బాగ్దాద్ కొడుకులు కూతుళ్ళు

- జునైద్ ఆలం (అనువాదం ; జె.బాల్ రెడ్డి)

బాగ్దాద్ కొడుకులు కూతుల్లారా!!!!
బాగ్దాద్ కొడుకులు కూతుల్లారా!!!!
మీ విముక్తి ఘడియ సమీపించింది
కృంగదీస్తున్న భుజాల మీద బరువుతో బలంగా
దిగ్ర్బమలో భయభీతితో నిలబడండి
బాగ్దాద్ కొడుకులు, కూతుల్లారా !!
మీ విముక్తి ఘడియలు సమీపించాయి
కాలిపొతున్న ఇళ్ళను,కూలిపోతున్న భవనాలను చూడండి
మీ ఇంటి చుట్టున్న భూమి కంపిస్తున్నది, వెన్ను వంచండి వెనక్కి తగ్గండి
మీ కిటికీలు బద్దలై గాలికెగిరిపోయేంతగా ఏడ్చిమొత్తుకోండి
మా సాయుధ కవచ దళాలు కూడేంతలో పరిగెత్తి పారిపోండి
బాగ్దాద్ కొడుకుల్లారా,కూతుళ్ళారా!!
మీ విముక్తి గడియలు సమీపించాయి
మీ విముక్తి సంకేతాల కోసం ఆకాశం కేసి చూడండి
క్రూయజ్ మిస్సైల్స్
విద్యుత్ షాక్ లు
లేజర్ చాలిత, రాడార్ మార్గదర్శక
21,000 పౌండ్ల మైక్రొవేవ్ బాంబులు
దైవప్రసాదిత మందుగుండు
మీ ప్రజాస్వామ్యాన్ని ఫలవంతం చేస్తాయి
బాగ్దాద్ కొడుకులూ,కూతుల్లారా!!
మీ విముక్తి ఘడియలు సమీపించాయి
అందుకే మీకోసం మా శ్వేతహస్తాన్ని చాచాం
ఇండియా, ఆఫ్రికా,వియత్నాం
వారి ఎర్రటి నెత్తురుతో శుద్ధి చేసాం
బాగ్దాద్ కొడుకులు,కూతుల్లారా!!
మీ విముక్తి ఘడియలు సమీపించాయి
ఆస్పత్రులకు క్యాన్సర్ వార్డులకు
ఈ ఆనంద వార్తను చేరవేయండి
నిన్నటితో మీతో ఉన్న 500,000 మంది
చిన్ని శవ పేటికలలో నిద్రిస్తున్నారు
త్వరలో మీరు వారిని కోరి చేరుకోవచ్చు
బాగ్దాద్ కొడుకులు కూతుల్లారా!!
మీ విముక్తి ఘడియలు సమీపించాయి
పునరావిర్భవ విశ్వాసులు సృష్టించిన
యుద్ధ ట్యాంకులు, దురాక్రమణలు, బుల్డోజర్లు
ఆకలి,చిత్రహింసలు, కర్ఫ్యూలు
ఆక్రమణలు, జాత్యాహంకార, జాతి నిర్మూలనతో
మీవిశ్రాంతికి హామి, మీ భవితవ్యం భద్రం
1948నాడు, 1492లోను
పాలస్తీనా విమోచన సంకల్పానికి ఇదేస్ఫూర్తి
బాగ్దాద్ కొడుకులూ కూతుల్లారా!!
బీభత్సం భయం ఇక్కడున్నాయి
మీ స్తుతి వాక్యాలను, సమాధిపై
శిలాఫలకపు వ్యాఖ్యలను సిద్ధం చేసుకోండి
మీ విముక్తి ఘడియలు సమీపించాయి

  • (మహ్మద్ జునైద్ ఆలం ఈశాన్య విశ్వ విద్యాలయం రాజనీతి శాస్త్రం డిగ్రీ విద్యార్థి.విశ్వవిద్యాలయ యుద్ధ,జాతి దురహంకార వ్యతిరేకోద్యమ సభ్యుడు. రచనా కాలం మార్చి 23,2003)
  • బీభత్సరాజ్యం ప్రజలను తక్షణమే భయంలో ముంచెత్త దలుచుకుంది. ఊహించలేని సామూహిక విధ్వంసంతో సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయదల్చుకుంది.
  • Excerpt from shock and awe: Achieving Rapid Dominance

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో