నిప్పు రెక్కల పక్షి: మాయా ఎంజెలో

Maya Angelou
Maya Angelou

మాయా ఎంజెలో అంటే కేవలం కవిత్వం కాదు, వొక ఆగ్రహ కెరటం.
ఆమె పదాలు సున్నితంగానే వుంటాయి, కాని వాటి లోతు కత్తి లోతు.
ఆమె వచనం సూటిగానే వుంటుంది, కాని, ప్రతి వాక్యం వొక వుద్విగ్న కెరటం.
ఇక…మాయ ఎంజెలో గొంతు విప్పిందా…వుద్రిక్త కవిత్వమూ, నగ్న వచనమూ కలిసి విరుచుకు పడే సముద్రం.

ఆ సముద్రాన్ని అతి దగ్గిరగా చూసిన అనుభవం గత ఏడాది మిగిల్చిన గొప్ప అనుభూతి. టెక్సస్ యూనివర్సిటి బాల్ రూంలో వెయ్యి మందిని మూడు గంటల పాటు ఆమె తన మాటల పెను తుపానులో ముంచెత్తిన ఆ రోజు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతుంది. “పంజరంలో పక్షి ఎందుకు పాడుతుందో నాకు తెలుసు” అంటూ ఆత్మ కథనంతో సాహిత్యలోకంలో రెక్కలు తెగిన నల్ల పక్షుల బతుకు పోరాటాన్ని అక్షరాల్లోకి అనువదించడం మొదలెట్టిన మాయా ఆ తరవాత అమెరికన్ కవిత్వంలోకి సాహంకారంగా నడిచి వచ్చింది. తెలిసీ తెలియని వయసులో అత్యాచారానికి గురయిన వొక నల్ల పిల్ల మగలోకపు లోహ వదనం మీద పిడి బాకులు దూసింది. “కవిత్వం ఏం చేస్తుంది? అన్న ప్రశ్నకి తాపీగా సమాధానం వెతుక్కునే తీరిక లేని ఆమె తన జీవితంలోని ప్రతి అణచివేయబడిన క్షణాన్ని, గుండె మీద గాయంలా సలుపుతూ వుండగానే, మళ్ళీ కొత్త గాయాలు తెరుచుముంటూ వుండగానే, తన ముఖం మీద చిమ్మిన నెత్తురుని కణ కణ మండే పదాల్లోకి మార్చింది. పదునెక్కిన పదాల మాయా ఎంజెలో కవిత్వం చదవడం, ఆమె సంభాషణల వెచ్చని అగ్ని స్పర్శని తాకడం నల్ల స్త్రీల వుద్యమాల విజయం. ఆమె కవిత్వ్వం చదువుతున్న ప్రతీ సారీ నాకు నేను ఎప్పుడో రాసుకున్న “ఇక్కడ ఇప్పుడు ప్రతి వుదయం/ సూర్యుడు నల్లగానే పుడతాడు” అన్న వాక్యం గుర్తొస్తుంది.

తెగిన రెక్కల పాట

రెక్కలున్న పక్షి
స్వేచ్చ దొరికిన పక్షి
గాలి వీపు మీద గంతులేస్తుంది
ఏటి చివరంటా
ఈదుకుంటూ వెళ్తుంది
సూర్యుడి కిరణాల నారింజ రంగుల్లో
రెక్కలు తడుపుకుంటుంది.
ఆకాశం మీద హక్కుని చాటింపు వేస్తుంది.

కాని,
పంజరంలో పక్షి
కనీసం వూచలనయినా చూడలేదు
రెక్కలు తెగి
కట్టి పడేసిన కాళ్ళతో
గొంతు విప్పుతుంది పాడాలని.

భయోద్రిక్త స్వరంతో
పాడుతుంది పంజరంలో పక్షి.
తెలియని లోకాల తెలియని వూసులతో,
వుద్విగ్న నిరీక్షణల నిర్వేదంతో.

ఏ దూరపు కొండల మీదనో
వినిపిస్తుంది దాని పాట.

స్వేచ్చ కోసం
విచ్చుకున్న దాని గొంతు.

రెక్కలున్న పక్షి
స్వేచ్చ దొరికిన పక్షి
మరుసీమల మలయసమీరాల్ని కలవరిస్తుంది.
నిట్టూర్పు వనాల మెత్తని గాలిని పలవరిస్తుంది
ఆకాశం తనదే కనక -

మరి
పంజరంలో పక్షి
కలల సమాధి మీద నిలబడ్తుంది.
పీడ కలల వెర్రి కేకల్ని
ఘోష పెడ్తుంది.
ఇంకే దారీ తెన్నూ లేక
గొంతు విప్పుతుంది ఆకాసంలోకి.

భయోద్విగ్న స్వరంతో
పాడుతుంది పంజరంలో పక్షి.
తెలియని లోకాల
తెలియని వూసుల
నిరీక్షణల అంచుల పాట.

దూరాల్ని
తాకేలా…..!

ఒక అభిప్రాయం »దర్వాజ

One Response to “నిప్పు రెక్కల పక్షి: మాయా ఎంజెలో”

  1. 1
    బొల్లోజు బాబా Says:

    అనువాదం అద్బుతంగా ఉంది

    కొన్ని చోట్ల…..

    ఆకాశం మీద హక్కుని చాటింపు వేస్తుంది
    and dares to claim the sky

    భయోద్విగ్న స్వరంతో
    పాడుతుంది పంజరంలో పక్షి.
    The caged bird sings
    with fearful trill

    పై వాక్యంలో భయోద్విగ్న అన్న పదబంధం ద్వారా కవిత యొక్క ఆత్మ ఆవిష్కరింపబడింది.

    చాన్నాళ్ల క్రితం మాయా వ్రాసిన స్టిల్ ఐ రైజ్ అనే కవితను అనువదించాలని ప్రయత్నించి మాతృకలోని ఫోర్స్ అనువాదంలోకి రావటం లేదని విరమించుకొన్నాను.

    ఇప్పుడు ఈ కవిత చూసాకా ఆ కవితను అఫ్సర్ గారి కలంగుండా చదవాలనిపిస్తూంది.
    ఆ కోరిక తీరే రోజు వస్తుందని ఆశిస్తూ….

    బొల్లోజు బాబా

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో