Nov2009
చూద్దాం
నాలుగ్గోడల మధ్యలోంచి
సరాసరి బయటకొచ్చి
నేలపైన
ఆకాశం కిందనిలబడాలి
ఎండనో, వర్షాన్నో
గాలినో, సహ మానవ స్పర్శనో
శరీరం పైన పడనివ్వాలి
కలలు కనటం
మనసుకు ఎదురు వెళ్ళటం
తెలియని కళ్ళకు
పక్షిలా ఎగరటం నేర్పించాలి
స్వేచ్ఛగా, స్వతంత్రంగా
గాలిపీల్చి
అలా… తల పైకెతి చూస్తే
అనాదిగా మనిషి మీద
మమకారం చూపించే
ఆకాశం… కనపడుతుంది
మనిషెప్పుడూ కాస్సేపైనా
ఆకాశాన్ని చూస్తుండాలి
ఊరడింపు కోసం
ఉరకలెయ్యటం కోసం !
November 21st, 2009 at 11:11 pm
స్వేచ్ఛగా, స్వతంత్రంగా
గాలిపీల్చి
అలా… తల పైకెతి చూస్తే
అనాదిగా మనిషి మీద
మమకారం చూపించే
ఆకాశం… కనపడుతుంది
అద్భుతం బాలాజీ గారు. మనసు మూలలలో వున్న బూజును దులిపేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కవితలు చదవడం అత్యంత అవసరం. ధన్యవాదాలు.
December 4th, 2009 at 4:35 am
పొయెమ్ చాల్ బాగుంది. ఎవరికి వారు తమ మనస్సుకు ఎదురు వెళ్లి తమను తాము చూసుకోగలిగితే, తనకు తాను మిగలడమే కాదు, తనలో ఇతర్లనూ చూసుకోగలుగుతాడు.
January 6th, 2010 at 9:18 pm
[...] చూద్దాం : పలమనేరు బాలాజి [...]
February 8th, 2010 at 1:00 pm
అనాదిగా ఆకాశ మనిషి మీద్ మమ్కరమ్ చూపుతొంది
మమకారమ్ కొసమె వెతకాలి మనిషి బతకాలి చాలా బాగుంది
July 2nd, 2010 at 2:50 am
బాలాజీ గారు,
మీ కవిత చాలా బాగుంది.
అభినందనలు.
e-mail:ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
October 23rd, 2010 at 5:55 am
“మనుషి…. కాసేపైనా
ఆకాశాన్ని చూస్తూఉండాలి”
చాలా బాగుంది..అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in