September 2009 సంచిక

సెప్టెంబరు 2009 సూచిక

కవిత్వం

అభిప్రాయాలు లేవు »సూచిక

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతులు – ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులకు రిజిష్ట్రేషన్

DTLCcolorlogo(TE).jpg

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ ల శతజయంతుల సందర్భంగా DTLC తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుల గురించి ఇంతకు ముందు ప్రకటనలో తెలియజేశాం. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య ప్రకటనలు

అమెరికన్ కవిత్వంలో ఒక దక్షిణం గాలి… కాజిం అలి

“తెలుగు” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి.

వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క అనగానె నాకు మా ఖమ్మంలో పెద్ద కొండ మీద కొలువైన నరసిం హ స్వామి , ఆ గుడికి కొబ్బరి ముక్కల ప్రసాదం కోసం వెళ్తూండే నా బాల్యం గుర్తొస్తాయి, కాఫీ అంటే నాకు అమెరికా. ఇక్కడికి రాక ముందు నాకు కాఫీ అలవాటు లేదు. ఈ భిన్నమయిన రుచుల కలయిక నాలుక మీద ఆడుతూండగా , కాజిం అలి కవిత్వం చదివాను.

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »అనువాదాలు, దర్వాజ

మతోన్మాదాన్ని నిరసించే మానవతావాదుల ఆక్రందన “లజ్జ”

“మనందరికీ ఒకరినొకరు ద్వేషించుకోవడమే తెలుసు, కొందరికి మాత్రమే ప్రేమించడం తెలుసు,” అనే జొనాదన్ స్విఫ్ట్ మాటలను మననం చేసుకుంటూ, చూట్టూ చెలరేగుతున్న మత మౌఢ్యాలను, మతకల్లోలాలను, వివక్షతలను ఎదిరించాలని తపనపడే కొందరు మానవతావాదుల ఆక్రందన “లజ్జ”. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

బ్రైడల్ వైల్ జ్ఞాపకంలోకి-

దూరం నించి నిన్ను చూసి కుంచెదిద్దిన చిత్రపటాని వనుకున్నాను
దగ్గరికి రాగానే
ఆకాశం నక్షత్రాలన్నీ ఒక్కసారి రాల్చినట్టు
నీ మేలి ముసుగు
తుంపరై దూకే జలపాతమైంది మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »కవితలు

భావ వ్యాకరణం – అమరీ బరాక

ప్రతీ కవిత్వానికీ భాష, భావం  బాహ్య రూపాలయితే, అంతర్లీనంగా కనిపించే భావ స్వరూపాలు అసలు పదచిత్రాలు. చూసీ చూడగానే కొన్ని కవితలు వేంటనే స్పృశిస్తాయి. మరికొన్ని మనతో కొంతకాలముంటాయి. ఇంకొన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. మొదటి రెండింటిలోనూ కాలక్రమేణా అక్షరాలు అడుగున పడి, భావమొకటే గుర్తుంటుంది. మూడోదాంట్లో భాషా, భావమూ ఒకదానికొకటి అతుక్కుపోయి హృదయాన్ని హత్తుకుంటాయి. పదాలూ, పదచిత్రాలూ పదికాలాలపాటూ గుర్తుండాలంటే ఆ కవిత్వంలో భావ సాంద్రతెక్కువగా వుండాలి. భాష లో గాఢత ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వం కలకాలమూ నిలుస్తుంది. చదివిన ప్రతీ సారీ ఒక్కో కొత్త రూపాన్ని చిత్రీకరిస్తాయి. మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

తెలుగు కథలో ప్రతిఫలించే సామాజిక, సాంస్కృతిక పరివర్తనలు — తెలంగాణా స్త్రీల కధలు

అన్ని కులాలకు, మతాలకు నెలవైన మనదేశంలో సమన్వయం సాధించడానికి అనునిత్యం సంఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. నాటి స్వతంత్ర్య ఉద్యమ దశనుండి నేటి సెజ్ ఉద్యమాల వరకు గమనించినట్లయితే సామాన్య ప్రజల జీవన సంఘర్షణలకి రచయితలు పెద్ద పీట వేసారు. ఎక్కడయితే సంఘర్షణలు జరిగాయో అక్కడ (ఆ సమాజాల నుండి) ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఎక్కడయితే ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయో ఆయా సమాజాల నుంచి రచయితలు పుట్టుకొచ్చి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

దేవిప్రియ కవితలు – మూడు

అమూర్తగానం

అల్లకల్లోలంగా వున్న
హృదయం కంటే
బరువుగా వుంటుంది నీ కన్నీటి చుక్క
సౌగంధికా పరిమళాలను మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

సాహిత్య సిద్ధాంతవేత్తగా ప్రేమ్ చంద్

“సాహిత్యం ఔన్నత్యం పొందితేనే దేశం ఔన్నత్యం పొందుతుంది” — ప్రేమ్ చంద్

భారతీయ ప్రగతిశీల రచయితలలో మున్షీ ప్రేమ్ చంద్, శరత్ చంద్ర ముఖర్జీ, కిషన్ చందర్ వంటివి ఐతిహాసిక పేర్లు. ఈ ముగ్గురు బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషలలో రచనలు చేసి మొత్తం భారతీయులకు ఆత్మీయ రచయితలయ్యారు.సమకాలిక జీవిత వాస్తవికతను విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించి కళాకృతి నివ్వడం, రూపాన్ని పరిరక్షిస్తూనే వస్తువుకు ప్రాధాన్యమివ్వడం, సామాజిక నిబద్ధతతో ప్రజాపక్షం వహించడం వంటి ఆరోగ్యకర సాహిత్య పద్ధతులను తర్వాత తరాల రచయితలకు సిద్ధం చేసిన రచయితలు వీరు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

పురాకృతం

శ్రీకాంత్

తేలికగా ఉండడమంటే ఏమిటి?

బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు,దేహంలోకి చొచ్చుకుపోయే గాలే కావొచ్చు.ఒక అద్భుతం.నీరులానూ.తుంపరలానూ వుండటం. అది ప్రేమ కూడా.తేలికగా వుండటం అదే కావొచ్చును.

ప్రేమించడం నిర్మలంగా నవ్వడం మృదువుగా మాట్లాడటం నాకు తెలీదు.ప్రతిక్షణం ముక్కలుగా రాలిపడటం యితరులను గాయపరచటం నాకు తెలిసిన జీవితం. అది యీ పద్యం కూడా.

మరెప్పుడో మొదలయ్యింది సంఘర్షణతోనే.యిక్కడే అంతమవుతుంది సంఘర్షణతోనే.కానీ, పాదాల చుట్టూ చుట్టుకొనే నీడా దేహంపై కదులాడే ఎండా? యివి కూడా వాస్తవాలు.

మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

రాయలసీమ వ్యాస రచయిత్రులు

-  పి.వరలక్ష్మి

కథ, నవల, నాటకం, వచన కవిత్వం లాగా వ్యాసం కూడా ఆధునిక ప్రక్రియ. వ్యాసం అనగానే ఆధునిక ఆలోచనలు, ఆధునిక భాష (వ్యావహారిక భాష) అని వెంటనే స్ఫురిస్తుంది. రాయలసీమలో మిగతా ప్రాంతాల కన్నా ఆధునికత ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగింది. కారణం రాయలసీమ సామాజిక రాజకీయ స్థితిగతుల్లో వెతుక్కొవచ్చు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

రెండు నాలుకల రాచ వ్యాధి

ఎప్పుడూ తల లేని వికృత జంతువొకటి
జనం మధ్య తిరుగుతూ వుంటుంది
ఐదేండ్లకోసారి తల మాత్రం మార్చుకుంటుంది
ప్రజలు ఇంకెన్నో ముఖాలతో మోసగింపబడుతూనే వుంటారు.
ఐతే ఒంటికి కొవ్వెక్కితే చికిత్స చేయవచ్చు
నోరు కొవ్వితే ఏం చేస్తాం ? మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

ప్రవక్త లేని ప్రపంచం

ఉర్దూ మూలం : మజర్ మెహదీ

ఈ ప్రపంచం
ఇతర ప్రపంచాల కన్నా భిన్నంగా ఎప్పుడుంది?
అవే జలపాతాలు
అవే ఆకుపచ్చని లోయలు మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

శ్రీ శ్రీ అంటే ఒక సంకల్పం

- శివలక్ష్మి

శ్రీ శ్రీ
రెండు అక్షరాల  ఉద్వేగం
పెల్లుబికే జీవన కాంక్ష
ఎందుకు ఇష్టం
శ్రీ శ్రీ అంటే- మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

తీపి శిఖ

అప్పుడెప్పుడో
దుఃఖం గుండెని నిండుగా కప్పుకున్నపుడు
ఙ్ఞాపకాలు నిలువునా బ్రతుకుని
ఒక్కోముక్కగా నరుక్కుపోయాయి మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

వెన్నెల శిల్పం

- బాణాల శ్రీనివాస రావు

అందరూ నిదురించేవేళ
రాత్రిని జోకొడుతూ……
ఎన్నడూ వినని పదాలకు
ప్రాణంపోస్తూ……
నిఘంటు అర్థాల్నిమార్చే
నవ భాషావేత్తా…. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

పిండాల బావి

అమ్మా!
నేను జీవ కణాన్నై
నీ ఉదర గృహంలో అడుగు పెట్టినప్పుడు
నువ్వెంత సంబరపడ్డావో కదా?
ఎంత మంచి దానివమ్మ! మొత్తం చదవండి »

31 అభిప్రాయాలు »కవితలు

Next »