రెండు నాలుకల రాచ వ్యాధి

ఎప్పుడూ తల లేని వికృత జంతువొకటి
జనం మధ్య తిరుగుతూ వుంటుంది
ఐదేండ్లకోసారి తల మాత్రం మార్చుకుంటుంది
ప్రజలు ఇంకెన్నో ముఖాలతో మోసగింపబడుతూనే వుంటారు.
ఐతే ఒంటికి కొవ్వెక్కితే చికిత్స చేయవచ్చు
నోరు కొవ్వితే ఏం చేస్తాం ?

***

ఆ వేషమేయాలన్న వూహెంత సుందరం
ముఖం నిండా ఎప్పుడూ రాజ దరహాసమే
రాచ నగర మార్గం వెంట
రాజు వెడలె రైతు తేజములలరగ
వాన్ని జూసిన కొన్ని తలరుమాళ్ళు
తమ మధ్య నుండి నడచి వెళ్ళిన వాడని
తననే పోలి వున్నాడని తనివిదీర సంబుర పడ్డయ్
తమ పంటలో కలుపు మొక్కలు
మొలవనియ్యడనుకున్నయిగని
తనే కలుపు మొక్కవు తడనుకోలే
చెమటకూ, రైతుకూ, తలకూ, రుమాలుకు సంబంధం
కుర్చీమీదరుమాలు వేష మేంది?
ప్లాస్టిక్ నాగలి భుజానికెత్తుకొని రాజు పల్లె తొవ్వబట్టినట్టు
రాజు రైతు గావడ మేంది? రైతు రాజుగావలె గాని!
ఆ మాటకు,నాలుకకు మధ్య చీకటే చీకటీ!
రాజు నాలుక ఊసరవెల్లి! ఈ రాజ్యమొక మాయాబజార్
పదవి ఒక మంచులేని సుదీర్ఘ రాచవ్యాధి!
పాలోని నవ్వెపుడు పలు విధాల చేటు
తెలంగాణ ఎంగిలి మెతుకులు
తిని బలిసిన రాబందువు నువ్వు
నా ప్రజలు రేపటి అంతిమ తీర్పులో
నీకు శిలువేస్తారు జాగ్రత్త!
ఎండిన నడిచేనులో విలవిలలాడి
ప్రాణాలొదిలిన రైతుల గోస దలిగి పోతావ్!
మా కాళోజీ ఆత్మసాక్షిగా
నువు ఇడుపుల పాయ మడుగులో దాక్కున్నా సరే!
నిన్నిడిసిపెట్టే ప్రసక్తే లేదు!

ఒక అభిప్రాయం »కవితలు

ఒక అభిప్రాయం

  1. ప్రాణహిత » సెప్టెంబర్ 2009 నెల సంచికకు స్వాగతం Oct 12, 2009 1

    [...] రెండు నాలుకల రాచవ్యాధి – తైదల అంజయ్య [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో