కనురెప్పల కాంక్ష

రాత్రి లాంటి ఎన్నోరాత్రులలో

ఎన్నోరాత్రుల వంటి ఒక రాత్రిలో

నిరీక్షించి నిరీక్షించి

ఎడారిశూన్యత ఆవరించిన సంబంధాలలో

మనోంతర్గత వాంఛాఘర్షణల నడుమ ఒక జంట

అలల సయ్యాట గుప్పిట చిక్కిన బుడగలై

తీక్షణ పీడనం సోకి

శుష్క తీరానికి తాకి బద్దలయ్యే తరగలు.

ఒకరి ఎడబాటులో వొకరు

ఒకరి నిరాదరణలో వొకరు

ఒకరి బాహ్యేతరంగా వొకరు

స్తబ్దతలో ఒకరు

చెలరేగి ఒకరు

మనోంతర్గత వాంఛా శూన్యత నడుమ ఒక జంట

వాంఛాభారాల్ని మోయలేక మోస్తున్న సహనం మునిపంట

ముంచుకొస్తున్న దుఃఖం వెంట

క్షణాలభారం మోస్తుంది ఒకరిని

విసుగు అలలతో నిండిన పడగ్గది వెలివేస్తుంది ఒకరిని

అక్షరాలు అమరిన అరల్ని ఆశ్రయించేలా చేస్తుంది ఒకరిని

శాంతిని ధ్యానించే సీతాకోకని చేస్తుంది ఒకరిని

ఒకసారి అతడు ఆమె జడత్వానికి కారణాలు

ప్రపంచీకరణలోనూ వుద్యమస్తబ్దతలోనూ వెతుక్కుంటాడు

మరొకసారి ఆమె అతడి నిష్కృయా పర్వతానికి

స్టాక్ మార్కెట్లోనూ ద్రవ్యోల్బణంలోనూ వెతుక్కుంటుంది

ఇద్దరూ క్షణ క్షణాల నిరీక్షణలో

క్షణాలు బండరాళ్ళై తాకే గాయాలనూ

కాంక్షల రోలర్ కింద నుజ్జు నుజ్జుయ్యే

శరీరాలనూ లెక్కించుకుంటారు

అక్షరాల అరలలో అమరిపోయిన

ఆవిరైన ప్రేమలనూ

భగ్న ప్రణయాలనూ తలపోసుకుంటారు

సాహిత్య రసాయన యాంత్రిక సూత్రీకరణలు

చేసే దేహధారులై యిరువురూ పుష్కరకాలం

జడత్వ కారణాల భేతాల ప్రశ్నల మెడకు

వురులై వేలాడుతారు

కోర్కెల శరీరాలను దించడానికి

ఏ చెట్టు కొమ్మను పడితే ఆ కొమ్మను

ఎగబాకడం రాని నిస్సహాయులై

ఎగబాకినా సుఖాల రాపిడిని పొందలేని

పొందులో చిక్కిన భేతాలున్ని

కావాలనే వదిలిస్తారు.

మళ్లీ….

అక్షరాలు నిండిన అరలనుండే

వెలుగును దోసిళ్లలో నింపుకొని

రాత్రి తడిసిన చీకటి ప్రశ్నలను

ఆరబెట్టుకొని

స్వాంతన సాహిత్యవైద్యం చేసుకున్నాక

ఏ వెలుగు జాముల చూర్లలోనో

క్షణాల చప్పుళ్లను దాటి అక్షరాలా నిస్వన సవ్వళ్ళ

వూయలలోకి జారి

లోచూపును ఆవిష్కరించిన

కనురెప్పల కాంక్షసాక్షిగా

నిజభాగస్వామినే కలగంటారు

3 అభిప్రాయాలు »కవితలు

3 Responses to “కనురెప్పల కాంక్ష”

  1. 1
    manchikanti Says:

    బరువుఐన పదాలతొ కనురెప్పల …….బాగుబాగు…….feel good poem.

  2. 2
    geethanjali Says:

    వ్.కె,గారు,,సిక్స్ ,సమస్యలను సొషియొ,పొలితికల్ కొనమ్ లొ బాగా చెప్పగలిగారు.సెక్స్ ని,సున్నిథంగ అర్థమ్ చెసుకొనె ఒపిక నసిస్థఉన్న పరిస్థిథుల్ని సరిచెసుకొందె దన్ని అస్వదించలెని స్థిథి..ఎది ఎమైన మీ ప్రయథ్నమ్ బగుంది.ఇన్కా రావాలని కొరుకుంతు,,,గీథంజలి

  3. 3
    geethanjali Says:

    పదక గదిలొ సెక్షె ని మర్కెత్ నిర్నయించదమ్ చల దారునమ్ జకాని వాస్థవమ,,చాలా బాగా రాసారు..మరిన్ని మీ నించి ఎక్ష్పెచ్త్ చెస్థు సుభషిని గరినించి కుదా ,,గీథాంజ లి

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో