కాలరేఖ

- కృష్ణుడు

గతంలోని పరిమళం
నేడు గుభాళించదు
నిన్నటి సౌందర్యం
నేడు మత్తెక్కనివ్వదు
కాలం ఏదో ఒక శకలంపై
ప్రయాణించదు
విశాల జీవితారణ్యంలో
వెన్నెల నిత్యం ప్రసరించదు
బాల్యపు మోకాళ్ళపై గాయాల మచ్చలు
కోల్పోయిన మధురస్మృతి చిహ్నాలు
పెదవిపై విరిసిన ప్రతి మందహాసం
నిత్యం మందపవనమై సేద తీర్చదు
పరిమళానికీ సౌందర్యానికీ
వెన్నెలకూ బాల్యానికీ
కాలంతో చెల్లిపోయేదేమీలేదు
కాలం గుండెల్లో రెపరెపలాడే ఎర్రబావుటా కాదు
కాలం వెలసి పోయిన నినాదమో
నిన్న పంచిన కరపత్రమో కాదు
కాలం కనపడని ప్రాణాలజాబితా కాదు
ఎన్నాళ్ళని పదిల పరుచుకోను
శరపరంపరల జ్ఞాపకాల్ని…
వాటిని దగ్ధం చేసి
రేపటి గానం చేస్తా…
రేపు నిన్నటి సమాధిపై మొలిచిన పుష్పం
రేపు నిన్నటి శోకాల కాంతిలో వెలిగే లోకం…

2 అభిప్రాయాలు »కవితలు

2 అభిప్రాయాలు

  1. bhasker.k Oct 2, 2009 1

    కవిత చా లా బాగుంది. ఎంతైనా మా క్రిష్నుదు రాసింది కదా. ఆర్తి ఉంది కవితలొ.

  2. ప్రాణహిత » సెప్టెంబరు 2009 సూచిక Oct 11, 2009 2

    [...] కాలరేఖ – కృష్ణుడు [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో