జయ హో

‘జయా! రిమోట్ ఎక్కడా కన్పించటం లేదు, ఎక్కడ పెట్టిచచ్చారు, ఒక్కరూ పలకరేం,’ – మామయ్య

‘ఏయ్ నీరూ, ఎక్కడున్నావే తాతయ్య పిలుస్తుంటే, విన్పడ్డం లేదా?’ అదే రాత్రి 1 గంటవరకు టీ.వీ చూసేది’- అత్తయ్య.

చెవిలో సెల్ ఫోన్ , నోట్లో బ్రష్ తో “వస్తున్నా నానమ్మ ఎందుకట్లా అరుస్తావ్, టీపాయ్ కింద చూడు, లేదా, సోఫా కింద చూడు” – నా సుపుత్రిక నీరజ.

‘జయా! నా చార్జర్ కన్పించటం లేదు వెతికి కొంచెం ఛార్జ్ పెట్టవా! బాత్రూమ్ లోకి దూర్తూ మా శ్రీవారు.

ఇదిగో వస్తున్నానండీ చట్నీ గిన్నెలోకి వంపి, మిక్సీ చిన్న జార్ కడిగి సర్దేసి చేతులు తుడుచుకుంటూ వంటింట్లో నుండి బయటకు వచ్చాను.

“అమ్మా, నా స్నానం ఆయిపొయిందోచ్, టవలెక్కడ? టింకూ గాడిద.

అమ్మా, నా బ్రష్ ఎక్కడ? ఎవరో నా బ్రష్ వాడేశారు.పెద్ద గాడిద సాకేత్ కేక పెట్టాడు.

నీరూ, నీ సెల్ మ్రోగుతుంది.-నేను.

“ఎవర్రా నా పెన్ తీసింది? కనపడ్డం లేదు.అది నా ఫ్రెండు బర్త్ డే గిప్ట్” గట్టిగా కేకలేస్తుంది.

“అమ్మా! సాక్స్”, చిన్నోడు టింకు! ఇదిగో జయా, కాఫీ ఇంత మా మొఖాన పడేస్తావా”

“జయా, జయా !” అత్తగారు పిలుస్తొంది….

“ఇదిగో వస్తున్నానత్తయ్యా !”కాఫీకప్పులతో హాల్లోకి వెళ్ళాను.

సీరీయల్స్ చూస్తున్నారు. టింకూ ఒక కాలికి సాక్స్ వేసుకొని నోరు తెరుచుకొని అలాగే చూస్తున్నాడు.

“మామయ్యా కాఫీ ! మామయ్యా కాఫీ !” రెండు సార్లు మళ్ళీ పిల్చాను. టీపాయి మీద కప్పులు పెట్టేసి ఇటు తిరిగాను.

“రేయ్ !పాలు తాగి చూద్దువు గానీ రా “, పిలిచాను.టింకూ గాడు పలికితే గదా !ఎప్పట్లాగే బలవంతంగా తాపించాలి. మనసులోనే ‘ఈ డిష్ కనెక్షన్ తీసేస్తేగానీ, వీళ్ళ తిక్క కుదరదు.’తిట్టుకున్నాను.

హాల్లోమామయ్య ఛార్జర్ పెట్టారు….సెల్ ఫోన్ ఛార్జవుతోంది.., డైనింగ్ హల్లోనీరూ సెల్ ఛార్జవుతోంది., బెడ్ రూంలో శ్రీవారి లాప్ టాప్ ఛార్జవుతోంది., పిల్లల బెడ్ రూంలోకొస్తే, సాకేత్ సెల్ ఛార్జ్ పెట్టాడు., వంటింట్లో మిక్సీ వైర్ పీకేసి శ్రీవారి సెల్ ఛార్జ్ పెట్టాను., బెడ్ రూంలోకి వచ్చాను.” ఏవండీ కాఫీ! ఏవండీ కాఫీ! కాఫీ అక్కడ పెట్టి చాలా సేపయింది., చల్లారి పోతుంది”.లాప్ టాప్ తో కుస్తీ పడుతున్నారు. మిస్టర్ చిదానంద్ సన్నాఫ్ గోవిందప్ప…ఎలక్ట్రికల్ ఇంజనీర్…వీళ్ళకంతా చెవుడొచ్చిందా ఏమి ? పిలిస్తే వెంటనే పలకరు కోపంతో పిల్లల గదిలోకెళ్ళాను.పెద్ద గాడిదా అప్పుడే కంప్యూటర్ కీ బోర్డ్ పై వ్రేళ్ళు టకటక లాడిస్తున్నాడు.ప్లస్ టూ గాడికెంత టెక్కు !రేయ్ టిఫిన్ చేసి మళ్ళీ కూర్చో, టైం లేదని అట్లే పరిగెత్తుతావు అన్నాను. వూ…వూ…అన్నాడేకానీ కదల్లేదు.

నెట్ కనెక్షన్ పీకితే గానీ ఈ పెద్దగాడిదలిద్దరూ దార్లోకిరారు. ఇంతలో లాండ్ ఫోన్ మ్రోగింది. ఎవరూ ఫొన్ తీయటం లేదు…. వీళ్ళంతా బిజీ…!.

మళ్ళీ హాల్లోకి పరిగెత్తాను.

ఈ ఫొన్ మీ రూములోకి మార్పించుకోండి అంటే వినరు. అత్తగారు సణుక్కుంటూంది.

‘హాలో’ ఎవరూ? రేయ్, భాస్కర్ నువ్వేనా? ఎన్నాళ్ళయిందిరా ఫోన్ చేసి! మమ్మల్నందరినీ మరచిపోయావనుకున్నారా? నా వెనకాలే టింకూ, “అమ్మా మావయ్యతో నేనూ మాట్లాడతాను”.ఇంక వార్త క్షణాల్లో.అమెరికా ఫోన్ మరి నాతమ్ముడు గాడిద అక్కడికి తగలబడి నాలుగేళ్ళయింది . అందరూ వాడితో మాట్లాడ్డానికి క్యూ కట్టారు.

నేను వంటింట్లోకి పరిగెత్తాను. లాండ్ ఫోన్ నేను తప్ప ఎవరూ తీయరు . అందరి నెట్ వర్క్ మారింది మరి.

టీ.వి , డి.వి.డీ ప్లేయర్, లాప్ టాప్, కంప్యూటర్ సెల్ ఫొన్స్ …… అంతా టెక్నాలజీ !.

నేను వంటింట్లో నుండి , హాల్లోకి , బెడ్ రూమ్ లోకి… అక్కడ నుండి గిర గిర ……… గిర గిర ….. అన్ని దిక్కులకీ … ఎన్ని కిలోమీటర్ల ప్రయాణమో! ఇల్లే ఓ గ్లోబ్ గా మారిపోతే… ?’ ఓహ్ ! ఆహ్! ‘ఆలయాన వెలిసిన ఆదేవుని రీతి…. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి…..! ఎంతటి మధుర భావన! “ఏవండీ, ఏవండీ” ! పిలిచాను లాప్ టాప్ ఛాటింగ్ లో ఉన్న ఆయన తల తిప్పి ఏమిటి అన్నట్టు చూశాడు. ‘మా ఊరికెళ్ళాలి, తమ్ముడూవాళ్ళు వస్తున్నారంట రెండు రోజుల్లో వచ్చేస్తాను.’ నేను.

‘ఎందుకోయ్! భాస్కర్ అండ్ కో నే ఇక్కడికి రమ్మను వాళ్ళే వారం రోజులుండి వెళ్తారు. నేను కాంటాక్ట్ చేస్తాలే’ అన్నారు శ్రీవారు. అభయం ఇచ్చినట్లు.

***

నేను మౌనంగా దోసెలు వేయటం మొదలు పెట్టాను.నీరూ వంటింట్లోకి వచ్చింది. అది నాబాధ పసిగట్టింది.

“అమ్మా!, ఏమైంది ? చెప్పు” అంది

“నాకేమైతే మీకెందుకు?వెళ్ళు! మీపనులు మీరు చేసుకోండి” అన్నాను సీరియస్ గా

“సెకండ్ కూడా నాకు మాట్లాడే టైం లేదు. నీకెందుకు చెప్పాలి” ? టైంవేస్ట్ మీకు. అన్నాను ఓపికగా.

టింకూగాడు ఎప్పుడు వచ్చాడో నావెనకాలే.

“‘టైం ఈజ్ ప్రీషీయస్’ అంది మమ్మీ మా సైన్స్ టీచర్”.

“ఓహో! ఎందుకు మమ్మీ అలా బాధ పడ్తావు?, నీవూ ఎంజాయ్ చేసేది నేర్చుకో” అంది నీరూ.నేను మాట్లాడంలేదని, తిరిగి మళ్ళీ అదే అంది.

“మామయ్య నీకు ‘ఐపాడ్’ తెస్తానన్నాడు మమ్మీ.8G.B !. వేల పాటలు వినవచ్చు., నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు.”

“రేయ్! తెలుగు ఛానలు మార్చురా, ఈరోజు మాతృభాషా దినోత్సవం.’అంటున్నారు మామయ్య గారు

‘లేదు తాతయ్యా! రెండు రోజులు క్రిందటే అయిపోయింది’ . అంది నీరూ.

‘ఒన్ మినిట్’, నానమ్మ! అంటూ సాకేత్ రిమోట్ తిప్పాడు.

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఎనిమిది ఆస్కార్ అవార్డ్ లు గెలుచుకొంది. మమ్మీ భలే !భలే ! పెద్దోడు ఆనందంతో గెంతులేస్తున్నాడు.

‘డాడీ!, రండి ఎ.ఆర్ రహమాన్ రెండు అవార్డ్ లు గెలుచుకొన్నారు. మమ్మీ!మమ్మీ! పాట లైవ్ వస్తోంది.

జయహో, ..రా త్వరగా రా! నీరూ కేకలేస్తుంది.

మా ఊర్లోని పచ్చిక మైదానాల్లోకి పరిగెత్తాలని, చల్లని గాలిలో నాదేహాన్ని సేద తీర్చుకోనివ్వాలనో, నన్ను నేను రీ ఛార్జ్ చేసుకోవాలనో ఆశతో…బయటకు పరిగెత్తి పోవాలనుకున్నాను.

కాళ్ళను వైర్లు చుట్టుకుంటున్నాయి., చెవుల్లో సెల్ ఫోన్లు మ్రోగుతున్నాయి., కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి

జయ ! హో ! జయ !హో !

ఆ !హా ! ఇ !హీ!

***

అభిప్రాయాలు లేవు »కథలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో