November 2009 సంచిక

రెడ్ సెల్యూట్ బాల గోపాల్!

ఈ విశ్వం తన అనంత అంశంలో
ఈ నిమిషం విషాద భరిత చరిత చరణ చరమ గీతం పాడింది

నిబద్ధ కార్యశీల, నిత్యసత్య పోరాటాల యోధుడు
కొత్తసృష్టి తపశ్శీలి … … … ఓ
నూతన మానవ ప్రాణి మీద … … … ఈ
విశ్వం తన అనంత అంశంలో
ఓ నిమిషం విషాద భరిత చరిత చరణ చరమ గీతం పాడింది

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

చెప్పు చెప్పేది

వేల యోజనాల దూరం ప్రయాణించాక
అందిన ఉత్తరాల కవరుకి
అంటించిన జిగురు ఇంకా పచ్చిగానే వున్నట్టు…
సలపరించే గాయాలు పోస్ట్ చేసిన వాడికి
తిరుగుటపాలో చెప్పు దెబ్బ రావడం
చెప్పక చెప్పేది ఏమిటంటే… మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

మాదిగ భగత్సింగ్

పోగుల కుప్పల్లో జరిగిన మోసం
ఎన్ని పావురాల్ని నేలరాల్చిందో……..

జాంబవంతుడు
గాంధీభవన్లో తగలబడ్డాక
చెన్నని కండ్లు సల్లబడ్డయ్ మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »కవితలు

మనిషి అతని చిరునామా

జీవితమై ప్రవహించడమే అతనికి కవిత్వం
సమానత్వం దిశగా విస్తరించే
మనిషి అతని చిరునామా
కాయకష్టం చేసే మూకంతా బంధుగణం! మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

నీవు వదలిన నీ నీడల జాడలో

ఈ విశాల జీవన ఎడారితోవలో
నీవు వదలిన పాదముద్రలను వెతుకుతూ
అనంత తీరాల వెంబడి అన్వేషణ సాగిస్తున్నా….. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

చూద్దాం

నాలుగ్గోడల మధ్యలోంచి
సరాసరి బయటకొచ్చి
నేలపైన
ఆకాశం కిందనిలబడాలి
ఎండనో, వర్షాన్నో
గాలినో, సహ మానవ స్పర్శనో
శరీరం పైన పడనివ్వాలి మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

నేను వివస్త్ర భూమిని

నేను పోలేపల్లిని
నాయింటినుండి గెంటివేయబడి
నన్ను
రారమ్మని ప్రియంగా పిలుస్తున్న
స్మశానం వైపు
వేగంగా పరిగెడుతున్న కుంటివాన్ని మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

దిగులు గీత

సూర్యుని తొలికిరణం
ముందుగా నిన్నే సోకిందా, అనామికా..
విడవలేక వెళ్తున్నట్టు
మలి సంధ్యలోని ఆఖరి కిరణమూ అంతే… మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

భూమి పుత్రుడు

సింగరేణి మేనేజ్ మెంట్ గోదావరిఖని ఓసిపి రెండు విస్తరణలో భాగంగా అక్కెపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జూన్ 28 నిర్వహించిన సభను ప్రజలు వ్యతిరేకించారు.

ప్రజాభిప్రాయసేకరణ సభ సందర్భంగా మేనేజుమెంటు భారి ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. అయినా ప్రజాప్రతిఘటనను పోలీసులు అడ్డుకోలేక పోయారు. పోలీసు అదిరింపులు బెదిరింపులు పనిచేయలేదు. ఉదయం పదిగంటలకు సమావేశం జరుగుతుందని ముందే ప్రకటించటం జరిగింది. ఇటువంటి అల్లర్లు జరుగుతుందని ముందే ఊహించటం వల్ల మేనేజిమెంటు ముందే పోలీసు బలగాలని మొహరించింది అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రజల ఆగ్రహం ముందు పోలీసుల నిరుత్తులైపోయారు. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కథలు

తెలంగాణా కథల్లో రైతు జీవితం

తెలంగాణా కథా రచయితల్ని ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ రకమైన విభజన వరంగల్ జిల్లా కథా రచయితలకు మినహాయింపేమీ కాదు. వరంగల్ జిల్లాలో పుట్టి అక్కడే పెరిగి, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కథా రచయితలు. ఉదాహరణకు అంపశయ్య నవీన్, కోవెల సుప్రసన్నాచార్యులు, బుర్ర రాములు, రామా చంద్రమౌళి మొదలైనవారు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

ప్రజల సాహిత్యానికి ప్రాణం ప్రజల భాష
(భాషపై కొ.కు)

సాహిత్య రూపాలుగాని, ప్రమాణాలు గాని, ఆశయాలు గాని కాలానుగుణంగా మారుతూ వచ్చినట్లే సాహిత్యానికి సంబంధించిన సమస్యలు కూడా మారుతూ వస్తాయి. ప్రజల భాష ప్రజల సాహిత్యం అనేది ఈ కాలపు సమస్య.
- కొడవటిగాంటి కుటుంబరావు, కళలు – శాస్త్రీయ విఙ్ఞానం

గురజాడ , గిడుగుల తర్వాత తెలుగునేల మీద భాష గురించి, అందునా సాహిత్య భాష గురించి ప్రజాస్వామికంగానూ, శాస్త్రీయంగానూ ఆలోచించిన అరుదైన రచయిత కొకు 1930 ల్లో కలం పట్టిన తొలినాళ్ళనుంచి 1980 వరకూ అనేక సందర్భాల్లో కొకు భాష గురించి రాసిన వ్యాసాలూ, వ్యక్తం చేసిన అభిప్రాయాలు గతితార్కికంగా భాషని అధ్యయనం చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

మహిళా సాహిత్య విమర్శకులతో కుసుమకుమారి

మొదటి నుంచి తెలుగుసాహిత్య విమర్శకులలో మహిళల సంఖ్య పరిమితంగానే ఉంటున్నది. విశ్వవిద్యాలయాలలోగాని, బయటసాహితీ రంగంలోగాని ఇదే పరిస్థితి. అయినప్పటికీ, ఉన్నదేదో ఉన్నట్లు సాహిత్య విమర్శ రాస్తున్న మహిళలలో అనేకులు గట్టివారే వున్నారు. ఇప్పటిదాకా మనకు లభిస్తున్నా మహిళాసాహిత్య విమర్శకులను నాలుగుతరాలుగా పేర్కొనవచ్చు. ఉట్కూరు లక్ష్మీకాంతమ్మ, పి. యశోదా రెడ్డి, నాయని కృష్ణకుమారి వంటి అతి తక్కువ మంది తొలి తరం వాళ్ళు. లక్ష్మీకాంతమ్మ రచించిన “ఆంధ్ర కవయిత్రులు” తెలుగు రచయిత్రుల చరిత్ర రచనకు జరిగిన తొలి ప్రయత్నం. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

ప్రపంచీకరణవాద కవిత్వం

ఇది ప్రపంచీకరణ కాలం. అంటే ప్రపంచమంతటినీ ఒక్కతాటిపై కలగలిపి ఏకంచేస్తున్న తరుణం.ఏ దేశాల మధ్యనైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యాపారాన్ని కొనసాగించవచ్చునని దీని భావం. ప్రస్తుతం’ స్వేచ్ఛా వాణిజ్యం ‘ పేరిట దీనిని వ్యవహరిస్తున్నారు. వస్తువులు, పెట్టుబడులు, ఉత్పత్తి, సాంకేతిక విఙ్ఞానం ఒక దేశం నుండి మరొకదేశానికి తరలిపోవడం అనే అర్థంలో ప్రపంచీకరణని వాడుతున్నారు. ఇది నేడు బహుముఖాలుగా విస్తరించి పలుపార్శ్వాలతో మనల్నిచుట్టుముడుతోంది.

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

ఒక వీరశైవ, ధీర సూఫీ అర్ధనారీ ‘స్వరం’ : నీలం మాయ

అయిల సైదాచారి మనకు కొత్త కాదు. అతని కవిత్వం ఇంతకు ముందే మనకు తెలుసు. అందరికీ తెలిసిన అందరూ మరచి పోవాలనుకునే వొక అనుదిన నేపథ్యం నించి సైదా చారి కవిత్వ అనుభవ మంటపంలోకి ప్రవేశించాడు. అతని కవిత్వం మొదటి సారి చదివినప్పుడు ఇది వొక భిన్నమయిన భాష అని మనకి వెంటనే అనుభవమవుతుంది. కాని, ఆ అనుభవం మనల్ని అంత తేలికగా వూపిరదనివ్వాడు. మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »దర్వాజ

కౌముది రచనల కోసం విజ్ఞప్తి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో జన్మించి, కమ్యూనిస్టు వుద్యమంలో భాగస్వామి అయి, హిందీ పండితులుగా అటు ఉత్తరాదిలోనూ, తెలుగు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకులుగా ఇటు తెలుగు నాట పేరు గడించిన వ్యక్తి కౌముది. అభ్యుదయ రచయిత సంఘంలోనూ, ప్రజా నాట్య మండలిలోనూ కౌముది క్రియాశీల కార్యకర్త. హిందీ- తెలుగు భాషల అభ్యుదయ సాహిత్యాల మధ్య సేతువు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య ప్రకటనలు

కల్లోల కాలంలో అల్లిన కావ్యం ‘మగ్గం బతుకు’

అప్పటిదాకా రాయలసీమకే పరిమితమనుకుంటున్న కరువు 2000 – 2003 సంవత్సరాలలో రాష్ట్రమంతా పాకింది. అభివృద్ధికి మారుపేరైన గోదావరి ప్రాంతంలో కూడా పైర్లు ఎండిన వాస్తవాన్ని గమనించాం. అప్పటిదాకా కరువు వస్తే జనం పొట్ట చేతబట్టుకొని వలసలు పోవడం, పశువులకు మేత లేకుంటే కబేళాలకు అమ్మేయడం చూశాం. కాని ఈ కాలంలో వచ్చిన మార్పు రైతులు, చేనేత వృత్తికారులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలి, అప్పులు కలిసి బతికున్న మనిషిని నిలువునా శవంగా మార్చడం ఏ జాతికైనా తలవంపులు తెచ్చేదే. ఈ ఆత్మహత్యల దుష్పరిణామం తెలుగు రాష్ట్రాన్ని అట్టుడికించింది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

కథను గురించి కె.పి

తెలుగుకథా సాహిత్య విమర్శ 21వ శతాబ్దంలో ముందంజలో ఉంది. కవిత్వ విమర్శ కంటే కథా సాహిత్య విమర్శ సమకాలీన యుగంలో విస్తృతంగా వస్తున్నది. కథను గురించి లోతైన విశ్లేషణలు, ఆలోచనలు విరివిగా వస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలో వెయ్యి కథలు వస్తే సుమారు పది పదిహేను కథా విమర్శన పుస్తకాలు, విరివిగా వ్యాసాలు వస్తున్నాయి. సమాజంలోని వ్యక్తులు ఆవేశాంతరంగం కంటే ఆలోచనాంతరంగం వైపు ఈనాడు దృష్టి సారిస్తున్నారు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

Next »