నీవు వదలిన నీ నీడల జాడలో

ఈ విశాల జీవన ఎడారితోవలో
నీవు వదలిన పాదముద్రలను వెతుకుతూ
అనంత తీరాల వెంబడి అన్వేషణ సాగిస్తున్నా…..

ఇవి ఒట్టి ఇసుక రేణువులా ….. కాదు
నీ అడుగుజాడల వెంబడి విరిసిన నక్షత్ర ధూళి !

నన్ను ఈ ఎండమావుల వదిలి నీవు
కానరాని తీరాల వెంట పయనమగుట భావ్యమా?

ఈ ఎడారి మూపున చిగురించిన
సగం కాలిన నెలవంక నీడల వెనక
నీవు వదిలిన నీ నీడల జాడలో
నా ఈ వెతుకులాట…..

సుదూరంగా….
నీ నవ్వుల ఒయాసిస్సు
కనురెప్పల తెరల మాటుగా……

4 అభిప్రాయాలు »కవితలు

4 Responses to “నీవు వదలిన నీ నీడల జాడలో”

  1. 1
    హెచ్చార్కె Says:

    ‘ఎడారి మూపున చిగురించిన
    సగం కాలిన నెలవంక నీడల వెనక
    నీవు వదిలిన నీ నీడల జాడ’
    కవి కట్టిన్ మాటల బొమ్మ చాల్ బాగుంది. పద్యమంతా హృక్ష్ఫయైన చిన్నిచిన్ని వూహలు. చివర ఒక అసంతృప్తి. ఇదంతా ఎవరో ఒక మంచి వ్యక్తి కోసం అని తెలుస్తోంది. అది చెప్పాల్ఫ్సింది. లేదా స్ఫురింజేయాల్ఫ్సింది.

  2. 2
    కెక్యూబ్ వర్మ Says:

    హెచ్ ఆర్కే గారికి: మీ సూచనకు ధన్యవాదాలు.

  3. 3
    satyadarshana Says:

    your way of talking in poetry is , in strict sense is incomprehenseble to me. i dont now the meaning of the words deserts, crescents,shadows,footfrints,and about dust of stars. so what i want in your writings is be free and merge with your words. words are people nothing esle. salute la monde,

  4. 4
    హెచ్చార్కె Says:

    సత్యదర్శన గారూ, మీరు ఏదో చాల మంచి సంగతి చెప్పారని అనిపిస్తోంది. అదేమిటో వివరంగా తెలుసుకోవాలని కోరిక. ఇంకొంచెం ఎలాబొరేట్ గా చెప్పగలరా! la monde ను వివరంగా కోట్ చేసినా మేలే…. హెచ్చార్కె.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో