Nov2009
రెడ్ సెల్యూట్ బాల గోపాల్!
ఈ విశ్వం తన అనంత అంశంలో
ఈ నిమిషం విషాద భరిత చరిత చరణ చరమ గీతం పాడింది
నిబద్ధ కార్యశీల, నిత్యసత్య పోరాటాల యోధుడు
కొత్తసృష్టి తపశ్శీలి … … … ఓ
నూతన మానవ ప్రాణి మీద … … … ఈ
విశ్వం తన అనంత అంశంలో
ఓ నిమిషం విషాద భరిత చరిత చరణ చరమ గీతం పాడింది
జోహార్లయ్యా ! జోహార్లు!!
హక్కుల సమర సాత్వికుడా ! శాంతి ప్రేమికుడా
మహాత్ముడా బాలగోపాలా!!
నీ పాదపాదాన పడీపడి దండాలు
నాపాలమూరు కన్నీటి పోరాటాల కవనకణ కంకణ నివాళులు
అమరుడా.. సముద్రుడా..పేదోల్ల చంద్రుడా…..
మనిషి మీద.. మరణం మీద .. పడి పడి ఏడ్చిన వాల్మీకుడా!
మార్గదర్పకుడా… మార్క్స్ ప్రతిబింబకుడా!!
జీసస్… బుద్ధ .. గాంధీ ..ధెరీసా… ఓరి నాయనో హరిశ్చంద్రుడా!
మార్చుకోవాలి కథలన్నీ మాతరం! ఈ తరం!
నడుస్తున్న కథాకళికుడు…..
నడుస్తున్న చరిత్ర ప్రవాహకుడు … … …
అవిశ్రాంత ధీరుడు … … … దీనుల కన్నుల కాంతి శోధకుడు … … …
శోకంలేని లోక క్రాంతి దర్శకుడూ … … …
వాడే మహోన్నత నూతన సూర్యుడు! బాల గోపాలుడూ!!
పిడికిలి బిగిస్తున్నానయ్య కామ్రేడ్
నీకు తల వంచిన త్యాగశీల సముద్రం ముందు!
రెడ్ సెల్యూట్
రెడ్ సెల్యూట్
బాల గోపాలా!!
మానవ హక్కుల ఉద్యమవిప్లవాం వర్ధిల్లాలి!!!
January 6th, 2010 at 4:59 pm
[...] రెడ్ సెల్యూట్ బాల గోపాల్! : జనజ్వాల [...]