Oct2009
తెలంగాణ కవిత్వ సంకలనానికి సహకరించంరి
నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యం అని గొల్కోండ పత్రికలో అధునిక భావ కవిత్వ తత్వ శీర్షికలో శ్రీ ముడుంబా వేంకట రాఘవాచార్యులు రాసిన వ్యాసాన్ని చదివి ఇక్కడి కవి అయిన సురవరం ప్రతాప రెడ్డి ఆ మాటలకు ధీటుగా కవితా సంకలనం తీసుకువచ్చారు. ఈ సంచికలో 354 మంది కవుల రచనలు వెలువడ్డాయి. ఆ సంచిక వెలువడిన తర్వాత గొప్పగొప్ప కవి పండితులు వచ్చినారు. ప్రస్తుతానికి తెలంగాణా వచన కవులతో పాటు పద్య కవులకు లోటు లేదు. తెలంగాణా రాష్ట్ర సాధనలో భాగంగా ఒక పద్య కవిత్వ సంకలనం తేవాలని నిర్ణయించుకున్నాము. ఈ పుస్తకం కొరకు అందరి సహాయ సహకారాలు అందజేయగలరని కోరుతున్నాము. మరిన్ని వివరాలకు వేముగంటి మురళీ కృష్ణమాచారిని (+91. 94920 60843) సంప్రదించగలరు.
అభిప్రాయాలు లేవు »సాహిత్య ప్రకటనలు