Sep2009
పిండాల బావి
అమ్మా!
నేను జీవ కణాన్నై
నీ ఉదర గృహంలో అడుగు పెట్టినప్పుడు
నువ్వెంత సంబరపడ్డావో కదా?
ఎంత మంచి దానివమ్మ!
ఆడో!మగో! తెలియదు
ముక్కు మొగమైనా రూపు దిద్దుకోలేదు
ఎన్ని సార్లు బొజ్జ తడుముకుని
నన్ను నీ బతుకు లోకి స్వాగతించావో కదా!
వెచ్చని నీ గర్భ గుడిలో దైవం లా
నేనెంత భద్రంగా వున్నానో కదా!?
ఈ రోజు నాన్న ఏదో అన్నాడు
అశృ తరంగాల మధ్య
ఓటి పడవలా వున్నావు నువ్వు
మొదటి సారిగా నాకు భయంగా వుందమ్మా!
నాన్నకి నేనిష్టం లేదు
స్టాక్ మార్కెట్లో పతనమైన సెన్ సెక్స్
నాన్న ఆస్తికి ఆనకట్ట ఆమ్నియో సెంటిసిస్
అమ్మా! నీ మనసేంటో నాకు తెలుసు
నిద్రలో పక్కకి ఒత్తిగిలితే
నాకెక్కడ నొప్పి కలుగుతుందోనని
కంటి నిండా కమ్మటి నిద్రైనా పోకపోతివి
నీ తలపుల కొమ్మపై
తేనె పిట్టనై వాలినప్పుడు
అవ్యక్తానుభూతికి లోనైన
నీ అంతరంగాన్ని లోనుంచే చూశాను
నేనంటే నీకెందుకంత ఇష్టం?
అమ్మతనం ఇంత తీయగా వుంటుందా?
నేనూ అమ్మనై
నా పాపని ఇలాగే ప్రేమించాలనుందమ్మా!
మీ అమ్మ నిన్ను కడుపు లోనే చంపేసుంటే
ఇప్పుడు నాకు నీ ప్రేమ రుచి తెలిసేది కాదు
అమ్మమ్మ ఎంతో మంచిది కదమ్మ!
నీకు బతుకు నిచ్చి జీవన బంధాలు వేసింది
నీ మాతృత్వం కూడా నన్ను కాపాడలేదా?
నాన్న దూరమైతే
నీకు సమాజంలో గుర్తింపు లేదు
నేనుంటే
మీకు పున్నామ నరకం తప్పదు
నాన్నకి కొడుకు కావాలి
నీకు నాన్న కావాలి
ఎవరు చెప్పారమ్మా?
ఈ కంచికి చేరని పుక్కిటి పురాణాలు?
కానీ నీకో విషయం తెలుసా అమ్మా?
నాకూ ఓ మంచి చోటుందని?
అక్కడంతా నా వయసు ఆడ పిండాలే!
మొగ్గతొడగని అంగాలూ…………
లేత పాపల పుర్రెలు , ఎముకలూ…………….
చెదిరిన స్వప్నాలను కలగంటున్న కళ్ళ
లోగిళ్ళతో
నాకు స్వాగతం పలుకుతారు
అమ్మా………
నాకోసం ‘నయాఘడ్ లో’
పిండాల బావి కాచుకుని వుందిలేమ్మా!
( ఒరిస్సా – నయాఘడ్ పట్టణం లోని ఒక పాడుబడ్డ బావిలో నలభైకి పైగా ‘ఆడపిండాల’ను కనుగొన్నారన్న వార్త చదివాక)
September 12th, 2009 at 3:18 am
పుట్టకముందు,పుట్టాక ఆడపిల్ల అని చంపేస్తున్న వాళ్లెందరో ఉన్నారు. ఆడపిల్లలు అంతరిక్షం లోకి దూసుకువేల్తున్న కూడా ఇంకా ఈ కాలం లో కూడా భారంగానే భావిస్తున్నారు. ఇది సత్యం
హేమలత గారు చాల బావుంది కవిత, బాగా చెప్పారు
September 12th, 2009 at 3:34 am
ఆదపిల్ల అనగానె అమ్మొ. అనుకున్న ప్రథి వారు ఇది చదవాలి. నిజంగా ఈ వివక్ష ఈ సమాజానికి ఎందుకొ..? మొగ్గ లొనె థుంచెసె ఆ కసాఇవారిని కన్నది కూద ఒక ఆదదె అని ఎలా గురుథు కు రాదొ హ్రుదయాన్ని కదిలించెలా వుంది మీ కవిత.
September 12th, 2009 at 3:40 am
amma lokamo ada pilalaku chinna chupento artam kavatam ledu
ammai aeena abbai aeena edaru okate kadamma
kani mi kavitha chala chala bagundi amma
September 12th, 2009 at 3:45 am
ఈ కవిత చదివాక నాకు త్వరగా అమ్మను అవ్వాలని ఉంది.నయాఘడ్ అన్న పట్టణం ఒకటి ఉంది… అందులొ ఇటువంటి గొరం ఈ కాలంలొ కూడా జరుగతొంది అంటె… బయమెస్తొంది.
September 12th, 2009 at 4:44 am
meere theluputhann bavam chala baga vundhi
Orissa Loo jarigina goram mali ekkada kuda jarugakudadhu
ee sandheshanii india antha Pampandi
September 12th, 2009 at 4:51 am
చాలా బాగుందమ్మ… ఎంత బాగుంది అంటే.. నేను చదువుతున్నప్పుడు నాకు తెలియకుండనే… నా కళ్ళు వర్షిస్తునాయమ్మ….అద్బుతం… అమోఘం … అన్విర్వచనీయం…ఆశలకు నొచని అభాగిణి ని …తండ్రికి గుదిబండని… పుట్టుకలొనే ఓటమి తప్ప.. గెలుపు పొందలేని అభగ్యురాలిని….జన్మకు ముందే నీ దేహపు వాటికలొ సమాది అవుతున్న ఆడపిల్లని….”
మీరు ఇంక ఇలాంటి మంచి మంచి కవితలు వ్రాయలని… మనస్పూర్తిగా కొరుకుంటున్నాను అమ్మ….నాకు ఇలాంటి మంచి అమ్మ పరిచయ మైనందుకు… ఆ దేవుడికి శిరస్సు వంచి… నమస్కరిస్తూన్నాను….మీ కొడుకు రేవా….
September 12th, 2009 at 6:08 am
చాల బాగుంది హెమ గారు మీ కవిత .నా మనసంత ఆర్ధ్రత తొ నిందిపొయింది..మీ కవిత చదువుతుంతె
September 12th, 2009 at 6:26 am
Amma ante O adbhutham .Amma ante O apuroopam.amma avvadam aadadaaniki devudichhina varam.amma avvadaaniki aadadi enno kalalu kantundi.teeraa ame garbham daalchinappudu aa garbham lo ammayi ani telisinappudu aame kanna kalalanni pakkana petti aa pasiguddu pranam teesthundi.ame enduku aalochinchadu maa amma kadupulo unnappudu naa gonthu nulipi unte ee suvisala prapancham nenu chooda galigedaaninaa ani? ayinaa aa pasiguddu pranam teeyadaaniki amekunna adhikaram enti?parents pai abbayilakannaaa ammayilake ekkuva prema untundi.abbayi settle ayyaka parents ni pattinchukoru.ade ammayi ayte aamma naannala meeda premani eppatiki okelaa choopisthundi.naaku abbayi kanna ammaye istam.
Hema ji mee kavitha chalaa bagundi
(indulo tappulunte mee pedda manasutho manninchandi.)
September 12th, 2009 at 9:45 am
మి కవిత చాలా బాగుంది….మీరు ఇంక ఇలాంటి మంచి మంచి కవితలు వ్రాయలని… మనస్పూర్తిగా కొరుకుంటున్నాను….మీ కవిత నా హ్రుదయాన్నికలవరపరిసింది. నాకు ఎడుపు వస్తుంది…..హేమలత గారు చాలా చాలా బాగుంది……..మీ రాము మీ నుంచి ఇలాంటివి కవితలు ఎన్నొ రావలని ఆశిస్తున్నా…..
September 12th, 2009 at 12:47 pm
హేమలతగారూ !
పిండాలబావిలో ఉన్న పిండాలన్నీ తమగురించి స్పందించే మీలాంటి కవయిత్రికి, జాషువాగారి పుష్పవిలాపం తరువాత పూలన్నీ ఎలా ఋణపడి ఉన్నాయో, అలానే ఋణపడి ఉంటాయి !
అమ్మల మనస్సులు ఎంత కర్కశం అయితే అటువంటి బావులు పుడతాయి ?
నిండుతాయి ?
స్త్రీ జాతికి, స్త్రీజాతే ఇలా చరమగీతం పాడేస్తుంటే, ఈ పిండాల బావిని పూడ్చేదెవరు ?
అసలు స్త్రీని ఇంత చులకనగా చూసే హక్కు ఎవరికీ లేదని లొకం అంతా ఘోషిస్తుంటే, మన స్త్రీజాతికి వినిపించట్లేదా ? ఇంకా ఎన్నాళ్ళు ఇలా ?
ఎవరో వస్తారనీ, ఏదో మేలు చేస్తారనీ ఇంకా ఎదురు చూస్తారే ?
మీలాంటి కవయిత్రుల కవితలు నిత్య నిద్రాణ దశలో ఉండే మన స్త్రీజాతి ముఖం మీద పిండాల బావి నుంచి తెచ్చిన నెత్తురు చిమ్మీ, అక్కడి బుల్లి బుల్లి ఎముకలతో డొక్కలో పొడిచీ జాగృతం చెస్తారని ఇంకా ఏదో ఆశ !
జోహార్లు మీకు !
- ప్రభాకర్
September 12th, 2009 at 1:27 pm
MEE KAVITHA NAAKU BAAGAA NACHIDI. CHALA BGAA CHEPAARU …
September 12th, 2009 at 2:46 pm
ఈ కవిత నన్ను ఎంతొ కలవర పెదుతూ వుంది.అలా చెయటానికి మనసు ఎలా వొప్పిందొ?స్త్రీలమైన మనమే కదా దీన్ని ఆపగలిగేది?
September 12th, 2009 at 8:28 pm
హేమ, చెప్పనే లేదు. జల్లెడలో చూసి వచ్చాను. గుండెలు పిండేంత బాధ.
“చెదిరిన స్వప్నాలను కలగంటున్న కళ్ళ
లోగిళ్ళతో
నాకు స్వాగతం పలుకుతారు”
చెమ్మగిల్లిన కళ్ళతో ఈ రాక్ష ప్రవృత్తి, వికృత క్ర్రిడ నశించాలని ఆ మృత శిశువులకి అశృనివాళి అర్పిస్తూ, మరలి రావద్దు ఏ మధురసీమలనో వెదుక్కుని ప్రశాంతంగా ఆడుకుని పాడుకోండని చెప్తూ.. ..
September 13th, 2009 at 5:59 am
కవిత చాలా బాగుంది.. ఈ రోజుల్లో ఇలాంటివి ఇంకా కొనసాగడం దురదృష్టం.. రాయడానికి మాటలు రావట్లేదు.. సో నైస్ ..
September 13th, 2009 at 11:48 pm
చాలాబాగా రాసారు హెమలతగారూ
కంళ్ళ వెంబడి నీరు ఒచ్చెసింది మీ కవిత చదివాక
ఎంతటి దురద్రుష్ట వంతులు ఆ తల్లులు ,
ఇప్పుడు కూడా ఇలంటీ వారున్నారంటె .
September 14th, 2009 at 9:35 pm
nice…poem
September 14th, 2009 at 9:47 pm
హేమ..
మీ కవిత చదివాక,
నాకు మాటలు కరువయింది,
గొంతు మూగ బొయింది,
మనసు బరువయింది,కళ్ళు నీలతొ నిండింది,
హృదయం గాయమయింది,
తెలియని అవేదన ఆవరించింది,
నాకు ఒక ఆడపిల్ల,
పుట్టలెదన్న లోటు,
నన్ను వెక్కిరించింది.
September 15th, 2009 at 4:03 am
Hai Atthaya nice to see ur poem , yes Amma anedi oka thiyati pilupu , Sahananiki prathirupam , thana prema tharaganidhi , maruvalenidihi , cheppalenidhi, okka maatalo cheppalante thana prema varnathetham. ee lanti kavithalu nuvvu yenno rayali ani adi andariki cheruvayee samajam lo jarige ghoraalu anthamayee prapancham antha sashya shyamalanga undali ani korukuntu mee
Swetha Mallela
September 15th, 2009 at 10:27 am
‘స్త్రీ’ లేని ఇంటిని ఊహించడమే కష్ట0 గా వుంది.
ఎ0త కాదన్నా త0డ్రి కి కూతుర0టేనే ఎక్కువ ఇష్ట0 వుంటు0ది.
బహుశా ఆ కాల0 లో పెద్ద వాళ్ళ వలనే అలా ప్రవర్తించే వారేమో!!!
అయినా ఇ0కా అమ్మాయి విలువ తేలియని త0డ్రులు లెక పోలేదు.
మీ కవిత చదివిన ప్రతి మగాదు,తనకు ఒక్క ఆడ్ పిల్ల అయినా కావాలాని కోరుకుంటాడు.
September 17th, 2009 at 11:57 am
హేమగారూ,
కదిలించివేసింది మీ కవిత… ఎన్ని మిలియనంలు గడిచినా, ఈ వివక్ష్ తప్పటంలేదే!
ఎలా వున్నారు? సుధాకర్గారికి, నా నమస్కారములు.
ప్రేమతో, మీన.
September 17th, 2009 at 12:33 pm
అమ్మమ్మ ఎంతో మంచిది కదమ్మ!
నీకు బతుకు నిచ్చి జీవన బంధాలు వేసింది………
ee rendu vakyalu chustunte bhandhameeda gouravam peruguthundi.. neti samajam lo unna prathi thalli chadavalsina kavitha edi…….
mee MANOGNYA……….
September 18th, 2009 at 1:29 pm
మార్పు ఎంతో వచ్చిందని, ఆడ శిశువుల మరణాలు తగ్గాయని సంబరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మనమంతా కలలు కంటుంటే….ఇటువంటి వార్తలు సమాజంలో కల్లోలాన్ని రేపుతూనే ఉంటాయి….ఇటువంటి వాటిని మార్చడానికి మనమందరం కృషి చెయ్యాలి హేమా….
కవిత చాలా హార్ట్ టచింగా ఉంది….
September 19th, 2009 at 8:25 pm
హేమ లత గారు,
మీ కవిత బాగుంది, చాలా బాగుంది. చాలా చాలా భాగుంది. నిజంగా చాలా చాలా చాలా బాగుంది. ఆ వార్త చదివిన తర్వాత మీ మనసులో బాధని మాక్కూడా కలిగించారు. ఎక్కడా వాడని, చూడని ఆడంబరం కోసవే వాడే పదాల్లేవు. చెప్పాలనుకునే ఎమోషన్ ని ఏ మాత్రం భేషజాల్లేకుండా సరళంగా చెప్పేరు. తెలుగొచ్చిన అందరికీ అర్థవవుతుంది మీ కవిత. అర్థవవటవే కాదు చదివిన అందరి మనసుల్ని తాకుతుంది, కదిలిస్తుంది, కకావికలు చేస్తుంది. చదివిన వాళ్ళ మనసులో బాధనే కాదు, ప్రశ్నలని కూడా రేకిత్తిస్తుంది. కారణాలకోసం మనసు వెతుకులాడుతుంది. సరళవైన, సహజవైన వ్యక్తీకరణలో ఎంత పవర్ దాగుందో మీ కవిత తెలియ చెప్తుంది.
ఐతే హేమ గారు, అమ్మమ్మ మంచిదే కావచ్చు, కానీ తాత చేతిలో బొమ్మే కదా. అమ్మ కూడా నాన్న చేతిలో బొమ్మేకదా? అమ్మల కడుపున ఎవరు పుట్టాలో, పుట్టి ఎవరు బ్రతకాలో నిర్ణయించేది నాన్నలే కద హేమా గారు. మీ కవితలో అమ్మని మీరడిగిన ప్రశ్నలు తప్పుని అమ్మ మీదకి త్రోసాయి గమనించారా? ఆ అలుసు తీసుకుని, పాఠకులు అమ్మల్ని ఎన్నిన తప్పుల్ని చదివేరా. మీ కవిత దిశ తప్పటం జరిగింది. పిండాల బావిలో పిండాలు అమ్మల చేతుల్లో చక్కని తల్లుల్లాగా వుండేవారు, అమ్మలకే అధికారం వుండుంటే, కాదా?
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
September 30th, 2009 at 3:40 am
‘పిండాల బావి ‘ కవిత పై స్పందించి తమ అభి ప్రాయం తెల్పిన కవితా ప్రియులందరికీ కృతజ్ఞతలు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ !’మీ కవితలో అమ్మని మీరడిగిన ప్రశ్నలు తప్పుని అమ్మ మీదకి త్రోసాయి గమనించారా? ఆ అలుసు తీసుకుని, పాఠకులు అమ్మల్ని ఎన్నిన తప్పుల్ని చదివేరా. పిండాల బావిలో పిండాలు అమ్మల చేతుల్లో చక్కని తల్లుల్లాగా వుండేవారు, అమ్మలకే అధికారం వుండుంటే, కాదా?’ అని అడిగారు.
రవికిరణ్ గారూ! యుగాలు మారుతున్నా అమ్మలకి , అమ్మలు కాబోయే వారి గురించి ‘వారికే అధికారం వుండి వుంటే ” అని ప్రశ్నించు కోవటమే చాలా బాధాకరం కాదా?బిడ్డల్ని కనే విషయం లో కూడా తమ మీది అధికారాన్ని భర్తల చేతుల్లో నుంచి తీసుకో లే ని అమ్మల గురించేనండే ఈ ఆవేదన.
‘అమ్మ కూడా నాన్న చేతిలో బొమ్మేకదా? అమ్మల కడుపున ఎవరు పుట్టాలో, పుట్టి ఎవరు బ్రతకాలో నిర్ణయించేది నాన్నలే కదా హేమా గారూ ‘ అన్నారు.
మీరు లోకం తీరే చెప్పారా మో కానీ …..ఈ పరిస్థితి నుంచి ‘ఆడ పిండాల’ ను కాపాడ గలిగే ఉద్యమం లో మహిళల తో పాటు మీ లా ఆలోచించ గలిగే పురుషులు కూడా భాగస్వామ్యం
తీసుకున్నప్పుడే ‘పిండాల బావిలో పిండాలు అమ్మల చేతుల్లో చక్కని తల్లుల్లాగా’ పెరుగుతారు మీరన్నట్టు.
మీ అభిప్రాయానికి ధన్యవాదాలతో….
హేమలత పుట్ల.
October 4th, 2009 at 2:09 am
జనార్దన్
మీ కవితలో ప్రతి అక్షరం ఎదలోతుల్లోంచి వెదజల్లిన భాణాలుగా ఉన్నాయి.అవి మా మనసును తాకి కళ్లలోంచి బెమ్మను చెంపను తాకి కీబోర్డులోంచి మిమ్మలను చేరుతున్నాయి. పదాలను విరిచి కవిత్వమని జబ్బలు చరుచుకునే వారికి సరళమై పదాలతో హృదయాన్ని తాకే కవితలనెలా రాయాలో ఆచరణలో చూపించారు. ఇక కవిత విషయానికి వస్తే, ఏ మాత్రం హృదయం ఉన్న వారికైనా బృకుటి ముడి పడక మానదు. వారికి తెలియకుండానే ఒక నిట్టూర్పు, కాస్త వేడి శ్వాస తప్పదు. ఎవీవే మంచి కవిత అందించినందుకు థాంక్స్. ఏ. జనార్దన్. ఫీచర్ సబ్ ఎడిటర్ ఆంధ్రజ్యోతి చానల్.
October 9th, 2009 at 8:12 am
mee kavitha hrudhayaanni kadhilinchela vundhi. chala bhadha ga vundhi. inthala society devp ayina inka ilanti kathalu anno. manasu ku chala hattukonela rasaru. mee kavitha kondharini ayina kadhilisthundhi ani asa.
October 10th, 2009 at 3:18 am
లోకంలో స్వచమయిన, కల్మషం లేని ప్రేమంటూ ఉంటె
అందులో “తల్లి ప్రేమ” అపారమైనది …
నవమాసాలు మోసి బిడ్డని కనిన తల్లి
ఆ పిండాల బావి లో పడేసినపుడు
ఆ తల్లి మనసు ఎంత క్షోబకు గురయిందో !!
తండ్రులు మారండి …సమాజం మారింది …
ఇంకా దాన్ని పటుకొని వేలడకండి
ఈ అభ్యునత సమాజం లో …ఆడవారు లేని
చోటు లేదు…ప్రతి చోట వారు ఉంటూ..దేశాన్ని
ముందుకు నడిపిస్తునారు …!!
హేమ గారు …నిజంగా బాధ పడాల్సిన విషయం అండి ఇది ….ఎపుడు మారతారో ఏమో …ఇటువంటి వారు.
October 13th, 2009 at 4:38 pm
hemalatha garu. kavitha chala bagundi.aamadya nenu kooda oka kavitha rasanau
dani peru mullapodallo shaishavam .
nijangane spandinche hrudayamunte rasewallu chal raya galaru keep it up
December 25th, 2009 at 10:51 am
కన్నీళ్ళ పర్యంతమ్ చేసారు హేమలత గారు!మీరు ఇన్క ఎంతొ గొప్ప పేరు సాధించాలి అండి! సార్ కన్నా మీ కవితలు అద్బుతమ్ !
December 27th, 2009 at 7:14 am
dont shed tears when we were living in the country of blackmailers.
March 14th, 2010 at 12:16 pm
మీ కవిథ అద్బుతమ్ గా ఉందండి.