Oct2009
ప్రాణహిత
మహా మేధావి, మానవ హక్కుల సేనాని కె. బాలగోపాల్ కు ప్రాణహిత నివాళి
ప్రాణహిత బాలగోపాల్‌కు సజల నయనాలతో వీడ్కోలు చెపుతున్నది!
ఆయన మహోన్నత వ్యక్తిత్వం ముందు శిరస్సు వంచి ఆయన ఆలోచనలకూ, ఆచరణకూ పునరంకితమవుతున్నది!!
డా|| కె. బాలగోపాల్
అక్టోబర్ 2009 సంచికలో…
సంపాదకీయం
మొత్తం చదవండి »
సూచిక
Oct2009
అఫ్సర్
Maya Angelou
మాయా ఎంజెలో అంటే కేవలం కవిత్వం కాదు, వొక ఆగ్రహ కెరటం.
ఆమె పదాలు సున్నితంగానే వుంటాయి, కాని వాటి లోతు కత్తి లోతు.
ఆమె వచనం సూటిగానే వుంటుంది, కాని, ప్రతి వాక్యం వొక వుద్విగ్న కెరటం.
ఇక…మాయ ఎంజెలో గొంతు విప్పిందా…వుద్రిక్త కవిత్వమూ, నగ్న వచనమూ కలిసి విరుచుకు పడే సముద్రం.
మొత్తం చదవండి »
దర్వాజ
Oct2009
ప్రాణహిత
నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యం అని గొల్కోండ పత్రికలో అధునిక భావ కవిత్వ తత్వ శీర్షికలో శ్రీ ముడుంబా వేంకట రాఘవాచార్యులు రాసిన వ్యాసాన్ని చదివి ఇక్కడి కవి అయిన సురవరం ప్రతాప రెడ్డి ఆ మాటలకు ధీటుగా కవితా సంకలనం తీసుకువచ్చారు. ఈ సంచికలో 354 మంది కవుల రచనలు వెలువడ్డాయి. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Oct2009
ప్రాణహిత
డా|| కె. బాలగోపాల్
బాలగోపాల్ ఇంక లేరు అనే వార్త ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదు. అది క్రూరమైన వాస్తవమని తెలుస్తున్నప్పుడల్లా, అది అబద్దమైతే ఎంత బాగుండు అని గొంతుకు పుట్టెడు దుఃఖం అడ్డు పడుతున్నది. నిద్రపోతున్నట్టే ఉన్న ఆయన నిర్జీవ శరీరం ఫొటొల్లో చూస్తున్నప్పుడల్లా కన్నీళ్ళు ఆగకుండా దుంకుతున్నయి. మొత్తం చదవండి »
సంపాదకీయం
Oct2009
రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
‘తెలుగులో కవితావిప్లవాల స్వరూపం’ లో డా.వెల్చేరు నారయణరావు గారు గురజాడ మీద రాసిన అధ్యాయానికి ‘అసంపూర్ణ విప్లవం’ అని పేరు పెట్టారు. తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే అసంపూర్ణ విప్లవం పాల్కురికి సోమనాధునితోనే మొదలయినట్లు అర్థమవుతుంది. అది ఆయనతో మొదలై, అన్నమయ్య మీదుగా ప్రయాణించి, వేమన, వీరబ్రహ్మంలతో బలోపేతమై కందుకూరి, గురజాడలతో ఆధునిక రూపం తీసుకుని, కుసుమ ధర్మన్న, గుర్రం జాషువాల ద్వారా స్వానుభవం సారంగా రూపొంది ఇవాళ అస్తిత్వ ఉద్యమమై సంపూర్ణ విప్లవం కావడానికి ప్రయత్నిస్తున్నది. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
Oct2009
ప్రాణహిత
- మునికిష్ణ
అది 1990ల ప్రాంతం. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాలనుంచి పలమనేరు బంగారుపాళ్యం మండలాలలోకి ఏనుగులు చొచ్చుకొని వచ్చి అటవీ ప్రాంతపు పొలాలపై దాడులు చేయసాగింది.ఈ సమస్య పై అన్ని దిన పత్రికలు వార్తలు ప్రచురించాయి.ఏనుగుల సమస్యపై అప్పటికీ మా చిత్తూరు జిల్లా పౌరహక్కుల సంఘం యూనిట్ ఏనుగుల రాజ్యం అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించి వుంది. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సంస్మరణ
Oct2009
జి.వెంకటకృష్ణ
రాత్రి లాంటి ఎన్నోరాత్రులలో
ఎన్నోరాత్రుల వంటి ఒక రాత్రిలో
నిరీక్షించి నిరీక్షించి మొత్తం చదవండి »
కవితలు
Oct2009
బాల్ రెడ్డి
-జీన్ పాల్ సార్త్ర్ మూలం : లా మ్యూర్ ( ది వాల్)
అనువాదం: జె.బాల్ రెడ్డి.
వాళ్ళు నన్నో పెద్ద తెల్లటి గదిలోకి తోశారు. కాంతి సూటిగా కండ్లమీద పడుతోంది. కండ్లు మిటకరించి చూడాల్సి వస్తోంది. టేబుల్ వెనక నలుగురు మనుష్యుల్ని చూశాను. పౌరదుస్తుల్లో ఉన్నవారు ఏవో కాగితాల్ని పరిశీలిస్తున్నారు. వారి వెనక ఓ ఖైదీల గుంపుంది . వారిలో కొందరు నాకు తెలుసు. వారిని చేరడానికి మేము గదంతా దాటి అవతలి కొసకు చేరాలి. మిగతావారు విదేశీయులై ఉండాలి. నా ఎదురుగా ఉన్న ఇద్దరికి గిరజాల జుట్టు,గుండ్రటి తలకట్టుంది. నాకు చూడ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళనిపించింది. అందులో పొట్టివాడు ఆందోళనగా పంట్లాంను గోక్కుంటున్నాడు. మొత్తం చదవండి »
అనువాదాలు, కథలు
Oct2009
బాల్ రెడ్డి
- జునైద్ ఆలం (అనువాదం ; జె.బాల్ రెడ్డి)
బాగ్దాద్ కొడుకులు కూతుల్లారా!!!!
బాగ్దాద్ కొడుకులు కూతుల్లారా!!!!
మీ విముక్తి ఘడియ సమీపించింది
కృంగదీస్తున్న భుజాల మీద బరువుతో బలంగా
మొత్తం చదవండి »
అనువాదాలు, కవితలు
Oct2009
ప్రాణహిత
- డా|| కె.సుభాషిణి
ఈ మధ్య మాకొలిగ్స్ కొంతమంది నన్ను చూస్తూనే మాట్లాడ్డం మానేస్తున్నారని నా అనుమానం. ఒక్కొక్కసారి “సార్ మేడమ్ వస్తోంది.. ఊరికే వుండండి…” అని నా రాక గురించి మిగిలిన వాళ్లకు తెలియజేసే సంకేతాలు నాకు తెలుస్తున్నాయి. మొత్తం చదవండి »
కథలు
Oct2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
Kodavatiganti Kutumba Raoఅక్టోబర్ 28న మా నాన్న కుటుంబరావుగారు పుట్టి నూరేళ్ళవుతాయి. సాహిత్యంలోనూ, కళల్లోనూ కృషి చేసినవారి కుటుంబనేపథ్యం, పెరిగిన వాతావరణం ఎటువంటివో తెలిస్తే వారి గురించిన అవగాహన పెరగవచ్చు. ఇది కేవలం వారి వ్యక్తిగతజీవితం గురించిన ఆసక్తి అనిపించుకోదు. సమాజానికీ, వ్యక్తిత్వానికీమధ్య జరిగే ప్రక్రియలను సూచిస్తుంది.
మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు
Oct2009
దేవీ ప్రియ
వెన్నెల విరగకాస్తున్న
నడిరాతిరి నిశ్శబ్దంలో
నింగి నుంచి వేలాడుతోన్న
వెండిజరీచీరల వెంట జారి
అప్పుడే జన్మించిన తారక ఒకటి మొత్తం చదవండి »
కవితలు
Oct2009
చల్లపల్లి స్వరూప రాణి
ఈ పోరు గడ్డ పైన పీడన
సరికొత్త రూపమెత్తింది
బాణామతి చిల్లంగి
అభివృద్ధి వేషం మార్చాయి
మొత్తం చదవండి »
కవితలు
Oct2009
ఎ. నాగరాజు
నడిచే పాదాల వెంట తెరుచుకునే దారులేమిటి
ఇక్కడ కరిగి మరెక్కడకో దారితీసే
ఈ క్షణానికి తుది ఏమిటి
మొత్తం చదవండి »
కవితలు
Oct2009
ఉదయ మిత్ర
చినుకు రాలదు…
భూమినవ్వదు…
సెజ్ ల పేర పాలకులు
లాభాల పేర షావుకార్లు
మొత్తం చదవండి »
కవితలు
Oct2009
అమీనా
వెన్నెల్లో వెదుకుతూ నడుస్తున్నాను. చుట్టూ కుప్పలుగా రాళ్ళు.వెలుతుర్లో తెల్లగా మెరుస్తూ కొన్ని, నల్లగా నిగనిగలాడుతూ కొన్ని, నన్ను మోహంగా చూస్తూ కొన్ని…. యోగి వేమనలా కొన్ని… రకరకాల రాళ్ళు దాటుకుంటూ వెతుక్కుంటూ ఓ అర్థరాత్రి వెన్నెల పరుచుకున్న తీరం మీద నగ్నంగా నడుస్తున్నాను. అదేపనిగా నడిచి విసుగు కూడా పుడుతుంది కాని ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం నదిలా పరవళ్ళు తొక్కుతుంది. మొత్తం చదవండి »
కథలు
Oct2009
ధేనువకొండ శ్రీరామ మూర్తి
నేను నా అనుభవం నుంచి తప్ప యింక దేంట్లోనూ విశ్వాసం కల్గించుకోను. నాకు ప్రపంచమంటే నేను, నా ఆలోచనలు, నా అనుభవాలు మాత్రమే! దానికి పరిసరాలు కొందరు వ్యక్తుల ప్రభావం వుండవచ్చు. నాకు కల వాస్తవం రెండూ ఒక్కటే. నా భావనలో జీవితం అంటే ఏదో అర్థము సంబంధం కనబడే ఒక కల.
మొత్తం చదవండి »
కథలు