ప్రవక్త లేని ప్రపంచం

ఉర్దూ మూలం : మజర్ మెహదీ

ఈ ప్రపంచం
ఇతర ప్రపంచాల కన్నా భిన్నంగా ఎప్పుడుంది?
అవే జలపాతాలు
అవే ఆకుపచ్చని లోయలు
అవే భుజాలవంటి కొమ్మలున్న చెట్లు
భూమిలోపలి నుంచి ఉబికి ఉబికి ఉవ్వెత్తున చిమ్ముకొని వచ్చే ఊటలు
పర్వతాలు
అవును వీటికి కూదా దిశానిర్దేశం కావాలి
రుచీపచీలెని నీళ్ళు
ఈదప్పిని తీర్చలేనని నీటికి తెలుసా!
ఒకయాంత్రిక సంప్రదాయానికి అలవాటుపడ్డాం
ఈ పిల్ల తెమ్మరలకు
పూలను ముద్దాడె వయ్యారం తెలియదు
ఈ పూలు గాలి నిర్దేశించినట్లు తలూపుతాయి
అడవుల్లో పూలచెట్ల మొదళ్ళన్నీ
టెంటు స్తంభాలుగా నిలిచి వుంటాయి
అంతే కాదు
వాటికి తమ సుగంధాల సంగతీ తెలియదు
ఈ పర్వతాలు తమ విలువలేని తనాన్ని చూసుకొని సిగ్గుపడుతున్నాయి
ఎవరైనా వాటిమీద నిలబడి
అల్లా ప్రార్థనకు “అజా” ఇచ్చి ఆహ్వానం పలకండి
ఈ ప్రపంచాన్ని
మరింత సుందరంగా – మరింత సమున్నతంగా
తీర్చిదిద్దుదాం – రండి ….రారండి

2 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

2 అభిప్రాయాలు

  1. Rajesh Sep 18, 2009 1

    ఇది చాల బాగుంది. పుల గురుంచి వ్రాసిన ఆ ఐదు లైన్లు చాల నచ్చాయి.

  2. ప్రాణహిత » సెప్టెంబరు 2009 సూచిక Oct 11, 2009 2

    [...] ప్రవక్త లేని ప్రపంచం – మజర్ మెహదీ – అన

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో