కవిత్వపు కన్నీటి తెర: మహాశూన్యం

కొంత మంది మనుషులకు ఊహ తెలిసిన నాటి నుంచే వునికి వుండదు. అంటే వాళ్ళు క్షణంలో మరణిస్తారు. క్షణంలో జన్మిస్తారు. తాము వున్నట్టా? బతికి వున్నామా లేమా? అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. కారణాలు ఏవైనా అది యదార్థం.

వాళ్ళు మామూలు మనుషులయితే ఏమవుతారో కానీ శిఖామణులవుతారు. తెలుగులో అట్లాంటి కవులు ఇద్దరే. ఒకరు బైరాగి , రెండో వారు శిఖామణి.

బైరాగి స్వకీయమయిన ఫిలాసఫీని సృష్టించుకున్నాడు. శిఖామణి ఆ అవకాశం కూడాలేదు. అతను ‘ బాధల చెట్టుగా ‘ అవతారమెత్తాడు. బాధే సౌఖ్యమనే భావనకు కూడా అతనికి వీలుచిక్కదు. ఎవరో లోయల మధ్య అతన్ని లోలకంలా కదిలిస్తున్నారు,.వదిలేస్తున్నారు. ఎంతదూరం సాగినా లోయ అంతం కావడం లేదు.

తన ‘ లేనితనాన్ని’ శూన్య ప్రపంచాన్ని ఇతనింత సుందరంగా ఎలా ఆవిష్కరించగలిగాడు. అంటే కేవలం అది మాత్రమే అతను బతికి వున్నడాని చెబుతుంది గనక. తన బతుకును జీవితంలో కాక కవిత్వంలో చూసుకుంటాడు. ఎందుకంటే అతనికి జీవితం లేదు. కౌగిలించుకున్న వాళ్ళు హఠాత్తుగా కనుమరుగవుతున్నారు. తన కోసం కళ్ళలో కన్నీటి చుక్కను కదిలించేవాళ్ళు తనముందే కన్నీటి గంటను వదిలి అదృశ్యమయిపొతున్నారు. తన వైపు చల్లగా వీచిన గాలిని రక్షించలేవు. పవిత్ర గ్రంధాలు పరిరక్షించలేవు. ధర్మం , న్యాయం, సంఘం అన్నీ అతనికి గాలిబుడగలే. ఆ నచికేతుడికి సమాధానాలిచ్చే యమధర్మరాజూ లేడు. అతనికి వున్నవల్లా అక్షరాలు. వాటిని అల్లుకుని ఆనందించమొక్కటే తెలుసు. ఊయలలూపే ఊహలు ,మాత్రమే అతనికి ఉల్లాసాన్నిస్తాయి. జర్మన్ మహాకవి రిల్కే తను ప్రేమగా రాసిన యువకవికి కవిత్వం గురించి చెబుతూ “nobody can council and help you, nobody. there is only single way, go in to your self. Search for the reason that bids you write, find out whether it is spreading put its roots in the deepest places of your heart, acknowledge to yourself whether you would have to die if it were denied you to write”. అంటాడు.

అట్లాంటి. అన్వేషణలో శిఖామణికి కవిత్వం దిరికింది. కవిత్వం దొరక్కపోతే శిఖామణి ఎప్పుడో చనిపోయి వుండేవాడు. అనామకంగా అదృశ్యమైపోయి వుండేవాడు. అనామకంగా నైనా సనామకంగానైనా ‘అదృశ్యం’ కావడం అనివార్యం. అది మరో విషయం.

కవిత్వమొక్కటే శిఖామణికి ఓదార్పునిచ్చేది. పుట్టినప్పుడే చనిపోయి కవిత్వంగా పరివర్తన చెందడం శిఖామణి అదృష్టం, దురదృష్టం. ఆ కవిత్వం అతనికి లేనివన్నీ ఇస్తుంది. ‘ ప్రవాసం నుంచి తిరిగొచ్చిన ప్రాణమిత్రుని స్వచ్చమైన నవ్వులా, పలకరింపులా వుంటుంది. దాని వంక చూస్తే తండ్రి ఒడిలో కూచోడానికి అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న కొడుకు ఎగబడుతున్నట్లు వుంటుందంట

తన వునికిని బాధల చెట్టుగా ఆ బాధల చెట్టు తనకు సమస్తాన్నీ ఇచ్చినట్లుగా చెప్పుకున్నాడు. ‘అది భయపెడుతుంది.

సాహసించి దగ్గరకెళితే సాదరంగా లోనికి తీసుకుంటుంది
ధైర్యంగా మొదటి కొమ్మ ఎక్కితే
చివరనున్న అమృతఫలం చేతికందుతుంది.
అప్పుడు ఆ చెట్టు మాటగా, పాటగా కవిత్వంగా
‘రూపాంతరం చెందుతుందంట’

మనకో సామెత వుంది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు’ . అవును దిక్కులేని శిఖామణికి దేవుడు కాదు కవిత్వమే దిక్కు.

కుటుంబ వారసత్వం, సంప్రదాయ పునాదులు, కులం పూర్వరంగం ఇంత వ్యవహరముంటే కానీ కవిత్వం వచ్చేదికాదు పూర్వం. అది రాసేవాళ్ళని కవులనేవారు. కానీ అవేవీ లేని, మానవజాతి చరిత్ర, సంస్కృతి ఇవేవి లేని శిఖామణి వేల సంవత్సరాల కవిత్వానికి ఆశ్చర్యం కలిగించేలా కళ్ళు తెరిచాడు. అతను ఎవర్నీ ఎదిరించడు. హక్కుల కోసం పోరాడడు. నిశ్శబ్దంగా తన బాధను అల్లుకుంటూ పోతాడు. తననెవరో వుద్ధరిస్తారని అతనికి నమ్మకం లేదు. వుద్ధరించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అతను ‘ మహాశూన్యం’ అతనికి ఆశలేదు, నిరాశా లేదు. నమ్మకం లేదు అపనమ్మకంలేదు, అతను ఆ ‘ స్థాయి ‘కి చేరుకున్నాడు. ఎందుకు చేరుకున్నాడో అతనికి తెలుసునో తెలీదు మనకు తెలీదు. అతని ముందు ఓ అందమయిన అద్దం వుంటుంది. దాని ముందు అతను నిల్చుంటాడు. కాని అతను అద్దంలో కనిపించడు. తను దయ్యమేమో అని భయపడతాడు. అద్దం నవ్వుతుంది. అప్పుడు

‘ఒక్కోసారి నేను మహానదిపై పోతాను
అప్పుడు , అప్పుడప్పుడూ ఒకటీ అరా కలల నౌకలు
నిశ్శబ్దంగా నామీద జారుకుంటూ నన్ను రెండుగా చీల్చుకుంటూ….’

ఆత్రేయ ‘కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు’ అన్నాడు. కాని కలలు కూడా జలగల్లా పీక్కుతినే ఈ కవిని చూస్తే మనకు ఒళ్ళు జలదరిస్తుంది. ఏ పునాదులూ లేని ఈ అనాది మానవుణ్ణి ఏ కేటగిరిలోనూ చేర్చలేం. శూన్యమే పునాదిగా చెప్పుకునే జెన్ యోగులా కిందకు చేరుద్దామనుకుంటే వాళ్ళలా దేనిపట్లా మమకారం లేనివాడేమీ కాదు . వాళ్ళలా వజ్ర సంకల్పుడు కాదు. సౌకుమార్యం కూడా భయపడేంత సుకుమారుడు. అన్నీ శూన్యమనీ తెలిసీ అన్నిటిపట్లా మమకారంతో అల్లాడే తావో రుషిల కోవకు చెందుతాడు. ఒకచిన్ని తావో కథ . అన్నీ భ్రాంతి అంటూ శిష్యులకు చేప్పే గురువుగారు, పసివాడయిన ఒకే ఒక కొడుకు చనిపొతే ఆయన బావురుమని విలపించాడు. అన్నీ భ్రాంతే కదా అని శిష్యులు అడిగితే ‘నిజమే ఒప్పుకుంటాను, కానీ వీడు ఎంత అందమైన భ్రాంతి ‘ అన్నాడట.

అందమైన భ్రాంతుల కోసం అల్లాడే అర్థస్వప్న సంచారి శిఖామణి . ఉనికిని కోల్పోవడంలో వుల్లాసం పొందే ఒకే ఒక కవి శిఖామణి . అందరూ ఉనికి కోసం తపిస్తారు. అన్వేషిస్తారు. తమ అహంకారానికి ఆకారమిస్తారు. శిఖామణి తనలో సుళ్ళు తిరుగుతాడు. బయటి ప్రపంచంలో అతని బాధలకు సమాధానాలు లేవు. రావు. కాని అతని అంతరంగంలోనూ అధారాలు లేవు. లేనిదానితో తృప్తి పడటం ఒక వింత అనుభవం.!

అలల చేతులు వూపుకుంటూ
సుషుప్తి సముద్రంలో కలిసిపోయి
నాఉనికిని పోగొట్టుకుంటాను
నన్ను నేను పోగొట్టుకోవడంలో గొప్ప తృప్తి

మహాశూన్యమన్న కవిత అంతా ఆకారంలేని తమ పాంచభౌతిక రహస్య పొరల్లో దాగి ఆవిర్భవించే ప్రతీదానికి ఆకారమవుతానంటాడు.

ఎక్కడో అతని మనసు మూలల్లో మానవత్వం పట్ల , ప్రేమ పట్ల బలమైన నమ్మకముంది.తనని తను కోల్పోతున్నప్పుడు అది తల్లిలా తలుపు తడుతుంది. తను ఇతరులకు ఉపయోగపడ్డంలో తను వునికి కోల్పోయినా సంతోషమే అంటాడు.

ఒక్కోసారి నేను భూమినై పోతాను
ఒక వాన చినుకు పడి నాలో దాగున్నఏ విత్తనమో తడిచి, నాని, ఉబ్బి
అప్పుడు తానుగా పగిలి నన్ను పగలగొట్టుకుంటూ పైకి వస్తుంది.
అప్పుడు బిడ్డకు స్తన్యమిచ్చిన తల్లిలా సంబరపడిపోతాను అంటాడు.

అంతలో ఆశ,ఇంతలో నిరాశ. అతనికి నిశ్చింతలేదు. సుఖదుఃఖాలు బతుకులో భాగాలు.జీవన్మరణాలు జీవితంలో అనివార్యాలు. కానీ ఈ కవి వీటికి వేటికీ సంబంధించిన వాడుకాదు. అతను అనంత శూన్యంలో ఒక భాగం. శూన్యంలో భాగాలుండవు కాబట్టి అతను అనంత శూన్యమే. అనంతశూన్యానికి స్వ పరభేదాలుండవు.అందుకనే

ఒక్కోసారి నేను ఆకాశాన్ని, మహాశూన్యాన్ని అయిపోతాను
ఎంత ఎత్తుకు చూసినా, ఎంతకిందకు చూసినా అంతాలోతే
ఎక్కడికి వెళ్తున్నాన్నేను?
ఎంత గుర్తిద్దామన్నా జీవితం గ్రాఫులో జననమరణ రేఖలు స్పర్శించిన
బిందువు కనిపించడంలేదు.
… … …   … … …
దిగంత రేఖలా నాకు నేను కనిపిస్తున్నట్టే కనిపించి
నాకు నేనే అదృశ్యమైపోతుంటాను అంటాడు

ఈ వింత అనుభవానికి లోనయిన వాళ్ళు ఆ అనుభవం ముందు ధైర్యంగా నిలబడలేరు. రాజకీయ వాదులవుతారు.సైంటిస్టులవుతారు. గొప్ప గజదొంగలవుతారు. నియంతలవుతారు. యింకా ఏమేమో అవుతారు. తమ శూన్యాన్ని పూరించడానికి కోటీశ్వరులవుతారు. ఆద్యంతాలూ ఖాళీగా వున్నయితనికి వాటితో లాభంలేదు. అందుకని కవి ఐపోయాడు. కవిత్వంతో ఇతర్లని లొంగదీసుకోలేం.కవిత్వం కన్నీటి తెరలాంటిది.మంచుపొరలాంటిది. శ్రీనాథుడు చెప్పినట్లు ‘అస్తినాస్తి విచికిత్సా శాతోదరి’! వుందనుకుంటే వుంది! లేదనుకుంటే లేదు! శిఖామణి అంతే! వున్నాడనుకుంటే వున్నాడు! లేడనుకుంటే లేడు!

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో