పాలస్తీనా

మూలం: లీసా సుహైర్ మజాజ్

మీ కళ్ళు నేల మీదే ఉండాలి సుమా
నేల మీది రాళ్ళను మాత్రం చేతుల్లోకి తీసుకోకండి
జట్లు కట్టి గెంతులాడి రాళ్ళందుకోవద్దందామె
పక్కవాళ్ళను గురించి పట్టించుకోవద్దు
వాళ్ళబ్బాయిని నిన్న రాత్రి అరెస్ట్ చేశారు
చాకలి కొట్టును దాటొద్దు, పక్కలను చక్కబెట్టండి

గోడ మీది రాతల పై సైనికుల దృష్టి
పడకముందే తుడిచేయండందామె
అయ్యో ! బూట్లూ బిగ్గరయి పోయాయా!
మన దగ్గర డబ్బులు లేవు మడమలను కోసేయండి
ఈ పూటకు మనం తినేదే తిండి
మళ్ళీ రేపటి దాక తినడానికి ఇంకేం దొరకదు
నారింజలా ? మన దగ్గర నారింజ లెక్కడివి
వాళ్ళు మన చెట్లనీ నరికేశారు కదా
ఏమో ! ఎందుకు చేశారో నాకు తెలియదు
అవి వారి టాంకుల్ని భయపెట్టాయేమో అందామె
మనకు నీళ్ళు లేవు. అల్లా దయ అయితే
స్నానాలు వచ్చే వారం చేద్దాం
అప్పటి దాకా మరుగు దొడ్లకు నీళ్ళు వాడొద్దు
ఆలివ్ తోటల వైపు నే వెళ్ళాను
అక్కడ వలసవాదులు వచ్చి తిష్టవేశారు
కిటికీలకు దూరంగా ఉండండి
కాల్పుల చప్పుడు మీకు వినిపించడం లేదా?
పక్కింటి వాళ్ళ ఇంటిని కూలుస్తున్నదెందుకా ?
ఏమో ! నాకు తెలియదు . బహుశా ఆ దేవుడికి తెలుసేమో
తెలిసినా ఆయన మనకు చెప్పడం లేదందామె
ఈ రోజు మీకు బడి లేదు
మిలటరీ దాడి సాగుతుంది
లేదు అదెప్పుడు ముగిసేదీ నాకు తెలియదు
లేక అదింకా ముంచుకొస్తుందో తెలియదందామె
నేనెప్పుడూ టాంక్ లను గురించి ఆలోచించలేదు
వరండాలోకి వచ్చేయండి
అక్కడయితే ఒకింత క్షేమం
ఆ వార్తలను ఆపేయండి
అవి వినడానికి మీరింకా చిన్నపిల్లలు
మీ భయం పోగొట్టడానికి మీకో కథచెప్తా
కన్ యా మ కాన్ అది ఉందో లేదో
ఆ భూమికి, ఆ నేలకు పాలస్తీన్ అని పేరు
వీధుల్లో నిండా పిల్లలు ఆడుకొనే వారు
పొలాలలోనూ తోటల మధ్య అంతావారే
అల్ మండ్స్ , అప్రికాట్స్( కుబానీలు ) ఏరుకొనే వారు
ఆధిపత్య వాదుల దురాక్రమణ దినాలే

(ఇజ్రాయిల్ సైనిక దురాక్రమణ కింద నలుగుతున్న పాలస్తీనా బాలల బతుకుల్ని వివరిస్తుంది అంతర్జాతీయ సంఘీభావ ఉద్యమం)
వేళ్ళతో కూల్చివేయబడుతున్న బాల్యం పాలస్తీనా, ఇరాక్ , ఆఫ్ఘాన్ ఎక్కడైనా ఒక్కటే. లీసాసుహైర్ మజాజ్ పాలస్తీనా అమెరికన్. కవిత్వంతొ పాటు సృజనాత్మక రచనలను వెలువరిస్తోంది. విజన్స్ ఇంటర్నేషనల్ , సౌత్ అట్లాంటిక్ త్రైమాసిక , విమెన్స్ రివ్యూ ఆఫ్ బుక్స్, అట్లాంటా రివ్యూ , ది పొయెట్రీ ఆఫ్ అరబ్ విమెన్, స్పేస్ బిట్వీన్ అవర్ ఫూట్ స్టెప్స్, పొయెమ్స్ అండ్ పెయింటింగ్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ తదితరాల్లో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి.

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో