నాన్న ఆనవాళ్ళు

చిన్న మొక్కగా వేళ్ళూని నాతో పెరిగి
డాబాపై పాకిన సన్నజాజి తీగ సాక్షిగా
ఇల్లంతా జల్లిన పూల పరిమళాల సౌరభంలా
నన్ను పలకరించి వెళ్ళే పిల్లగాలి సంభ్రమంలా
నాన్న వున్నప్పుడు నా బాల్యం బంతిపూల రథం
పార్కులో జారుడు బల్లపై
జారిపోవడం రోళ్ళు పగిలే రోహిణీ కార్తెలో
అమ్మ చేతుల అరటి ఆకుల్లో నిద్రించిన పసితనం
అమ్మంటే నాన్ననీ
నాన్నంటే అమ్మనీ
ఉంగాలనుంచి అ ఆ ఇ ఈ లలో
మాటల బాటలో నడిపించిన పయనం
రావిచెట్టు ఉయ్యాల ఊపుల్లో నేను విన్న రాజకుమారుల ముచ్చట్లు

ఉప్పుమూట లా నాన్న మూపున వేలాడిన బాల్యం
తామర పూల చెరువులో ఈత నేర్చిన సంబరం
వయసును మరిపించే పసితనం మళ్ళీ గుర్తొస్తుంది
బాల్యమంటేనే నాన్న వున్నతనం కదా అనిపిస్తుంది
గంగిరెద్దు మేళం ఆడించిన ఆటలు
వాన వెలిసిన చినుకుల్లో కాగితం పడవల షికార్లు
నాన్న పక్కన నిలబడ్డ క్షణం ఎవరెస్టును ఎక్కినట్టుంది
చివరిసారిగా గట్టిగా పట్టుకున్న నాన్న చేతి బిగువుని భరిస్తూ
అంతకంటే ఎక్కువైన స్వేచ్ఛ కోల్పోయిన గుండెపగులుని మోస్తూ
దారివెంట పోతున్న కుక్క పిల్లను మురిపిస్తూ
మొదటిసారి స్కూల్లో అడుగెట్టిన గుర్తు వుంది
చదువులో వెనకపడినప్పుడు నా భుజాన్ని చుట్టిన చేయూత
ఉద్యోగానికి ఊరు దాటుతున్నప్పుడు వీపు నిమిరిన ఆర్ద్రత
గుండె గొంతుకలో నానుతుంది
“అమ్మా” అన్నమాటకు
కన్నా నేనున్నా అన్న జాడే లేదు
మొన్న మాట్లాడిందే మాట
నేడది గుండెలో తడిసి బరువైన మూట
తలుచుకుంటే చాలు
కళ్ళనిండా నీళ్ళు కన్న తండ్రికి ఆనవాళ్ళూ

(నాన్న నిత్యం గుర్తొస్తారు ఫాదర్స్ డే ఒక సందర్భం మాత్రమే)

ఒక అభిప్రాయం »కవితలు

ఒక అభిప్రాయం

  1. gks raja Sep 8, 2009 1

    అమ్మ గురించి చెప్పిన కవులు చాలా మంది ఉన్నా ఇంకా ఇంకా ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉండే సంగతి అమ్మ. చెప్పడం ఒక రకంగా తక్కువ చెయ్యడం అమ్మని. నాన్న గురించి బాగా చెప్పారు. చిన్నప్పటి సంగతుల్ని, స్మృతుల్ని మధురమయిన తొలి నడకల పాఠాలుగా బాగా చెప్పారు.
    ఆభినందనలు.
    రాజా

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో