Sep2009
తీపి శిఖ
అప్పుడెప్పుడో
దుఃఖం గుండెని నిండుగా కప్పుకున్నపుడు
ఙ్ఞాపకాలు నిలువునా బ్రతుకుని
ఒక్కోముక్కగా నరుక్కుపోయాయి
రాసులు రాసులుగా పోసుకున్న గాయాలు
జీవితంలోంచి మరల మొల్చుకొచ్చి
వీధి మలుపున ఎదురు పడ్తున్నాయి
నేనెప్పుడూ నడిచే వెళుతుంటాను
గమ్యాన్నో… లేదా గాయాల్నో వెతుక్కుంటూ
మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు
ఒంటరిగానే మిగిలిపొతుంటాను
నిద్రలో చీకటి అంచునుంచి
హఠాత్తుగా దొర్లి పడినప్పుడు
ఎప్పుడూ అంధకారంతోనే
నిండి ఉంటుందీ ప్రపంచం
గ్లాసుతో ఒంపుకున్న పద్యం ఒకటి
గొంతులోంచి దిగి
గుండెని నిటారుగా రెండుగా చీలుస్తుంది
ఏకాంతం గుట్టువిప్పడం నాకు తెలియదు
దుఃఖాన్ని స్మరించడమే తప్ప
దాన్ని దూరంగా నెట్టివేయడం నేర్పలేదు
పచ్చని పొదరిళ్ళలోకి ఒదొగి పోయి
మట్టిని ఆత్మీయంగా ఆలింగనం చేస్కున్నవాణ్ణి
ఇప్పుడు నీవూ నేనూ
ఎదురెదురుగా నిలబడినప్పుడు
కరచాలనం చేయలేని అసహాయుడిని.
September 18th, 2009 at 2:38 am
“నేనెప్పుడూ నడిచే వెళుతుంటాను
గమ్యాన్నో… లేదా గాయాల్నో వెతుక్కుంటూ” WoW, what a line … really touched…. Thanks …. nice poem …. please keep posting things like this.
Thanks You kadhar Ji.
October 11th, 2009 at 6:13 pm
[...] తీపి శిఖ – ఖాదర్ షరీఫ్ షేక్ [...]