January 2010 సంచిక

జనవరి 2010 సూచిక

ప్రాణహిత పాఠకులకు 2010 నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

కె. లక్ష్మా గౌడ్
కె. లక్ష్మా గౌడ్

ఈ సంచికలో…

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

చెప్పుకోవటానికేంలే

చెప్పుకోవటానికేం,
తలుపులు తెరిచే వుంటాయి! కోయిలల
ఋతువులు స్వేచ్ఛా గాలుల నినాదాల్ని
హోరు హోరుగా వినిపిస్తూనే వుంటాయి. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

ఒరిగి ఒరిగి మరణిస్తాను

ఇక ఎప్పటికీ
దక్కించుకోలేని నిన్ను …
ఊహల్లో దర్శిస్తాను ! మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »కవితలు

ఇప్పుడు నువ్వన్నదే సై

అమ్మ తెలంగాణా
కన్నీళ్ళ తులాభారమే పతిదినం నీకు
ఎక్కడ తప్పిపోయానే నేను మొత్తం చదవండి »

54 అభిప్రాయాలు »కవితలు

సుదర్శనుడి కళ్ళు

సుదర్శన్ – నీ కళ్ళు
చిన్నపిల్లల కళ్ళలాంటి నీకళ్ళు
దుఃఖాన్ని చూశాయి , భయాన్ని చూశాయి
అభయాగ్ని చూశాయి, ఆనందాన్ని చూశాయి
ఆనందానికి అవతలవున్న హింసను చూశాయి
బుల్లెట్ కొస దూసిన అహింసను చూశాయి
మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు

కరిగిన స్వప్నం

నివ్వెరపోయాను
నిశ్చేష్టుడనయ్యాను
ఇంతటి సున్నిత మనస్కున్ని కోల్పోవడం
ఈ పాడులోకపు ప్రారబ్ధం మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

చెకుముకీ!

జీవితాన్ని
ఆచరణాత్మక చరణం చేస్తూ
ఒక ప్రశ్నగా
ఒక ప్రమాణంగా
ఒక ప్రయాణంగా
బతికిన వాడా
నీపాద ముద్రల్ని
దారులన్నీ బీజాలుగా చల్లుకుంటాయి. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

తిష్ట !

ఇప్పటి హైదరాబాదును చెప్పటం
స్కూల్ ఫైనల్ కాదుకదా – జీవితాన్నే తప్పటం
దీనిమీద లేని ప్రేమను గుప్పటం
అయిన వారిని మత్పరిచ్చటం – మాయజేయటం మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

ప్రజల శక్తిగా…..!

అనుకుంటాం గాని – పారిపోవడం కష్టం
అసలింతకీ – దేనినుంచి ఎక్కడికి పారిపోవడం ? మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

పుస్తక మార్గం

ఊహ తెలిసినప్పటి నుండీ
పుస్తకాలను స్పర్శిస్తే చాలు
చందమామలు మా పెరటి చెట్టు కొమ్మలకు వేలాడేవి మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు

ఆంతరంగికం

కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం

ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో
చెరిపేస్తే చెరగదు  ఆపేస్తే ఆగదు మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు, ప్రత్యేక వ్యాసాలు

తాకట్టు

ఒక్క నిమిషం గేటు ముందు ఆగా…………….

ఆ చిన్న తుప్పు పట్టిన ఇనుప గేటును తోద్దామా…….వద్దా అని ఒక నిముషం ఆలోచించాను. రాత్రంతా నిద్ర లేని భారానికి తోడు ఏదో ఉద్వేగం శరీరాన్ని ఆవహించి వణికిస్తున్నట్టుగా ఉంది. సమయం ఉదయం ఆరు గంటలు కావస్తోంది. చిన్నగా వాన తుంపరలు పడ్తున్నాయి. చివరికి గేటుపైన ఉన్న గడియ తీస్తూ… కొంచెం ముందుకు తోసా.. కిర్రుమంటూ చిన్న శబ్దంతో అది తెరుచుకుంది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

పోరు తప్పదా !

రోషన్ మామగార్ని ఆదివారం రాత్రి పదిగంటలకు ఇంటికి పిలిపించమని తండ్రికి చెప్పాడు. అప్పుడు అమెరికాలో అతనికి ఆదివారం పొద్దున తొమ్మిది గంటలు అప్పటికి నిద్ర నుంచి లేవాలి! శనివారం తొందరగానే పడుకున్నాడు. తండ్రి మామగార్ని గురించి చెప్పిన దగ్గర్నుంచి అతనికి ఒళ్ళు మండిపోతున్నది సంధ్య మీద కోపంగా వున్నాడు. ఆమెతో మాట్లాడలేదు శనివారమంతా. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

పడమటి నీడ

“కిలో వంకాయలెంత?” బుట్టలోని వంకాయల్ని తదేకంగా చూస్తూ అడిగింది ఒకావిడ.

అప్పుడే తెచ్చిన కూరగాయల్ని సర్దే పనిలో వున్న తను తల పైకెత్తి కస్టమర్ వైపు చూస్తూ , తను కొన్నరేటు, కొంత లాభం నోట్లోనే గుణించుకొని

“కిలో వంకాయలు తొమ్మిది రూపాయలు ” అన్నాడు.

“చానారేటు చెపుతున్నావే?” అంది. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కథలు

తెలంగాణ సాహిత్యం – ప్రాంతీయత

స్థల కాలాల చైతన్యంతో, ప్రాంతీయ ముద్రతో , జనహితాన్ని కోరుతూ సమాజాన్ని ముందుకు నడిపించే ఉత్తమ సాహిత్యం. మన పూర్వ లాక్షణికులు  చెప్పినట్టుగా ఆనందోపదేశాలతో మంచికి దోహదం చేసేదే అసలైన సాహిత్యం. రచయిత పేరు లేకుండా కథను చదివితే స్థలకాలాల చైతన్యముండి అది ఫలానా ప్రాంతం నుండి వచ్చిందని తెలుసుకోగలిగే కథే ప్రాంత ముద్ర గల కథవుతుంది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

క్రాంతి దర్శి , మహారచయిత ఆళ్వారు స్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి [1915-1961]  తన కార్యకలాపాలు సాంస్కృతిక రంగంలో ప్రారంభించి జాతీయోద్యమ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య రాజకీయాలలోకి విస్తరించుకున్నాడు. క్రమక్రమంగా ఆయనలోని చైతన్యం ఒక నూతన జీవిత దృక్పథానికి దారితీసింది.’ ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు అందుకు ఉదాహరణలు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’

‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’

‘తన రక్షణ కోసం ఒక తలారి తప్ప ఏ సాధనమూ లేదనుకునే వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నదనుకోవాలి? తన క్రూరత్వాన్నే శాశ్వతమైన శాసనంగా ప్రకటించుకునే వ్యవస్థ. చాల మంది నేరస్తులను ఉరితీసి ఇంకా కొత్త నేరస్తులు పుట్టుక రావడానికి దోహదం చేసే ఈ తలారి వ్యవస్థను గొప్ప చేయడం కన్నా, ఈ నేర బీజాలను నాటుతున్న వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకునే అవసరం గురించి మనం తీవ్రంగా పూనుకోవాల్సి ఉంది.’
- కార్ల్‌ మార్క్స్‌, 1853
మరో డెబ్భై అయిదేళ్లు పోయాక ‘సుప్తాస్థిలు’ ధరాగర్భంలో నుంచి ఏవియో కనరాని, వినరాని రహస్యాలు చెప్తున్నాయని పించింది శ్రీశ్రీకి. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

Next »