరగలేదు. ఇది అన్ని ఉద్యమాల్ని తనదిగా చేసుకుని కొనసాగుతున్న పోరాటం. రాబోయేతరాలకు వెలుగు నిచ్చే ప్రాంతం అని ముగించారు. సమావేశంలో తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాధం, కార్యదర్శి జూలూరి గౌరీ శంకర్, వార్త సంపాదకులు టంకసాల అశోక్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యలు తమ తమ ప్రసంగాలు చేసారు.

2 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

2 Responses to “తెలంగాణా రచయితల వేదిక సమావేశం”

  1. 1
    Prabhakar Mandaara Says:

    ఈ సభ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగింది. నిర్వాహకులే పగటి బువ్వ కూడా పెట్టారు;. చాలా అంశాల మీద ఎంతో వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. టీఆరెస్ పోకడలమీద కొంత లొల్లి కూడా జరిగింది. అల్లం నారాయణ, డాక్టర్ తిరుమలి, లోకేష్ తదితరులు ఎంతో అర్థవంతమైన ప్రసంగాలు చేశారు.

    అట్లాంటి సభ గురించి” ప్రాణహిత “లో ఇంత జీవం లేని సంక్షిప్త నివేదిక రావడం చాలా అసంతృప్తి ని కలిగించింది. .
    ఇట్లాంటి మొక్కుబడి నివేదికలు ప్రచురించడం కంటే ప్రచురించక పోవడమే ఉత్తమం,

  2. 2
    ప్రాణహిత » ఆగస్టు సంచికలో …… Says:

    [...] తెలంగాణా రచయితల వేదిక సమావేశం : వేముగంటి మురళీకృష్ణ [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో