పశ్చాత్తాపం

నేను నా అనుభవం నుంచి తప్ప యింక దేంట్లోనూ విశ్వాసం కల్గించుకోను. నాకు ప్రపంచమంటే నేను, నా ఆలోచనలు, నా అనుభవాలు మాత్రమే! దానికి పరిసరాలు కొందరు వ్యక్తుల ప్రభావం వుండవచ్చు. నాకు కల వాస్తవం రెండూ ఒక్కటే. నా భావనలో జీవితం అంటే ఏదో అర్థము సంబంధం కనబడే ఒక కల.

సాంవత్సరిక ఎప్రైజల్ రివ్యూలో వెంకట్ నా ఎదురుగా వున్నాడు. అతని పని తీరు నిర్థారించాలి. చాలా పూర్ రేటింగ్ వుంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్ స్క్రూటినీ బాధ్యత నాది.

అతని ఇంటిపేరు (సర్ నేమ్) చూసి ఆశ్చర్యపోయాను.

” మీరు శ్రీధర్ శర్మ గారి అబ్బాయి కదా?” అడిగాను. ఆశ్చర్యంతో చూసాడు.

“మా నాన్నగారు మీకు తెలుసా?”

“తెలుసు, మీరు కూడా తెలుసు”

“అరే! ఆశ్చర్యంగా వుంది . మీరు గుర్తుకురావటంలేదు. మీరు యు.యస్.బేస్డ్ గదా! మిమ్మల్ని నార్త్ ఇండియన్ అనుకున్నాను మీ పేరు చూసి ” ఆశ్చర్యంగా కదిలిపోయాడు.

“అమెరికన్ సిటిజన్ షిప్ వున్నా, అమెరికాకు అనువుగా రీ నేమ్ చేసుకున్నాను”

“సర్ ప్రైజ్ టు మీ”

“మాష్టారు గారు ఎలా ఉన్నారు, ఎక్కడ వున్నారు”

” వారు వెళ్ళి పోయి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది స్వల్ప అనారోగ్యంతోనే వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా పరిస్థితి బాగాలేదు. ఎంతో అటాచ్ మెంట్, జీవితంలో శూన్యం వెలితి ఏర్పడింది.కర్మాంతరాలుకి కూడా వెళ్ళలేకపోయాని ఐ యామ్ గిల్టీ. నా పూర్ పెర్ఫామెన్స్ కు కారణం అదే! కోలుకోలేకపోతున్నాను. డీప్ లీ డిస్ట్ర్సెడ్” దీర్ఘంగా నిట్టూర్చాడు వెంకట్.

కొద్ది సేపు గదిలో మా మధ్య నిశ్శబ్దం పరుచుకుంది . కాఫీలు వచ్చాయి ,ఆఫర్ చేశాను.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ” నిజం చెప్పనా, ఇప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని సమాంతరంగా చూడటం చేతగావటంలేదు. ఇక ఈ కార్పో రేట్ కెరీర్ నాకు సాగదేమో అనిపిస్తోంది.” అంటూ ముఖాన్ని చేతులతో కప్పేసుకున్నాడు . చాలా డిప్రె స్డ్ గా మాట్లాడాడు.

కాలేజ్ లో ఒకనాటి నా రోల్ మోడల్ వెంకట్!!

ఇతనా ఈ విధంగా మాట్లాడుతున్నది.వారి నాన్నగారి ప్రభావం , ఆత్మీయులు అంతగా కృంగ దీసిందా , కర్మలకు అటెండ్ కాలేదనే బాధనా??

నా మదిలో అలజడి …. నాన్న … నాన్న … అడిగిన చిన్న కోర్కే …..?? మదిలో చెలరేగింది.

*******

గత జీవితం దారిద్ర్యం కసిరిన చీకటీ , ఙ్ఞాపకాల దొంతరల పొరల మధ్య నుంచి నిర్మలానుభవాలు గ్రామీణవాతావరణం నుంచి కాలేజీ చదువుల కోసం పట్టణానికి కుటుంబ వలస . ఏదో కాంతి కోసమై పరుగెత్తుతున్నట్లు యాంత్రిక ప్రపంచంలోకి దూరి పోతున్నట్లుగా వుండేది. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు, కొత్త మనుషులు అది నా ఉపనయనం తరువాత పంచశిఖలతో కాలేజీ ప్రవేశం. పంచశిఖలతో వున్నానా తలను అందరూ తడుముతూ వెళ్ళేవారు. అందరూ రౌడీవెధవల్లా కనబడే వారు. ఏడుపు వచ్చేది తాతయ్య దగ్గర రోజూ పేచీ. ఆయన వొప్పుకొనే వారు కాదు. నాన్న నిస్సహాయంగా వుండిపోయేవాడు.” మూడు నెలలు ‘ముంజ’ విడుపుదాకా ఆగునాన్న ” అని సముదాయించేవాడు. నాన్నకు ఆస్తిక భావం అలవాటు చేయాలని తాపత్రయం అవగాహన చేసుకొనే శక్తి ప్రారంభం కాకపూర్వం దైవభక్తికి సంబంధించిన కొంత వాఙ్ఞ్మయం నోటీకి వచ్చేటట్లు మౌఖికంగా కృష్ణశతకం,నృశింహశతకం , శ్యామలా దండకం ‘ నేర్పేవారు

సర్గలకు, సర్గలు ఆయన అడిగినప్పుడల్లా గడగడా అప్ప జెప్పితే మహా సంతోషపడిపోయేవారు.

ఉదయాన్నే రఘురామా, రామచంద్ర, రామయతండ్రి ప్రేమాన్వితంగా పిలుపులతో మేల్కోలిపేవాడు నాన్న. ఆయన గొంతు కమ్మగా వుండేది. వినాలని వుండేది. నిద్రలేవనట్లు దొంగనిద్రలో వుంటే, ‘తెల్లవారగవచ్చె , తెలియననాసామి మళ్ళి పరుండేవులేరా! మళ్ళీ పరుండేవులేరా! అనే పాటను బహురమ్యంగా పాడేవారు ‘ లేరా కన్నా’ అని చక్కిలిగింత పెట్టి కిలకిలమని అనిపించేవారు.

ఎవరికి వారు వారి వారి సంస్కృతిని బట్టి వారి అనుభవాల్ని బట్టి తనదైన సిద్ధాంతం అలవరుచుకోవడం మంచిది అనే నమ్మిక నాన్న కుండేది. నాన్న వ్యక్తిగత జీవితం అందరి కంటే భిన్నంగా కనబడేది.

టెన్త్ లో మంచిమార్కులు పాస్ కావడం, పట్నంలో కాలేజీ చదువు నాన్నను కొంచెం అనివార్యానికి గురిచేసింది. అంతంత మాత్రం ఆర్థిక స్థితిగతులు ఒక్క కుదుపు కుదిపాయి. చదివించాలనే నాన్న దీక్ష , నేను మరింత అంకితమై చదివేందుకు దోహదం చేసింది. అందరూ ట్యూషన్లు చేరుతున్నప్పటికి నేను చేరలేదు. అక్కడ వెంకటేష్ పరిచయం వెలుగుచూసింది.

వెంకటేష్ మాకు సీనియర్. ఆ సంవత్సరం కాలేజీ ఫస్టు .అందరూ ఆయన్ని అభినందిస్తూంటే చాలా ముచ్చటేసింది. నేను కూడా ఫస్టు వస్తే అభినందిస్తారు కదా ? ఆయనకు దూరంగా అనుసరించి తిరుగుతున్నాను. లెక్చరర్లు , ఆడపిల్లలు అందరూ అభినందించారు. ఆయనతో మాట్లాడాలనే కుతూహలంతో అభినందిస్తూ చేయి చాచాను. చేయి అందుకొని నా దగ్గరగా వచ్చాడు.

” రండి , కాంటీన్ కు వెళ్దాం. మిమ్మల్ని గమనిస్తున్నాను చాలా సేపటినుంచి ఇక్కడే వున్నారు. ” భుజం మీద చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు.

“కాలేజి ఫస్టు వచ్చారు కదా ? మీరు ఎట్లా చదివేవారు ట్యూషన్లు ఎవరి దగ్గర ” ఆసక్తిగా ప్రశ్నించాను.

” ఎవరి దగ్గరా ట్యూషన్లు చేరలేదు. కేవలం టెక్ట్స్ పుస్తకాలు చదివేవాణ్ణి, గైడ్స్ అసలే ఫాలో కాలేదు ఏ రోజు పాఠం ఆ రోజే ఫినిష్ చేసేవాణ్ణి” చాలా తేలికగా చెప్పాడు.

అదే సూత్రం పని చేసింది నాకు కాలేజ్ ఫస్టు రావడానికి. ఇంటర్ కాలేజ్ ఫస్టు వచ్చానని నాన్నకు చెప్పినప్పుడు ఉప్పొంగిపోయాడు . ఆ వెంటనే మౌనంగా వుండిపోయాడు. తరువాత అమ్మతో నాన్న అంటున్న మాటలు వినపడినై ఇప్పుడేం చేయాలి ? ఇంజనీరింగ్ పెద్ద చదువు . ఎంత స్కాలర్ షిప్ వచ్చినా అరకొరగానే వుంటుంది” నాన్న అన్నాడు.

” పాలెంలో నా పుట్టింటివారిచ్చిన పొలం వుంది కదా? అన్నయ్యకు చెప్పి అమ్మించేద్దాం. బిడ్డ కంటేనా ” అమ్మ అంది. అమ్మ మాటకు మధ్యలోనే అందుకుంటూ ” దానికెంత వస్తుందే? నాలుగేళ్ళు చదువంటే మాటలా?

” ఎంతో కొంత ! ఆ తల్లి దయ చూపదా? వూరిలో ఇల్లు వుంది కదా! కూడితే అది కూడా అమ్మేద్దాం ! ” నిశ్చయంగా అంది.

ఎందుకు సిద్ధపడుతున్నారు. వున్న ఇంటిని కూడా అమ్మడానికి సిద్ధమౌతున్నారు . మనసులో చాలా బాధవేసింది.

ప్రిన్స్ పాల్ గారి ప్రోద్బలంతో కర్నూలు సిల్వర్ జుబ్లి కాలేజ్ లో బి.కామ్. చేరడంతో నాన్న మీద ఎటువంటి ఆర్థిక వత్తిడి నాపరంగా పడలేదు. పూర్తిగా రెసిడెన్షియిల్ కాలేజ్ కావడంతో కొంచెం వెసులుబాటు అయింది,ఇంజినీరింగ్ వెళ్ళలేదనే దుగ్ధలేదు.

ఏ విధమైన ఇతరేతర సంపాదన లేకపోవడంతో నాన్న అమ్మ పల్లెకు మారారు.

ఆంధ్రా యూనివర్సిటీ లో యం.కామ్ ఫుల్ స్కాలర్ షిప్ తో పూర్తి అయ్యింది. అక్కడ నుంచి అహ్మదాబాద్ I.I.M లో జీవితం ఓ మెరుపులోకి ఒదిగిపోయింది. అక్కడ నుంచి నా జీవన ఫిలాసఫీ నా బాణిలో నిర్దేశితమయ్యింది.

వెనక్కి తిరిగి చూచింది లేదు. క్షణం క్షణం బిజీ బిజీ . 1990 దాకా స్తబ్దుగా వున్న కంప్యూటర్ , సాఫ్ట్ వేర్ సాంకేతిక పరిఙ్ఞానం, దాని ఎవల్యూషన్ Y2K పుణ్యమాని 1995 నుంచి పుంజుకుంది. ఎవరూ మొగ్గుచూపని సమయంలో నేను అప్లై చేసుకోవటం మంచి సహచరుల తోడ్పాటు 2000 సంవత్సరంనుంచి విజృంభించింది. ఎవరూ వూహించని మలుపు. అదృష్టం స్వయం కృషి మంచి టైం ఏర్పడటంతో విజయవంతం కావడం ఇక డిగ్రీలు, ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబన స్వేచ్చ పొందినప్పటికి ,ప్రాకృతిక స్వేచ్చ కోల్పోవడం , బిజీ వలయంలో కూరుకుపోవడం.

న్యూజెర్సీ, డాలస్ , సిలికాన్ వాలీలలో ప్రాపర్టీ కొనుగోలు జరిగింది. అమ్మ నాన్నలను ఇక్కడే వుండమంటే ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు, వ్యక్తి పర తంత్రతకు ఆత్మీయరాహిత్యానికి ఇక్కడ ఉండటానికి ఇష్టంకాలేదు. వత్తిడి చేయలేదు, పాలెం లో వుండేందుకు మొగ్గు చూపారు. పాలెం ప్రశాంత వాతవరణంలో నాన్న పద్యం చదువుతుంటే మేఘంవురుముతున్నట్లు వుండేది. సాహిత్య వాసనలు లేవుగాని చాటు పద్యాలు, సామెతలు పొంకంగా చదివే వారు జనం చేరి వింటుంటే వారు. అదే కాల క్షేపం ఆయనకు.మాట్లాడేందుకు మనుషులు దొరకటంలేదని తన సమ వయస్కులు ఒక్కొక్కరు కాలం చేస్తున్నారని నాన్న వాపోయాడు.

మాట్లాడేందుకు ఎవరినైనా కుదుర్చమని అడిగాడు మారిన పరిస్థితులలో ఒక సంసారము యొక్క సకల దుఃఖతాపములకు తట్టుకొని నిలువగలిగిన నాన్న ధర్మస్వరూపుడుగను మంగళస్వరూపుడుగను నలుగురిలో ప్రకాశవంతంగా వున్నాడు.

జీవితం సంపూర్ణమయితేనే జీవితంతో అవసరం తీరుతుంది. కర్మ యొక్క సమాప్తి అయినప్పుడు కర్మ బంధనాలు శిధిలవుతాయి. పితృదేవతలకు కాశీ , గయ బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేసుకొవాలని నాన్న అడిగాడు చాలా ఏళ్ళయింది.

” అంతే గదా , అలాగే చేద్దాం” అన్నాను కాని సమయం లేక వీలు కాలేదు. ఆయన కోర్కె అలాగే వుండిపొయింది. ” ఒకటి రెండు సందర్భాలలో వూరిలోని వారు ఎత్తి పొడుపుగా అంటున్నారురా! ” అని వేదనగా అన్నారు.

డాలరు వృద్ధిలో రాత్రింబవళ్ళు ఒగరుస్తూ ఇంకా, ఇంకా అనిఘోషిస్తూ, అన్వేషిస్తూ ఆకాంక్ష అనే గుర్రంమీద దౌడు తీస్తూ ఎన్ని పొందినాగాని తృప్తిలేని జీవితం. ఆరంభం నుంచి అంతం దాకా ! ఇదే అప్పుడే ఇక్కడే తతఃకిం ? తతఃకిం? విమర్శన మొదలయ్యింది.

చిన్నప్పటి శ్లోకం “ఈశావాస్యమిదంసర్వం” గుర్తుకు వస్తుంది. ఈ సంసారంలో నడుస్తున్న సర్వము ఈశ్వరునిచే ఆచ్చన్నమైవున్నది.

ఇప్పుడు ప్రపంచం ,డాలరు యొక్క దట్టమైన్ ధూళితో కప్పబడింది.

“తేన వ్యక్తేన భుంజీధః”

ఇక నాన్న కోర్కే తీర్చడం అవశ్యకర్తవ్యం క్షణం ఆలస్యం చేయను.

*******

తెర తీయని ఙ్ఞాపకాలతో చీకటి ఙ్ఞాపకాలు. ఇద్దరం శిధిల మనస్కులమయ్యాం. అవగాహనకు అతీతంగా అంతర్లోకాలలో తిరిగి తిరిగి ఇద్దరి మనస్సులకు స్వేదంచిందింది.

లౌకికనైమిత్తికం

మరలా ముఖానికి కార్పోరేట్ మాస్కులు ………..

నాలుగైది టెక్నికల్ పాయింట్స్ తో వెంకట్ తో మీటింగ్ ముగిసింది.

అభిప్రాయాలు లేవు »కథలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో